హర్ష, వర్ష ల బ్రేకప్

హర్ష, వర్ష ల బ్రేకప్

రచన:: జయ

ఇక చాలు వర్ష ఇక్కడితో ఆపేద్దాం.
ఎంటి హర్ష  ఆపేసేది.
నాకు అర్ధం కాలేదు.
ఏమి అర్ధం కాలేదు నీకు వర్ష,
ఇక్కడితో మన లవ్ కి బ్రేకప్ చెప్పేద్దాం.
అదే ఎందుకు అని అడుగుతున్నా.
కారణం చెప్పు, నేను చేసిన తప్పు ఏంటో చెప్పు.
హా.. హా.. ఏమి చెబుతావ్ నీకు తెలిస్తే గా నాకు చెప్పేది.
అవును నీ లైఫ్ మీద నీకే  నమ్మకం లేదు.
ఇక నా గురించి నువ్వు ఎలా నిర్ణయ ఇస్తావ్

నువ్వే వచ్చావ్ ప్రేమ అన్నావ్.
నువ్వే నా ప్రాణం అన్నావ్.
ఇప్పుడు వద్దు బ్రేకప్ అంటున్నావ్.
సరే అలాగే
నేను నిన్ను అడిగాన
ప్రేమ కావాలని..
నేనున్న అంటూ వచ్చావ్.
మోడులా మిగిలిన నా జీవితాన్ని వసంతం లా
చిగురించేలా చేశావ్.
నీ నీడనై నీ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచిన నన్ను ,నువ్వు ఎక్కడ వదిలేశావో తెలుసా ! నువ్వు తప్ప నేను కూడా లేని నాలో మళ్ళీ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాను అంటున్నావ్.
గమనం తెలియక, దారి తోచక,నాకే నేను బరువై ,కరువై ,కన్నీరు తప్ప ఏమి కనబడని శూన్యం లో వదిలేస్తున్నవ్.
ఇది నీకు న్యాయమేనా.!

నువ్వు ఆడుకునేది మనిషితో కాదు.
మనస్సుతో.
మనిషికి గాయం అయితే కొన్నిరోజులో కొన్నినెలలో
మనస్సుకు గాయం అయితే ఒక జన్మ సరిపోదు.

పోనీలే ఏదైనా నువ్వు సంతోషం గా ఉండటం కావాలి నాకు.
నాది ఏముంది  రాజీపడి బ్రతకడం అలవాటు అయిన ప్రాణం.
మనస్సుకు ముసుగు వేసి కళ్ళు మూసుకుని బ్రతికేస్తా.

నువ్వు ఆకాశమంత ప్రేమను చూపిస్తే,వెన్నలలా కరిగిపోయి,నీలో ఒదిగిపోయా.
నువ్వు ప్రేమతో పిలిస్తే అదృష్టం అంతా నాదే అని పొంగిపోయా..
నే చిలిపిగా ఏ పేరుతో పిలిచినా పలికితే నా వాడు బంగారం అని మురిసిపోయా..

శిల లా ఉన్న నన్ను శిల్పం గా మలిచి నీ ప్రేమ పూదోట లో ప్రతిష్ఠించావు అనుకున్న.
కానీ ఆ తోటలోఉన్న వాడిపోయినపూలలో నేను ఒకదాన్ని  అని గుర్తించలేకపోయా..

హా..హ..పిచ్చిదాన్ని కదా హర్ష.
అవును ప్రేమ పిచ్చిదాన్ని అందరి నుంచి ప్రేమనే ఆశించే నేను.
నా నువ్వు అయినా నీ ప్రేమను ఆశించడం తప్పా.
ఏమో నాకు ఏమి అర్థం కావడం లేదు.
నిత్యం నీ తలుపు లోనే తలమునలకలయ్యే నేను
నన్ను తలవకు అని చెబుతుంటే.
అది విని నేను ఎలా బ్రతకగలను అనుకున్నావ్ హర్ష

పూర్వం ఒక పావురాయి గూడు లేక గోపురాన్ని చేరింది అంట.
ఆ పరమశివుడే నా గోపురాన ఎందుకు చేరవ్ పో.. అంటే  అప్పుడు ఆ పావురాయి,
గూడు లేని నాకు దారి చూపు దైవం నీవు .
నీవే నా గోపురాన ఎందుకు వాలవు అని ప్రశ్నిస్తే
నేను ఎక్కడికి వెళ్లి ప్రయోజనం ఏమి.
నీ చెంతే ఈ క్షణం నా ఊపిరి ని నీకు అర్పిస్తా
అని ప్రాణాలు విడిచింది అంట.
అలా ఉంది నా జీవితం.
పోనీలే పసుపు కుంకుమ తోడుగా నిను నాలో కలేపేసుకున్న ఎప్పుడో.
నా మనస్సు లో నీవు ఎప్పుడైతే చేరవో అప్పుడే నీవు నా భర్త గా మారిపోయావు.
ఇపుడు ఏమంటున్నావ్ పెళ్ళి చేసుకోను అనే కదా అంటున్నావ్.
మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది ఆ విషయం నీకే తెలియడం లేదు.
ప్రేమ అనేది నువ్వు ఆడుకుని వదిలేసే ఆట వస్తువు కాదు హర్ష.

ఎన్ని కబుర్లు చెప్పావ్ హర్ష. సరే లే అలా చూడకు నేను నిన్ను డిస్టర్బ్ చేయకూడదు అంతే గా నీవు కోరుకునేది.
నా ప్రేమ నీకు ఇబ్బంది అవుతుంది అంటే,ఆ చిన్న ఇబ్బంది కూడా నీకు నా వల్ల రాకూడదు.
నువ్వు ఎప్పటికి సంతోషం గా ఉండాలి.
అదే నేను ఎప్పటికి కోరుకునేది.

నాకు తెలుసు హర్ష నువ్వు ఎప్పటికి నా వాడివే,నేను నీ దానినే ఇది నా మనస్సు చెప్పే నిజం,నీవు ఎవరి మాటలో విని నన్ను కాదు అనుకుంటున్నావ్. ఇప్పుడు కోపంతో ఉన్నావ్.
నీ కోపం తగ్గిన తరువాత నీవే వస్తావ్.
అప్పటి వరకు నేను నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను హర్ష.
నువ్వు తిట్టినా,కోపాన్ని ప్రదర్శించిన ,ఏమి చేసినా నువ్వు అంటే నాకు పిచ్చె హర్ష.
నువ్వు వదిలేసిన,నేను వదలను.
నా తుదిశ్వాస వరకు నా ఊపిరి నీవే హర్ష.
తెలుసు ఇప్పుడు నీకు నేను ఏమి మాట్లాడిన నచ్చదు,వినవు కూడా.
ప్రశాంతంగా ఆలోచించు హర్ష,నేను ఏమిటో నీకు అర్ధం అవుతుంది.
చాలు వర్ష ఇక ఆపు.
సరే లే హర్ష ఆపేస్తా నీతో మాట్లాడటం,కానీ నిన్ను ప్రేమించడం కాదు గుర్తు పెట్టుకో హర్ష.
నువ్వు నా కోసం వచ్చే రోజు కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటా.
సరే బై వర్ష.
బై కాదు హర్ష ఉంటాను అను.

You May Also Like

One thought on “హర్ష, వర్ష ల బ్రేకప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!