దిశ చట్టం దాగింది

దిశ చట్టం దాగింది 

రచన :: కార్తీక్ దుబ్బాక

“దిశ “చట్టమా నీ వెక్కడ?
“దిశ “చట్టమా నీ వెందుకు?
ఎవరుమారాలి?ఏమిమారాలి?
మనుషులా? చట్టాలా?

ఏమిరాయాలి నేను,
నాకలం కన్నీరుకారుస్తుంది
ఒక అమ్మలా, ఓ నాన్నల
ఓ అన్నలా…………..

ఎవరుఓదార్చాలి ఆకడుపుకోత
ఎవరిని నిందించాలి నేనిప్పుడు
సమాజం పై రోత కలిగి

కలంకదుపుతున్నచిరాచుక్కలు
రాల్చుతున్న కన్నీటిచుక్కలుగా
మారనిమనుషులునుమార్చాలని
మనుషుల్లోమానవత్వంపెంచాలని
సమాజ పోకడ నచ్చక
నేనురాస్తున్న ఆక్రందన

మనుషులు మారాలి
చట్టాల్ని మార్చాలి
కళ్ల ముందు ఘోరం
చూస్తు,కదలని మనసుతో
సజీవ శవాలుగా,నిల్చిన
మానవత్వం మరిచిన
మానవుల్లో మార్పు కోసం…

మనిషి మృగం మైతే
సాటివారి ఆపదకూడ
మనకు వినోదం అయితే
మనిషి నీ స్థానం ఏమిటి?

సమాజం నీచంగా నేడు
పెరుగుతుంది, కదులుతుంది
ఏమనాలి, ఎవరిని నిందించాలి
ఏమై పోతుంది మన సమాజం,

సభ్యత మరిచిన మనుషులు
పెట్రేగిపోతున్న,మనిషిరూపు మృగాలు,ఐనాకదలనిసమాజం

ప్రతివారి లో నిర్లక్ష్య ధోరణి
ఆవహించికదలని కాలంనేడు
దుండగులుపెరుగుతున్న కాలం
దుశ్చర్యలు చేస్తున్న కాలం..

కనికరంలేనికామాంధునిచేతిలో
క్రూర మృగాలా మధ్యలేడిలా
బలిఅవుతున్నముక్కుపచ్చలారణి
భరతమాతముద్దుబిడ్డలు…….
ప్రతిరోజుఎందరో?ఒక చోట..

పెంపకంలోపమాసమాజపోకడా
అభాగ్యుల హత్యల లోకమా
దిశచట్టం అవగాహనాలోపమా
చట్టాలు చెత్తబుట్ట పైళ్ళు
మారని మానవ మృగాళ్ళు

ఎప్పుడు మారుతుందీ వ్యవస్థ
అబలకిఅండగాసమాజంమారదా….!!..ఎందుకు?
సమాజం మారాలి,నేడు
మనిషి దృక్పధం మారాలి
సాటి మనిషిని కాపాడాలి,

కఠినమైన ,తీర్పులు రావాలి ప్రేమోన్మాధులదుశ్చర్యలాగాలి
మరోయువతిబలికాకుండచూడాలి………….

యువత!తల దించుకోవాలి
యువతకు చైతన్యంకలగాలి
యువతలోమార్పురావాలి..

సమాజం పోకడ మారాలి
మానవత్వం పెరగాలి
మనిషైన,మనసున్న వాడికి….!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!