మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం తెలుగు
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: పుష్పలీల రేవతి
ఊరు::హైదరాబాద్

రక్షించి కాపాడు పర్యావరణం
మొక్కలను నాటి ఆనందించు
మొక్క మానై గాలినందించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

హరితహారం ఆహ్లాద శోభితం
వర్ష ఋతువుకు స్వాగతం
పుడమి పులకించు పచ్చదనం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కాలుష్యాన్ని అందరం అరికడుదాం
ఇంటికొక మొక్క నాటుదాం
వర్షాలకు అవకాశం కలిగిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

హరిత వర్ణమై మనదేశం
ప్రకృతి కాంతగా పరవశం
తరువులతో కలకలాడాలి కలకాలం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రతిఇంట్లో అవసమయ్యే చెట్టుండాలి
ప్రతి వీధిలో మహావృక్షాలు ఉండాలి
ప్రతిరోడ్డుకు ఇరువైపులా చెట్లుండాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!