మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: గుడిపూడి రాధికారాణి
ఊరు::మచిలీపట్నం,కృష్ణాజిల్లా

*మాత్రానియమ అంత్యప్రాససహిత ఛందో బద్ద సున్నితాలు*

మొక్కని నువు నిలబెట్టు
మొక్క నిన్ను నిలబెట్టు
వేయకు గొడ్డలి వేటు
చూడచక్కని తెలుగు సున్నితంబు

కమ్మనైన కాయలను
మధురమైన ఫలములను
చక్కనైన పువ్వులను
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రాణవాయువందించు
పుట్ట ఊయలందించు
గిట్ట కట్టెలందించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

నీడనిచ్చు చల్లగా
ఇంటికప్పు కాచుగా
రక్షించును మిన్నగా
చూడ చక్కని తెలుగు సున్నితంబు

నేలకోతనరికట్టు
సునామీల పనిపట్టు
భూసారం నిలబెట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!