మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: బత్తిన గీతాకుమారి
ఊరు::సత్తుపల్లి,ఖమ్మం జిల్లా

అందమైన కుసుమ సౌకుమార్యం!
తీయనైన ఫల మాధుర్యం!
ఆకుపచ్చని ప్రకృతి ఔదార్యం!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సూర్యతాపమును తాను హరియించి,
చల్లదనము జీవకోటికి పంచి,
ఊపిరినిల్పు ప్రాణవాయువు నందించి!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మొక్క పెంచిన పురోగతి!
చెట్టు తుంచిన తిరోగతి!
తరువులే లేకున్న అథోగతి!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

జీవులమనుగడకు చెట్టే మూలధనము!
వృక్షసంపద తరగని ధనము!
పర్యావరణ సమతుల్యతే మనకుప్రధానం!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

పిక్కలెన్నో ఏరి దాచుదాం!
చుక్కవాన పడితె నాటుదాం!
లెక్కలేనన్ని చెట్లు పెంచుదాం!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!