అమ్మ నీ కోసమే…

అమ్మ నీ కోసమే…

గుండెల్లో గాయం నా కన్నుల్లో కన్నీరు గా చేరేనే ….

గొంతులోని మౌనగీతం కరిగినే ఈ క్షణం….. 

చుట్టూ ఎంత మంది ఉన్నా ….

నీ అనురాగపు చూపులు మాయమైపోయే ఈ క్షణం… 

ఉప్పొంగే బాధలని ఓదార్చే దారేది….. 

నువ్వు వెళ్ళిపోయి ఆదరించే బంధాన్ని దూరం చేసావే… 

అమ్మా !… అమ్మా !…. అంటున్నా నా హృదయం పగిలిపోయెనే…. 

కన్నీటి దారాలే ఆగను అంటున్నా….

గుండెల్లో ఈ సెగలు నిన్ను తాకునా…..

ఈ లోకంలో నన్ను ఒంటరిగా విడిచి వెళ్లావు…. 

ఇది నీకు న్యాయమా ! అమ్మా !

ప్రేమగా పిలిచే నీ పిలుపు కోసం ….

ఆరాటంగా ఎదురు చూసే నా ప్రాణం….

కంటికి కనిపించని నీ రూపం చెదరదులే ….

నా గుండెలోని నీ జ్ఞాపకం…..

అందరిలో ఒంటరిగా వదిలి వెళ్లావు….

బాధ లో ఓదార్పుకు దూరం చేసావు…. 

చేరలేని నీ దారి కోసం ఎదురు చూస్తున్నా ఈ క్షణం….

చేర్చుకోవా నీ ఒడిలోకి ఉండలేను ఈ ఆత్మీయత లేని బాంధవ్యాల మధ్య…. 

రా అమ్మ నాకోసం ఒక సారైనా….

నీ ఒడిలో తల దాచి గుండె పగిలేలా ఏడవాలి…

బాధలు తీర్చే నీ అనురాగపు చేతులతో 

గోరుముద్దలు తినాలి రామ్మా ఒక్కసారి నా కోసం… 

అమ్మా !… ఒదిగి పోవాలి నీ గుండెల్లో పసిపాపలా….

నా సంతోషాన్ని నీ కొంగులో ముడివేశావు….. 

నా మాటలని నీ  గుండెల్లో దాచుకున్నావు….. 

నా కనులలో వెలుగుని నీతో తీసుకెళ్ళిపోయావు ….

కానరాని ఈ చీకట్లో… ఓర్చుకోలేని ఒంటరితనాన్ని మిగిల్చావు… 

అమ్మా !…నువ్వు లేని ఈ క్షణం……ఓడిపోతున్న నాతో నేనే..

              రచన: చలిమేడ ప్రశాంతి

You May Also Like

One thought on “అమ్మ నీ కోసమే…

  1. Enta mandhi chuttu unna amma place epudu special ye
    Apude puttina pasipapa nunchi musali valla daka
    Nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!