నా దరి చేరవా?

నా దరి చేరవా?

 

నా జ్ఞాపకాలకు రూపం నీవే

నా కవితలకు భావం  నీవే

నా మనసుకు దగ్గర ఉంటావు 

నా దరి చేరవా?? 

నా దరి చేరలేని దూరం అంటావు..

ప్రతి క్షణం అనిపిస్తుంది…

మన ఆలోచనలు ఒకటి కాకపోయినా

నీ పక్కనే ఉండి నిను చూడకపోయినా

నీతో నా జీవితంలో ఓరోజు గడపలేక పోయినా

నీ జతగా  కాసేపు నడవకపోయినా!!!

నా మనసుకి ఊపిరి నీ మాటలే

నా మనసుకి శ్వాస నీ నవ్వే

నా మనసుకి ప్రాణం నీ రూపమే

అన్నిటిని నా హృదయం లో పదిలంగా నిలుపుకోని

నన్ను  నేను వదిలేసుకుంటూ

నేను లేని చోటులోనే నిన్ను దాచుకుంటు

నిన్ను  నీకు వదిలేస్తూ 

నన్ను నీకు కనపడనీయకుండా చేస్తూ

మధురమైన నీ జ్ఞాపకాలను భారమైనా భరిస్తూ

నా కోసం  చంపుకుంటున్న నీ మనసుని మళ్లీ బ్రతికిస్తూ

నీ మనసులో నా ఆలోచనలు కూడా ఉండకూడదని కోరుకుంటు

నాకు దూరంగా పోతున్న నిన్ను పట్టుకొలేని ఆరాటమై ఉంటూ

నా ఊపిరిలో  నీ నవ్వుని నింపుకోని నిత్యం  నవ్వేస్తూ

నీ మౌనంలోనే   నీ మాటలని వింటూ

నా మౌనంలోనే నీతో  కాసెపు గడిపేస్తూ

నా ప్రతీ నవ్వులో నీ తలపులని తలచుకుంటు

నా ప్రతీ అక్షరాన్ని నీకు అర్పిస్తూ

నీ దూరాన్ని తట్టుకోలేని నామనసుని చంపుకుంటూ

నీ కోసం రాసే అక్షరాలకు ఇక సెలవంటూ

నువ్వు  కోరుకుంటున్న మన దూరాన్ని నీకే ఇస్తూ

నేను మాత్రం రోజు నీకే తెలియకుండా నీతో మాట్లాడుతూ 

చీకటితోనే చెలిమిని చేస్తూ

వదిలేస్తున్న బంధాలని వదలలేక వదిలేస్తూ

బాధని కూడా సంతోషమే అనుకుంటూ

మాటలకి అందని నా భావాలని  నీకు వినపడకుండా చేస్తూ 

నీకై తపించే క్షణాలు మరింతగా తపించిపోయాయి…

అనుక్షణం నీకోసమే తపిస్తూ  నిన్ను చేరుకోవాలని…

తపనలతో తనువులని  ఏకం చేసుకోవాలని !!

ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నా చెప్పటానికి 

ఏమిలేని ఒక మౌనమై మిగిలిపోతూ

రచన – సరస్వతి నిత్య

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!