నా దేవి కోసం

నా దేవి కోసం

నువ్వో కలవా??
కానే కాదు…!
కలవే అయితే..
నా కనులలో నిండిపోయే దానివి కాదు…
కలల నుండి నేను
మేలుకునే వాడిని కాదు…..

ఓ ఊహావా?
కానే కాదు..!
ఊహావే అయి ఉంటే ..
ఊహకందని ఊసువి అయ్యే దానివి కాదు…
నా ఊహాలోకం అంతా నువ్వే అయ్యే దానివి కాదు..

ఓ ఆశవా..?
కానే కాదు…
ఆశవే అయి ఉంటే..
నాలో కొత్త ఆశలకు ఊపిరి పోసే దానివి కాదు..
నా ఊపిరికి ప్రాణం నువ్వే అయ్యేదానివి కాదు…

ఓ కోరిక వా…?
కానే కాదు…
కోరికలే అయి ఉంటే …
నా కలలకి ప్రతి రూపం అయ్యే దానివి కాదు…
నా కోరికలకు కొత్త రెక్కలు తొడిగి నాతో ఉండేదానివి కాదు…

ఓ ఆలోచన మాత్రమేనా…?
కానే కాదు…
ఆలోచనే అయి ఉంటే నా ప్రతి ఆలోచన గమ్యం
నువ్వు అయ్యే దానివి కాదు..
నా జీవితం ప్రతి క్షణం లో నువ్వు మిగిలిపోయే దానివి కాదు…

ఓ జ్ఞాపకం మాత్రమేనా…?
కానే కాదు…!
జ్ఞాపకం అయ్యి ఉంటే నా ప్రతి గుండె సవ్వడి నువ్వే అయ్యే దానివి కాదు…
నే కోరుకునే ప్రతి జ్ఞాపకంకి చిరునామా నువ్వే అయి ఉండేదానిని కాదు…

కానీ నువ్వు నాకెవ్వరు…
మనకి సమాధానం తెలియని ఓ ప్రశ్నలో జంట పక్షులం
బంధమే తెలీని ఓ వింత మనుషులం..
కోరుకునే క్షణాల్లో మనసు కోరుకునే వింత ఆరాటం కి భాగస్వామ్య ప్రేమికులం..!

రచయిత :: తపస్వి

 

 

You May Also Like

5 thoughts on “నా దేవి కోసం

  1. Wow sir చాలా చాలా బాగుంది. మీ దేవి కోసం మీ ప్రేమ 👌👌👏🏻👏🏻👏🏻🌹🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!