రాశి

రాశి

సూర్యోదయాన్ని బ్యాగ్ సర్దుకుని వాటర్ బాటిల్ పట్టుకుని స్కూల్ కి రాశి బయలు దేరింది. బ్రేడ్ జామ్ తిని బాక్స్లో పెరుగు అన్నం పాలు పోసి తోడు పెట్టుకునిఓ అవకాయ ముక్క వేసుకునివెడుతుంది. కాచిన వేడినీరు త్రాగే అలవాటు వల్ల వాటర్ బోటిల్ కూడా పెట్టుకున్నది. ఈ రోజుల్లో ఆడపిల్ల మగ పిల్లాడు బేధం లేకుండా అంతా కూడా కష్టపడి చదువుతున్నారు. చదువు అయ్యాక ఆడపిల్ల అత్తారింటికి మగ పిల్లాడు ఉద్యోగానికి వెడుతూ ఉన్నారు. సమాజం ఎంత మారినా ఎక్కడ మారినా ఆడపిల్లకి చదువు ఒక ఆభరణంగా మిగిలింది కట్నాలు పెళ్లి కానుకలు మామూలే అన్ని ఇచ్చి పెళ్లి చేసినా ఆడపిల్ల పరిస్తితి మామూలే పండుగా పబ్బాలు ఆషాఢ పట్టిలు అన్ని పెట్టాలి కాదు అంటే అంటే సంగతులు. 

  రాశి చదువుతుండగానే తాతగారు మంచి ఆఫీసర్ నాన్న గల్ఫ్లో ఉద్యోగం. అమ్మ పరిస్తితి అంతంత మాత్రం ఓపిక లేదు. మనుమరాలు కనుక ఏమి అనరు మామ్మ తాతకి అమ్మ మహా గరమ్ కారణం ఇక్కడే గారంగా పెరిగింది పెద్ద మానుమరాలు కనుక అమ్మమ్మ దగ్గరే అన్ని నేర్చుకుంది.  

     తాతగారు తనకి ఈ ఓపిక ఉన్నప్పుడే రాశి పెళ్లి చెయ్యాలి. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది అమ్మమ్మకి తాతకి అమ్మ చాకిరీ చేస్తుంది. నాన్న ఏడాదికి ఒకసారి వచ్చి వెడతాడు. ఈసారి శ్రీ వేంకట రమణ వచ్చాక పెళ్లి చెయ్యమనాలి అని తెలుసున్న వారికి సంబంధాలు చూడమన్నారు. ఎదో నాలుగు సంభందాలు వచ్చాయి.తాతగారు మాత్రం దగ్గర సంబంధం అయితే ఎటువంటి గొడవలుండవు అని ఆయన అక్క మనవడు డిల్లీలో చేస్తున్నాడు అని తెలుసుకున్నాడు. వాళ్ళు సంక్రాంతికి వస్తారు వాళ్ళ నాన్న వాలంటరీ పెట్టీ వీడికి ఉద్యోగం ఇప్పించి ఉన్నారు పిల్లాడు పేరు శ్రీనివాస్. ఎంబీఏ చదివాడు వేరే సంబంధం ఎందుకు పెళ్లి కుదిర్చి చేద్దాము అన్నాడు. సరే వాళ్ళని పిలుద్దము అన్నారు. 

      సంక్రాంతికి బోమ్మల కొలువు పెట్టీ పేరంటం చేసి హడావిడిగా ఉంది. హాల్లో ఫోన్ మోగింది. రాశి వెళ్లి ఫోన్ తీసింది. హలో అన్నది నేను డిల్లీ అత్తని మాట్లాడుతున్నాను. మీ నాన్నకి ఫోన్ ఇవ్వు అన్నది నేను వల్లే మనుమరాలిని. తాతకి చెపుతాను అన్నది. తాతగారు ఫోన్ తీసుకుని ఆనందంగా మాట్లాడారు. వాళ్ళూ ఈ రోజు రాత్రి ఈ ఊరు వస్తారుట వారికి. ఇక్కడ ఒక సంబంధం చెప్పారుట. అది చూడటానికి వచ్చి మన ఇంటికి వస్తామని చెప్పారు. మన పిల్లని కుడ చూపిద్దాం అని చెప్పెలోగనే ఎవరో సంబంధం చెప్పేశారు పిల్లాడు ఉంటే ఎగరేసుకు నీ వెళ్లి పోతున్నారు. మనం ఆలోచించి సంబంధం చెప్పేలోపు పెళ్లి అయిపోతోంది అంటూ తాత ఖంగారు పడ్డారు 

     పేరంటం పూర్తి అయింది.రాత్రి భోజనాలు అయ్యాయి. ఇంక రాలేదు రాశి వెళ్లి పడుక్కుంది. పెరంటంతో అలసి పోయింది. నిద్ర పట్టేసింది తాత మామ్మ అమ్మ కళ్లోలో వత్తులు వేసుకుని కూర్చున్నారు. రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో కారు శబ్ధం వచ్చింది. అందులోంచి అత్తగారు మామగారు వారి కూతురు అల్లుడు వచ్చారు పిల్లాడు రాలేదు.  

    అక్కడ సంబంధం ఎలా ఉంది అన్నారు పిల్ల కొంచెం చామన చాయ ఉన్నది. కట్నాలు ఘనంగా ఇస్తామన్నారు, కానీ మా వాడు నల్ల పిల్లను చేసుకోడు అందుకు ఊరుకున్నాము. కానీ వాళ్ళు చీరలు స్వీట్స్ డిల్లీ పట్టుకెళ్ళమని ఇచ్చారు అంటూ నవ్వినది. పిల్లను చూపించరా అన్నయ్య అన్నది ఆ వచ్చిన పెద్ద ఆమే.

    ఆ అలగే అక్క అంటూ రాశిని తీసుకుని రమ్మన్నారు. నిద్ర లేపి లంగా ఓణి వేసుకోమని, పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. కళ్ళు నులుముకుని పెళ్లి వారి ముందు కూర్చుంది. అన్నయ్య పిల్ల నచ్చింది పెళ్లి ఖాయం రెండు రోజుల్లో ముహూర్తం ఉంది వాడని పల్లే నుంచి రప్పిస్తాను,  అంటూ ఒక డైలీ కట్టే సిల్క్ పువ్వుల చీర తీసి ఓ పావుకిలో స్వీట్ తీసి రాశి చేతిలో పెట్టంది.

      అత్తగారు పిల్ల ఎడమ చేతి ఉంగరం తీసి కుడిచేతికి పెట్టీ పెళ్లి ఖాయం అన్నారు. విచిత్రం పెళ్లి కొడుకుని చూడలేదు. చాలా తమాషాగా బొమ్మల కొలువులో బొమ్మల పెళ్ళిలా పెళ్లి కుదిరి పోయింది. పిల్ల ఎంతో అదృష్టవంతురాలు అన్నారు అంతా తాత మామ్మ. 

కన్య ధార పోసి పెళ్లి చెయ్యండి. మేము మళ్ళీ ఇప్పుడప్పుడే రాము వాడికి సెలవు లేదు అన్నారు. సరే మా అబ్బాయికి చెపుతాను అని అన్నారు. చెప్పండి కానీ రెండు రోజుల ముహూర్తం ఉంది చేసుకుని పిల్లని తిసుకెడతాము అన్నారు.

ఎప్పుడు తెల్లారుతుందా అని తాత మామ్మ కూర్చున్నారు. పెళ్లి పురోహితుడిని వారే పంపారు. అతను వారి తరుపు, వీరి తరుపు అన్ని కొని బిల్లులు ఇచ్చాడు. ఇంట్లోనే పండగకి కొన్న పట్టు చీర ఉంది.  ఎలాగా పెళ్ళీడు పిల్ల అని ఒక పట్టు చీర పెళ్లి చూపుల కోసం కొన్నారు, అది కాస్త పెళ్లి చీర అయింది. మాకు చెంచా కూడా సారే పెట్టవద్దు అన్ని స్వీట్స్ కూడా అరకిలో చాలు తినే వాళ్ళు లేరు అన్నారు  

    గృహప్రియకి వెళ్లి అరిసెలు, బుందిలడ్డు, కాజ, మైసూర్ పాక్ అర కేజీలు కట్టించి తెచ్చారు.పిల్ల చేతికి అత్తగారు గాజులు తీసి వేసింది మెళ్ళో ముత్యాల హారం వేసింది.  

ఆడపిల్ల వారు కన్యాదానం గొలుసు పట్టీలు ఓ గాజుల జత పెట్టారు. తండ్రి వచ్చాక మిగిలినవి పడతామన్నరు. మాకెందుకు మా పిల్లకి మేము చుసుకుంటాము అన్నారు. వాళ్ళ పిల్ల అల్లుడు మనుమలిద్దరు కూడా కెనడా వెళ్ళేవారు ఇక్కడే ఉంటారని చెప్పారు. 

   పెళ్లి సింపుల్ గా చేశారు ఏవో కొన్ని చీరలు పెట్టీ పంపారు. డిల్లీ రైలు ఎక్కించారు. డిగ్రీ కూడా పూర్తి కాలేదు. పెళ్లి తంతులు కూడా సింపుల్ గా చేశారు. రెండు రోజుల్లో మెడలో పసుపుతాడు నల్ల పూసలు రాశి స్నేహితులకు విచిత్రం అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసిన అవటం లేదు. తండ్రులు పెద్ద మొత్తం కట్నాలు కానుకలు ఇస్తామన్న సరే.. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని సామెత నిజం అయ్యింది 

     డిల్లీలో ప్రభుత్వ కొర్టర్ చాలా చిన్నగ ఉంది. మామగారు కొడుకు కోసం త్యాగం చేసి ఉద్యోగం వేయించాడు. రెండో కొడుకు డిగ్రీ అయి ఇంట్లో ఉంటాడు. రాశి పని ఏమిటి అంటే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి రోటి పిండి కలిపి ఉంచాలి. అత్తగారు స్నానం పూజ చేసి రోటి చేస్తారు. కొత్త కోడలు కదా అందుకని అంట్లు తోమడానికి పనిమనిషిని రెండు వేలు ఇచ్చి పెట్టారు. అది వచ్చేటప్పటికి వేడి నీరు కాచి ఇవ్వాలి చలి ఎక్కువ కొటు వేసుకుని వస్తుంది లంబాడీ మనిషి. అది వచ్చాక టీ వేడిగా పెట్టీ ఇవ్వాలి టిపిన్ వేడిగా గారే లేక బజ్జీ వేసి పెట్టాలి అలా నూనే వంట తింటేనే మంచిదని వారి ఉద్దేశ్యము. ఇడ్లీ ఉప్మా పనికి రాడు పిందు బిళ్ళలు మైదా ముద్ద అంటారు. ఇంకా పగలు భోజనం చెయ్యరు అత్త మామలు మాత్రం మజ్జిగ అన్నం రొట్టెలు తింటారు. శ్రీనివాస్ బాక్స్లో రొట్టెలు కూర పట్టుకేడతాడు 

     ఒక్కసారి వేసవి అయితే పాలు తోడు పెట్టీ అన్నం క్యారేజ్ పట్టుకెడతాడు. అది అత్తగారు సర్దాలి భార్య సర్ధకూడదు. మా శ్రినుకు గోంగూర పచ్చడి ఇష్టం అంటూ ఒక రోజు క్యారేజ్ లో అన్నం పెట్టీ మొత్తం అన్నంలో పాలు పోసి తోడు వేసింది.  అత్తయ్యా అని చెప్పేలోగా నాకు తెలుసు

వాడికి పాతికేళ్ల నుంచి క్యారేజ్ సర్ధి ఇస్తున్నాను. వేసవిలో చల్లదనం కోసం ఈ పెరుగన్నం. నువ్వు రొట్టెలు కూర బాక్స్ లో పెట్టు అన్నది. మారు మాట్లాడకుండా రాశి వెళ్లిపోయింది వేరే గదిలోకి. శ్రీను ఆఫీసుకు వెళ్ళాక లంచి టైమ్ లో గోంగూర పచ్చడి అన్నం అంటే ఫ్రెండ్స్ కూడా ఇష్టమే వాళ్ళకి కలిపి పెట్టాలి అని అనుకుంటే అన్నం అంతా తోడు కొన్నది అక్కడ అన్నము క్యాంటీన్ లో దొరకదు. 

   ఇంకో ఫ్రెండ్ తెచ్చుకున్న అన్నం శ్రీనుకి ఇచ్చి, శ్రీను పెరుగన్నం కొంచెం తను తీసుకున్నాడు. అల ఇద్దరు కలసి గోంగూర పచ్చడి పెరుగు అన్నం తిని ఇంటికి ఫోన్ చేశాడు. మా అమ్మకి కూడా నువ్వు ఉండి చెప్పా వద్ద అని. అపుడ చెప్పిన వినలేదు అంటే వింటాడా మహానుభావు డు

ఇంటికి వచ్చాక మీ అమ్మగారిని అడగండి అని ఫోన్ పెట్టేసినది.

     ఇలా రెండేళ్లు గడిచింది. కోడలు వచ్చాక ఖర్చు పెరిగింది బియ్యం సబ్బులు అన్నిను అంటూ అత్తగారు సాగదీసింది. ఇది బయట ఉద్యోగానికి పనికి రాదు. వంట వార్పు అంతంత మాత్రం రొట్టెలు వత్తడం నేర్పాలి అనుకుంది. కోడలు ఎంత బాగా చేసిన అత్తకి నచ్చడం లేదు. కూతురు ఇండియా మ్యాప్ లా వత్తినా బాగుంది అంటుంది. 

     కూతురి కుటుంబం పోషించిన ఖర్చు కనింపించదు. అదే కోడలి రాకతో ఖర్చు పెరిగింది, అని రోజుకు నాలుగు సార్లు అంటది.

     పెళ్లి అయి నాలుగేళ్లకు పురిటికి పంపారు కూతురు. కుటుంబం విదేశాలకు వెల్లేవరకు కోడలు పిల్లల్ని కనకూడదు. మధ్య మధ్యలో బంధువుల ఇళ్ళల్లో పెళ్లికి అత్తగారు కూడా ఉండి తీసుకెళ్ళి పెళ్లి పనీ అవి నా కోడలికి అలవాటు చేయాలి

చూపించాలి, దాని పెళ్లి తాటాకు బొమ్మల పెళ్ళిలా అయింది అనేది. పెళ్లి అనగానే ఆంధ్ర వస్తాము కదా పుట్టింట నుంచి ఒక పట్టుచీర పెళ్లివారు నుంచి ఒక సిల్క్ చీర ఇలా ఏవైనా నాలుగు చీరలు వచ్చేవి. అవి డిల్లీ వెళ్ళాక స్నేహితులకి ప్రదర్శన కోసం పిలిచే పార్టీ చేసేది స్వీట్స్ ఊరగాయలు కూడా ఇచ్చేది. ఇది ఒక వేడుకగా చేసేది. నోములు శ్రావణ మాసం వస్తె మాత్రం ఆంధ్రకు పంపేది కోడలు మెతుకులు ఖర్చు లెక్క చెప్పేది కొత్తలో రోటి తినలేక అన్నం ఎక్కువ తినేది. రాను రాను అలవాటు చేసుకుని రొట్టెలు తిని ఊరుకుంటుంది.

      పిల్లల్ని తీసుకుని వెళ్ళడం కోసం అంటూ ఒక చిన్న కారు కొని డ్రైవింగ్ నేర్పించారు. పెద్దది బేబీ క్లాస్, పిల్లాడిని ప్రి స్కూల్ ఇద్దరు మరియు అత్తగారు మార్కెట్ చెయ్యడానికి వెళ్ళేవారు. పిల్లలని దింపి మార్కెట్ పని చూసుకుని మళ్లీ స్కూల్లో వెళ్లి పిల్లలని తేచుకునేది అలా బయటి ప్రపంచం పిల్లలతో మొదలు. ఆఫీస్ నుంచి రాత్రి పదికి వస్తాడు. ఈలోగా తల్లి నాయన, నయన అంటు ఎదో ఒకటి రాశి పై నేరాలు చెప్పేది.

పాడకూడదు, నవ్వ కూడదు, కుట్టకూడదు ఆడకూడదు. వంట ఇంటి పనులు జీవిత పరమావది. మా అత్తగారు చుట్టాలు అంతా కలసి, వారు కొనే చోట లోన్ పెట్టీ ఇల్లు కొనిపించారు. ఆ అప్పు ప్రతి నెల తీర్చాలి. 

     పెద్ద పిల్ల ఎమ్ ఏ చదివింది. కాలేజ్ లెక్చెరర్ గా చేరింది. పిల్లాడు ఇంజనీర్ చదివి ఓ కంపెనీ లో జాబ్ సంపాదించాడు. 

పిల్లులు ఇద్దరు ఎదిగారు. మా ఆడబడుచు కొడుక్కి చెయ్యమని అత్తగారు పట్టు పట్టింది. మా ఇంట్లో కట్నాలు లేవు ఇంటి పని చేసే మనిషి చాలు లేదా వాళ్ళే నేర్పూకొంటారు. 

     ఆ మధ్య రాశి ఫ్రెండ్ అంద్రా నుంచి వచ్చింది. ఇల్లు గట్రా బాగానే ఉంది అన్నది.అయితే రోజు యాభై పులకాలు లేదా పూరీలు చెయ్యాలి. 

నువ్వు మనిషివా, యంత్రనీవా రోజు ఇలా చేస్తే ఎలా తల్లి. ముందు నువ్వు రోటి మేకర్ కొను అని అన్నది. 

చాలు చాలు మా అత్తగారు ఒప్పుకోరు. కరెంట్ ఆహారం పనికి రాదు. ఇప్పటికీ గీజర్ నీళ్ళు వాడుకొదు, కుక్కర్ అన్నం తినదు. రోటి మేకర్ పనికి రాదని చెప్పింది. ఆశ్చర్యపోయింది

రాశి నువ్వు డిగ్రీ పరీక్షలప్పుడు చూసాను మళ్లీ ఇప్పుడు చూసాను. ఎలా అయింది నీ ఫిజీ అన్నది. 

కరెస్పాండెన్స్ కొర్స్ చేశాను. అయినా ఉద్యోగం కుదరలేదు. ఇంటి పనికి మనిషికి చాలా జీతం ఇవ్వాలి. అందుకని నేను అన్ని పనులు చేసి జాబ్ చెయ్యడం కష్టం అని మానిపించారు.

రాశి పేరుకి తగ్గట్టే సుగుణాల రాశి. పెద్దలంటే గౌరవం. తాత మామ్మ దగ్గర పొందికగా పెరిగింది. ఎంత చదివినా గర్వం లేదు. చిన్న తనంలో పెళ్లి, కొత్త ప్రదేశం క్కొత్త వాళ్ళు దగ్గర ఎంతో పొందికగా ఒదిగి జీవితం మలచుకొంది. ఇలాంటి అమ్మాయిలు ఎందరో. వారు ఎప్పటికీ మర్చిపోలేని సంస్కృతి సంప్రదాయాల నెలవుగా జీవితాన్ని గడుపుతూ అత్తింటికి కీర్తి తెస్తున్నారు.

పిల్లలకి చాకిరీ ఇంటి చాకిరీ ఇవ్వన్నీ నాకు సరీపోయాయి అని నవ్వుకుంది 

డిల్లీ వచ్చి నేను పాతికెల్లు దాటుతోంది. వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్లిపోయారు. మా క్వాట్టర్ లో వృద్దులకు నేను కోడల్ని కూతుర్ని ఎందుకంటే ఏది కావాలన్న హెల్పికి న నన్ను అడుగుతారు. మా ఆయన కూడా నన్ను పంపుతూ ఉంటారు. ఇప్పుడు కాస్త బయటి ప్రపంచం జూమ్ లో కవితలు పాటలు రూపంలో ప్రపంచం చూస్తున్నాను అన్నది రాశి. 

      ఇలా ఎందరో ఆడపిల్లలు జీవితాలు అత్తైంటిలోనే గడుస్తాయి. ఇప్పటికీ అత్తగారు నేను అన్నం తింటుంటే పరిశీలిస్తూ ఉంటారు. నాకు కోడళ్ళు వస్తున్న సరే ఆవిడ పెర్మిషన్ తో రోటీ మేకర్ కొనాలి అన్నది.  

ఫ్రెండ్ నవ్వి అమెజాన్ లో బుక్ చేసి ,ఇది నా గిఫ్ట్ నువ్వు ఇంట్లో అందరికీ దీనిలో చెయ్యి మీ అత్తగారికి మాత్రం నువ్వు చెయ్యి అన్నది. 

నా అదృష్టం ఏమిటి అంటే మా అమ్మని అత్తింటి వారు నా ఇంట్లో ఉంచుకుని చూడనిస్తున్నరు. తమ్ముడు ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, అదే నాకు చాలా గొప్ప. వృధ్ధ ఆశ్రమంలో పెట్టీ అనకుండా మా అత్తగారు, మాఅమ్మను బాగా చూస్తున్నది .

  నా ఫ్రెండ్ డిల్లీ వచ్చినందుకు నేను చీర పెడితే అది నాకు రిటర్న్ గిఫ్ట్ లా రోటీ మేకర్ తెప్పించింది. కొందరు కాలంతో మారరు గొడవకు ఆనందపడుతారు అయితే ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కదా అందుకు మా అత్తగారు ఒప్పుకొన్నారు. 

మా ఇంట్లో ఇప్పుడు రోటీలు చాలా చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఇంట్లో చిన్న పార్టీలకు రాశి చేసి పట్టుకెళ్ళి ఇస్తు ఉంటుంది. దాన్ని ఒక బిజినెస్స్ గా మొదలుపెట్టి సక్సెస్ అయింది. ఎందరో స్త్రీలు అందరికీ వందనము.

బ్రతుకు నాటకంలో ఎన్నో పనులు. నానాటి బ్రతుకు నాటకము అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ఎం ఎస్ గళం నుంచి శ్రావ్యంగా వినిపిస్తోంది .

రచయిత:: నారుమంచి వాణి ప్రభాకరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!