బాలమ్మ గారి బాబిగాడి పెళ్ళి.

బాలమ్మ గారి బాబిగాడి పెళ్ళి.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

“ఒరే రాముడు నీ కొడుకు బాబిగాడి పెళ్ళి, నా లక్షవత్తుల నోము. నే బ్రతికుండగా అవ్వవురా అన్నారు. మనుమడు పెళ్ళి గురించి కొడుకు  రామారావు తో బాలమ్మ గారు.” బాబిగాడు బి.టెక్ పాసై ఎనిమిదేళ్ళయి హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా క్యాంపస్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయి. ఇప్పుడు ప్రాజెక్టు లీడర్ గా పనిచేస్తున్నాడు
నెలకు రెండులక్షల జీతం. ఒక్కగా నొక్క కొడుకు అవడం చేత అవకాశాలు వచ్చినా విదేశాలకు వెళ్ళలేదు. నల్లకుంట శివం బిల్డింగ్ దరి లంకంత ఇల్లు. బామ్మ పెంపకంలో ముద్దుగా పెరిగాడు.
“ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే ప్రమోషన్ వస్తే తల్లి బతికుండగానే పెళ్ళి చేశాయలని సంకల్పించిన రామారావు గారికి మగపిల్లాడి పెళ్ళి కష్టమని తెలిసింది.” మీ వాడు అమెరికా వెళ్ళడా! మీరు మీ దంపతులిద్దరు బామ్మగారు పిల్లడి దగ్గర ఉంటారా.పిల్లాడు ఇంకా కారు కొనలేదా ఎన్ని ప్రశ్నలో వేస్తున్నారు. పిల్ల కన్నా పిల్ల తల్లికే కోరికలు. కట్నం తీసుకోమంటే ఆఖరికి బాబిగాడికి మగతనం లేదని పుకారు పుట్టించారు. “చివరికి పోస్ట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్న ముకుందయ్య కూతురు డిగ్రీ పాసాయి టీచర్ ట్రైనింగ్ అయింది.” కార్పోరేషన్ స్కూలులో టీచర్ గా పనిచేస్తోంది. బాలమ్మ గారికి కార్తీకసోమవారం శివుడి గుళ్ళో ముకుందయ్య పిల్లతో బాటు కనిపిస్తే మనుమడికి పిల్లనడగడం. ఆయన మరునాడు వచ్చి రామరావు గారికి చెప్పడంతో, తల్లిని వాడు ఇంజనీర్ ఎలాగే అమ్మ అంటే, “ఒరే అన్నీ ఆలోచిస్తే పెళ్ళిళ్ళవవు. తెలుసున్నవాడు వీడిలా పొద్దస్తమానం ఉద్యోగం ఉండదు.” వేళకు స్కూలుకు వెళ్ళడం సెలవులు ఉంటాయి. నీవు నాకొక్కడివి. నీకు బాబిగాడొక్కడే ఆలోచించు ముప్పై ఏళ్ళు దాటిపోయాయి. ఇంక పిల్లనెవ్వరు ఇవ్వరు అన్నది చాటుగా విన్న బాబిగాడు బామ్మ చెప్పింది నిజమే అనడం, పెళ్ళి  పదిరోజుల్లోనే కార్తీమాసంలో జరిగిపోవడం. “హమ్మయ్య బతికుండగానే బాబి గాడి పెళ్ళి చూశానని  సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు  బామ్మ బాలమ్మగారు”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!