ఈ కన్నీళ్ళు ఇంకెన్నినాళ్ళు

ఈ కన్నీళ్ళు ఇంకెన్నినాళ్ళు

రచయిత :: బండారు పుష్పలత

ఇంకెన్నాళ్ళ ఇంకెన్నాళ్ళ
ఈ బికారిబతుకులు
క్షుధార్తుల బాధలు
అన్నార్తుల కేకలు
రైతన్న ల చావులు

ఎన్ని యుగాలు గడిచినా
ఇన్ని ఏళ్ళు మారిన
ధనవంతుల వారసులు దర్జాగా వున్నారు
లేనివాళ్లు బతుకులింతేనని
శాసన మెవరు రాశారు
ఏగొప్ప దేవుళ్ళశాపనార్థాలివి

అందరి తలరాతలు
ఆ బ్రహ్మే గా రాసేది
బీదవాళ్ళ తల రాతలు చిత్రగుప్తుడేమైనారాశాడా
ఎవరైనా పుట్టేది అమ్మ కడుపు నుండేగా

పంచభూతాలు
సమంగావున్నపుడు
లేని వాళ్ళు వున్నవాళ్లు అని తరత్యంయమెందులకు

సూర్యనికి విన్నవించాల
చంద్రుణ్ణి అడగాలా
చుక్కలుగా మారినేను రెక్కలు కట్టుకు దేవకన్యలా రావాలా

ఈ దరిద్ర దేవతను
కండించు ఖడ్గము
తేవాలంటే
హిమాలయ శిఖరాల తాకి నేను తేవాలా
మేఘాలను మలచాలా
పాతాళం వెళ్లాలా,సముద్రుడి లోతులో చూడాలా..
నామాటల ఖడ్గాలను సమాజానికి సంధించి ఈ వ్యత్యాసపు రక్కసిని కూకటి వేళ్ళతో పెకిలించి వరకు ఈ అక్షరప్రయాణాన్ని ఆపాను నా కంటి రెప్పవాల్చను ఇదే నా సందేశం ఇది శాంతి కపోతమై ఇంటింటా వాలాలి ప్రతి మనిషి మనసులో నాటుకుపోవాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!