బంగారు కలశం

బంగారు కలశం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధవి కాళ్ల

          రేయ్ ఈరోజు రాత్రికి ఆ ఇంటికే వెళ్లి కలశం తీసుకొని వచ్చేద్దాం అని చెప్పాడు కాళీ. సరే అన్న అని చెప్పారు మిగత రౌడీలు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆ రౌడీలు ఆ ఇంట్లోకి వెళ్లారు అక్కడ కలశం కోసం ఇల్లు మొత్తం వెతికారు కానీ ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఇంటి యజమానికి మెలుకువ రావడం గమనించి గోడ దూకి పారిపోయారు రౌడీలు. అది గమనించిన ఇంటి యజమాని నా జాగ్రత్తలో నేనున్నాను అది మంచిది అయింది అనుకొని నిద్ర పోవడానికి వెళ్ళిపోయాడు. ఇల్లు చూసి సావిత్రి ఎక్కడ వస్తువులు అక్కడే చిందర వందరగా ఉన్నాయి అది చూసి ఏవండీ నిన్న రాత్రిరే కదా శుభ్రంగా సర్ది పెట్టాను ఇప్పుడేంటి  చిందరవందరుగా ఉంది అని అడిగింది. అది నిన్న రాత్రి ఇంట్లోకి పిల్లి వచ్చింది దాన్ని బయటికి పంపించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అని చెప్పాడు విశ్వనాథ్. అదా సంగతి ఇవ్వడం లేవొచ్చు కదా అండి అని అడిగింది సావిత్రి. పర్లేదు సావిత్రి ఏం కాదు అని చెప్పాడు విశ్వనాథ్. ఇద్దరు ఒకే స్కూల్లో టీచర్ గా పని చేసున్నారు వాళ్లకి ఇద్దరు ఆడపిల్లలు సంవత్సరం కిందటనే చిన్న కూతురికి పెళ్లి చేసి పంపించారు మొన్ననే విశ్వనాధ్ రిటైర్ అవ్వడం వల్ల సావిత్రి ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ కలశం ని తీసుకొచ్చారా ఎక్కడుంది అని అడిగాడు పాండు. సిటీలోనే పెద్ద రౌడీ పాండు ఎవరినైనా చంపాలన్నా ల్యాండ్ డీలింగ్స్ చేయాలన్నా అన్నిటికీ పాండు కి సంప్రదిస్తారు అంత పెద్ద రౌడీ పాండు. పాండుకు తెలిసిన ఎమ్మెల్యే ద్వారా ఈ కలశం గురించి తెలుసుకున్నాడు ఒక దుబాయ్ షేక్ కి ఈ కలశం కావాలని ఎంత డబ్బైనా ఇస్తాను అని పాండుకీ డీల్ ఇచ్చాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి కలశము ఒక భూమిలో పాతిపెట్టారంట ఆ కలశంలో వజ్రాలు వైడూర్యాలు ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు ప్రజలు. ఈ కలశం చాలా విలువైనది అని చెప్తున్నారు. దొరికిన వారికి తగిన నగదు ఇస్తామని పోలీసులు ప్రచారం చేస్తున్నారు ఆ కలశం ఫోటో కూడా చూపించారు ఆ కలశం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తుకు రావట్లేదు సరోజకి. అక్కడే ఉన్నా సరోజ ఇంటి పనిమనిషి ఆ ఫోటోని చూడగానే ఏదో గుర్తుకొచ్చిన దానిలా అమ్మగారు నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది సరోజ ఆలోచన నుండి బయటకు వచ్చి సరే వెళ్లు అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఆ కలశాన్ని ఎక్కడ చూశాను అబ్బా అని. ఆ పనిమనిషి వెళ్లి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఆ కలశం గురించి చెప్పుద్ది వాళ్ళ ఆయన ఎవరో కాదు కాళీ. ఈ విషయం పాండుకి చెప్పి ఈ రాత్రికి ఆ కలశాన్ని దొంగతనం చేసుకొని వస్తామని చెప్తాడు కాళీ. దానికి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు పాండు. అదే న్యూస్ పేపర్ లో చూసి ఆ కలశం ఎలాగైనా ఒక దగ్గర దాచి పెట్టాలని అనుకున్నాడు విశ్వనాథ్ తన అనుకున్నట్టే ఎవరికీ తెలియకుండా ఒక దగ్గర దాచి పెట్టాడు. ఈ విషయం సావిత్రి కూడా తెలియదు. దేవుడు గదిలో ఉన్న బంగారు కలశాన్ని తీసేసి తన స్థానంలో నకిలీ కలశం పెట్టాడు విశ్వనాధ్ ఆ రౌడీలు ఆ చీకట్లో కలశాన్ని గుర్తించలేకపోయారు. ఒక రోజు మహిళా సంఘం నుంచి వస్తున్నాము అని చెప్పి విశ్వనాథుని మాటల్లో పెట్టి ఇల్లు మొత్తం వెతికారు ఆ గుంపులో పక్కింటి సరోజ కూడా ఉంది. దేవుడి గదిలో ఉన్న నకిలీ కలశాన్ని ఎవరికీ తెలియకుండా తన ఇంటికి తీసుకెళ్లి పోయింది. అది గమనించిన సరోజ ఇంటి పనిమనిషి సరోజకి తెలియకుండా రాత్రిపూట కలశాన్ని దొంగలించింది. మనిషాట్ రోజు ఉదయం మరుసటి రోజు ఉదయం సావిత్రి పూజ చేద్దామని దేవుడి గదికి ఎందుకో వెళ్ళింది అక్కడ కలశం కనిపించపోయేసరికి కంగారుగా ఏవండీ కలశం కనిపించట్లేదు అండి అని చెప్పింది. విశ్వనాధ్ కంగారు పడొద్దు సావిత్రి ఆ కలశాన్ని నేనే తీశాను అదిగో అక్కడ ఉంది చూడు అని చెప్పాడు. ఆ కలశాన్ని కాళీ తీసుకొని పాండుకిచ్చాడు పాండు వెంటనే దుబాయ్ షేక్ ఫోన్ చేసి చెప్పాడు దుబాయ్ షేక్ ఏమో రెండు రోజుల తర్వాత నేనే వస్తాను అని చెప్పాడు. పోలీస్ ఇన్ ఫార్మర్ పాండు గ్రూపులో ఒకడున్నాడు ఈ విషయం గురించి పోలీసులకు ఎప్పుడు కప్పుడు ఫోన్ చేసి చెప్తూనే ఉంటున్నాడు దుబాయ్ షేక్ వచ్చిన రోజే వీళ్ళందరూ అరెస్ట్ చేయాలని ప్లాన్ వేస్తున్నారు. విశ్వనాథ్ వాళ్ళ ఊరు విజయనగరమైన అక్కడ వాళ్ళ నాన్న ఒక స్థలం కొన్నాడు ఆ స్థలంలోనే దొరికింది ఈ బంగారు కలశం దొరికింది కానీ విషయం ఎవరికీ చెప్పలేదు, అక్కడికి వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు తన తండ్రి చనిపోయే టైంలో ఈ కలశం గురించి చెప్పాడు. ఇది ఇంట్లో ఉండడం వల్ల ఎంతో సుఖదుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాము అని కొన్ని పుస్తకాల్లో నేను చదివాను అని పేరు తన తండ్రి గారు చెప్పారు చాలా మంది దాన్ని అమ్మేస్తే ఎన్నో డబ్బులు వస్తాయి అని అనుకుంటున్నారు. చాలామంది ఇది కేవలం డబ్బు కోసమే అమ్మాలి అని అనుకుంటున్నారు. అని చెప్పారు ఇదంతా ఒకసారి మనసులో అనుకుంటున్నాడు విశ్వనాథ్ తన తండ్రి కి ఇచ్చిన మాట ఎప్పటికీ నిలబెట్టుకుంటానని ఆ కలశం ఎక్కడ పెట్టానని ఎవరికి తెలియకుండా ఉన్నానని తన తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. దుబాయ్ షేక్ రెండు రోజుల తర్వాత రావడం పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేయడం ఆ కలశాన్ని పరీక్షించి అది నకిలీది అని తెలుసుకొని అసలైన కలశం ఎక్కడ ఉందో  కనుక్కోడానికి గట్టిగా కోటింగ్ ఇచ్చారు పోలీసులు. విశ్వనాధ్ తన చిన్న కూతురు వచ్చి తను తాతయ్య కాబోతున్నాడు అని చెప్పింది చాలా ఆనందంగా ఉన్నారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!