అమృతమూర్తులు

అమృతమూర్తులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:అయ్యలసోమయాజుల ప్రసాద్

               సాయింత్రం ఆరుగంటలకు ఆఫీస్ వదిలితే  ఇప్పుడా రావడం టైం ఎంతయిందో తెలుసా రాత్రి తొమ్మిదిన్నర. ఇప్పటివరకు నాన్నగారు నీకోసం వీధి గుమ్మంలో చూసి భోజనం దగ్గర కూర్చున్నారు. ఆయనకి డెబ్భై ఏళ్ళు పై బడ్డాయి. నాకేమో  అరవై ఐదు దాటాయి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది కదా అని సుశీలమ్మ  ముపై ఐదు ఏళ్ళు దాటిన  కూతురు లతతో నెమ్మదిగా అన్నారు. లత అమ్మా నేను ఆరుగంటలకే లేటవుతుంది అంటే ఫోను చేస్తాను ఎప్పుడు నీకు తెలియంది కాదు ఈ రోజు నా మనస్సు బాగాలేదు మెట్రో పట్టుకుని వచ్చేసరికి  లేటయింది అన్నది. ఎదిగిన కూతురుతో పద భోజనం చేద్దువు నాన్న గారు చూస్తున్నారు అన్న తల్లితో అలాగే అని కాళ్ళు కడుక్కుని భోజనాల గదిలో ఉన్న తండ్రి పరమేశ్వర రావు గారి దగ్గరకు వెళ్ళింది. తండ్రి రా అమ్మ రా అని ఆప్యాయంగా పిలవగానే అతని పక్కనే కూర్చుంది. పరమేశ్వర రావు సుశీలమ్మలకు ఒక్కగా నొక్క కూతురు లత. పెళ్ళయిన పన్నెండు సంవత్సరాలకి పుట్టింది.
స్కూలుకు హెడ్ మాష్టారు చక్కటి అధ్యాపకునిగా నలభై సంవత్సరాలు పనిచేసి విశ్రాంత జీవనం, సమాజ సేవ చేస్తు ఎందరికో మార్గదర్శనం చేస్తు భార్య సుశీలమ్మ తో హైదరాబాద్ లోని శివం బిల్డింగ్ దగ్గర స్వంత ఇంట్లో ఉంటున్నారు. తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన లత ఉస్మానియా లో బిటెక్ చేస్తున్నప్పుడే క్యాంపస్ లో ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం లో చేరిన ఏడాదికి పరమేశ్వర రావు గారి చిన్ననాటి మిత్రుడు రిటైర్డ్ జడ్జి సంపన్నుడు బంజారాహిల్స్ లో ఉన్న రామారావు వారి భార్య యశోదమ్మ కోరిక పై అమెరికా లో ఉన్న వారి అబ్బాయి మధు తో కట్నం లేకుండా కూతురిని సంప్రదించి ఉన్నంత లో ఘనంగా వివాహం ఇరవై మూడేళ్ళ వయస్సులో లతకి జరిపించారు. కూతురు అదృష్టం చూసి అందరి తల్లిదండ్రులాగే మురిసి పోయారు. అల్లుడు శోభన్ బాబులా పూర్వ హీరోలా ఉన్నాడు చదువుకున్నాడు. మిత్రుని కొడుకు అదృష్టం మీదే అని పెళ్ళికి వచ్చిన వారు అంటుంటే మురిసిపోయారు. అత్తవారింట్లో రిసెప్షన్ కి సినీ పరివారం, మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు రావడం లంకంత బంగ్లా నౌకర్లు ముఖ్యంగా వియ్యాల వారి అనురాగ ఆప్యాయతలు చూసి కూతురు అదృష్టవంతురాలు అనుకున్నారు. అల్లుడు మధు, కూతురుని తీసుకుని అమెరికా వెళుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను అన్న అల్లుడి మాటతో ఎంతో ఆనందం పొందారు. ఆరునెలలు గడిచే సరికి లతకి భర్త రేవ్ పార్టీలకి రమ్మనడం, మందుకు అలవాటు పడటం చూసి మార్చడానికి ప్రయత్నం చేసినా పల్లెటూరు దానివి నీకు ఏమితెలియదు అంటూ వారించే వాడు, అయిన భర్త ను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. ఆమె మాట వినక పోగా శాడిస్ట్ గా ప్రవర్తించడం చూసి భాధ పడేది. తల్లిదండ్రులకి బాగానే చూసుకుంటున్నారు అని చెప్పేది. ఒక రోజు  న్యూయార్క్ లో ఉన్న స్నేహితురాలు పద్మ చికాగో వచ్చి పరిస్థితి చూసి లతతో ఇక్కడ నీవు మా వారి ఆఫిస్ లో కంప్యూటర్ అనలిస్ట్ గా జాయిన్ ఆవు.
మానసిక ప్రశాంతత ముఖ్యం నిన్ను చూస్తే భాధ వేస్తోంది అనగానే తన కాళ్ళ మీద తాను నిలబడాలని భర్తకిస్టం లేక పోయినా ఉద్యోగంలో జాయిన్ అయింది. యేడాది గడిచినా భర్త శాడిస్ట్ గా బాగా మారడం, స్నేహితురాలు తనకు తెలియకుండా తండ్రికి చెప్పడం వలన ఒక రోజు తండ్రి ఫోన్ చేసి నిజం తెలుసున్నాడు. లతతో అమ్మ ఇప్పుడు నేను స్నేహితుడిలా చెబుతున్నా, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన వాడిని, నీ జీవితాన్ని కూడా తీర్చిదిద్దుతామని, మొత్తం మీద విడాకులు తీసుకుని హైదరాబాద్ వచ్చింది. తిరిగి ఇన్ఫోసిస్ లో జాయిన్ అయి పదేళ్ళ బట్టి ఉద్యోగం చేస్తోంది. తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఒకరోజు ఆఫిస్ లోని  సహ ఉద్యోగి ప్రశాంత్, లత తో వివాహా ప్రస్తావన తెచ్చినపుడు తిరస్కరించిన మరల ఈ రోజు నిర్ణయం చెప్పమన్నప్పుడు ఆఫిస్ క్యాంటీన్ లో భవిష్యత్ గురించి ఆలోచించింది. అందుకే భోజనానంతరం తండ్రితో విషయం చెప్పింది. వెంటనే తండ్రి అమ్మ మేము పండిన పండ్లలా ఉన్నాము మేము ఎప్పుడో చెట్టునుంచి పండు పడినట్లు రాలిపోవడం సహజం. జీవితం నీది ఇక కులం సంగతి ఆలోచించకు ప్రశాంత్ మంచి వాడు  అని చెబుతుండగానే సుశీలమ్మ  క్రిందటి సారి మనిటింకి వచ్చినప్పుడు చెప్పాడు భార్య పోయింది.
నీకు ఈడు జోడు నలభై ఏళ్ళు వచ్చిన పెద్దల ఎడల గౌరవం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. అన్ని విషయాలను చెప్పాడు. మేము ఎంతకాలం ఉంటాము. మాకేమి అభ్యంతరం లేదు
లోకమా దాని తీరే అంత. ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరూ పట్టించుకునే సమయం లేదు. సరి అయిన సమయంలో చేయవలసిన పని చేస్తే, అవకాశాన్ని వదులు కుంటే జీవితమంతా భాధ పడవలసి వస్తుంది. జీవితాంతం తోడు నీడ గా ఉండవలసిన భార్య భర్తల బంధం అన్ని బంధాల కన్నా ముఖ్యమైనది అని కూతురి తలను ఆప్యాయత తో నిమిరినపుడు లత కి తల్లిదండ్రులు పరదేవతా స్వరూపులే మీరు అని తండ్రి హృదయం పై ఐదేళ్ళ పిల్లలా తలపెట్టుకుని తల్లి చేయిని ప్రేమతో పట్టుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!