కొత్త విధానము

కొత్త విధానము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సూర్యోదయంతో పాటు మనిషికి ఆర్థిక బంధాలు మొదలు. పాల వాడు, కూరల వాడు, టిఫిన్స్, పళ్ళు ఈ ఖర్చు రోజు ఉంటుంది. సుందరయ్య అధ్యాపక వృత్తి చేసి విశ్రాంతిలో ఉన్నాడు. తల్లి రత్తమ్మకి సిటీ లో ఉండను నా సొంత ఇంటిని వదిలి రాను, ఖచ్చి తంగా నేను ఉండలేను. ఆ అపార్ట్మెంట్లో ఉండలేను
మడి ఆచారం కుదరదు నేను, మీ నాన్నా కలిసి ఇక్కడే ఉంటాము. సత్తెమ్మ వచ్చి వండి పెడుతుంది. సుబ్బయ్య బయటి పనులు చేసుకుని వస్తాడు.
మనిషి కి మనిషి తోడు ఇన్నాళ్లు నువ్వే ఉన్నావా! నేను ఆయన ఆర్ ఎమ్ పి డాక్టర్ నీ పెట్టుకుని మా తిప్పలు మేము పడ్డాము. నువ్వు పెద్ద ఉద్యోగము చేసావు. నీకు సమయం కుదరదు కోడలు అన్ని అదే పడుతుందని తెలుసు. మేము మళ్ళీ దానికి భారం ఎందుకు? నువ్వు ఇన్నాళ్లు ఉద్యోగాలలో సరిపోయింది. ఇప్పుడు మమ్మల్ని సిటీకి ఎందుకులే? వద్దు మేము ఇక్కడే ఉంటాము అన్నది.
సుందరయ్య చేసేది లేక వాళ్ళతో పాటు కొన్నాళ్ళు ఉండి మళ్లీ సిటీలో ఉన్న కుటుంబం దగ్గరికి వెళ్ళి పోయాడు. ఈలోగా చెల్లెలు రమ్య, మరిది రమణ తో పట్నం చూడటానికి వచ్చింది.  అది రెండేళ్ల కోసారీ వచ్చి వెలుతుంది. బట్టలు పెట్టీ పంపుతుంది భార్య వల్లి.  ఇది ఎప్పటినుంచో జరుగుతోంది. అన్నయ్య బెంగ వచ్చింది నిన్ను చూడాలి అంటుంది.
ఉన్నట్లు ఉండి రమ్య వచ్చింది. ఏవో చిట్కాలు చేశారు తగ్గ లేదు కొంచెం ఉపశమనం కలిగింది.
మేనత్త కొడుక్కి చేశారు. బావ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, అన్నయ్య తో సంబంధం కలుపుకోవాలి అని ఆశా, ఒక్క కొడుకు ఇంజినీర్ చదువు చదివి పూణే లో పనిచేస్తున్నాడు. మళ్లీ ఉన్నట్లు ఉండి పన్ను పోటు మొదలు. కూతుర్ని పిలిచి నువ్వు అత్తని పళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించు అంటూ ఐదు వేలు చేతిలో పెట్టాడు. దీనితో పాటు ఇంకా మాస్క్ లు, సానిట రైజర్స్ అన్ని పట్టుకు వెళ్ళాలి అందుకే బయటకు వెళ్ళాలి అంటే విసుగు, చిరాకు, అని విసుగు కున్నాది. అయినా మరీ వెళ్ళడం తప్పదు కదా! అంతెందుకు రా అన్నయ్య అన్నది. ఈ రోజుల్లో తినే తిండీ కన్నా వైద్యము చాలా ఖరీదు అన్నాడు, పోనీలే ఇక్కడ ఉండగా వచ్చింది. మీ ఊరు వెళ్ళాక వస్తె మళ్ళీ కష్టం కదా!
అవును.. అనుకుంటూ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ, సాంబారు తిని స్కూటర్ పై అత్త, కోడలు బయలు దేరారు.
ఓ పెద్ద భవనం ముందు ఆపింది చాలా క్లాస్ గా ఉంది. స్టీలు రైలింగ్ తో, మార్బుల్ మెట్లు మెడ ఎక్కడి కక్కడ పనివాళ్ళు దులుపుతు కడుగుతూ తుడిస్తు ఉన్నారు. అబ్బో బాగా నీట్ గా ఉంచారు.
అలా ఉండకపోతే పేషంట్స్ ఎవరూ రారు. బాగా సెంటడ్ ఫైనల్ వాసన వస్తోంది. గాజు తలుపులు కిటికీలు పెట్టీ కట్టారు. అవన్నీ పనిపిల్ల స్టూల్ వేసుకుని తుడుస్తోంది. ఇద్దరు కంపౌడర్లు, ఓ సూపర్ వైజర్ ఉన్నారు. అబ్బో చాలా బాగుంది అన్నది రమ్య. అత్తా ఇక్కడ అన్ని ఇలాగే ఉంటాయి. బిల్లులు మాత్రం దండిగా ఉంటాయి. సరే ఏదైతే ఏమి? బాగుంది. చాలా బాగుంది అంటూ సంతృప్తి పడింది. అవును అత్త ఇప్పుడు అన్ని ఇలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ మాదిరి ఉంటున్నాయి. ఇది విజయవాడ కదా! బిల్లులు అలాగే ఉంటాయి.
పద అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఆమే బిల్లు బుక్ తీసి పేరు, వయసు, ఉరు ఫోన్ నంబర్ అన్ని రాసుకుని. కూర్చోండి డాక్టర్ వస్తారు అని, చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని వింటూ ఉన్నది.
అత్త మాత్రం ఏమిటి దానికి చెవుడు ఉన్నదా! చెపితే వినిపించు కోదా! ఇలాంటి పొగరు పిల్లల్ని ఎందుకు ఉద్యోగం లో పెట్టుకుంటారో! మహా ఫ్యాషన్ గా ఉన్నది. ఇంత చదువు చదువుకున్న నువ్వు మామూలుగా ఉన్నావు. అది ఏ ఇంటరో చదివి వచ్చినా ఎంతో గర్వంగా ఉన్నది అంటూ అత్త తెగ మాట్లాడుతోంది. అయ్యో వింటే బాగుండదు. వినదు అధి చెవిలో మిషన్ పెట్టుకున్నది. ఈ లోగా బెల్ మోగింది. డాక్టర్ వెనుక నుంచి వచ్చాడు, ఆ పిల్ల రండి అని పిలిచింది. ఎలా వెళ్ళాడు ఆ డాక్టర్ అన్నది. పోనీలే అత్త వాళ్ళు ఎలా వెడితే ఏమిటి? నీ గొడవ రా లోపలికి అని చేయిపట్టుకుని, గాజు తలుపు తీసి వెళ్ళింది. డాక్టర్ కుర్రాడు వాడి పెళ్ళాం కూడా డాక్టర్. ఆ డాక్టర్ కూర్చో బెట్టి పళ్ళు చూసి ఇందులో రెండు రూట్ కెనాల్ ఆరు క్లీన్ చేసి బ్రిడ్జి కట్టాలి అయితే 44 వేలు అవుతుంది. అదే పెర్మనెంట్ గా బిగించాలి అంటే పన్నుకి ముఫై వేలు అవుతుంది. ఆరు ముఫైలు లక్ష ఎనబై వేలు అన్నాడు. దాని కి ఆశ్చర్యపడీ ఇంట్లో చెప్పి చెపుతాను అన్నది. అదేమిటి మీరు కూడా అల అంటున్నారు అన్నాడు. డబ్బు ఇచ్చేది నా భర్త, ఇంట్లో అత్త, పిల్లలకి చెప్పాలి రెండో సలహాలు, సూచనలు లేకుండా ఎలా అన్నది. మా ఆవిడ ఇక్కడ లేదు, ఉంటే మీ చేత చెపీంచే వాడిని అన్నాడు. దానికి అత్త నేను అల చెప్పను.
ఆ పిల్ల డాక్టర్ ఆమెకి నేను చెపితే కోపం వస్తుంది.
నేను హౌజ్ వైఫ్ కనుక ఇలా అన్నాను అన్నది.
నాకు కరెంట్ బిల్లు 12000 వస్తుంది. వీళ్ళకి జీతాలు అన్ని కలిపి ముఫై వేలు అవుతుంది. ఈ కొత్త మోడల్ సామాను కొన్నాను ఇవి చాలా ఖరీదు అని చెప్పాడు. ఇవి డాక్టర్స్ అందరు దగ్గర ఉంటాయి. మీ గొప్ప ఏమిటి అని అడగాలని ఉన్నా ఉరుకొన్నది.
మా ఊళ్ళో డాక్టర్ ఇలాగే ఉన్నాడు. అక్కడ ఉన్నాయి. మా ఊళ్ళో ఒకఆమె 15000 ఇచ్చి 32 పళ్ళు కట్టించుకున్నది. అసలు ఆమెను ఇక్కడికి రమ్మనని చెప్పాను కానీ అక్కడి బంధువులు ఆమెను అక్కడ అయితే వాళ్ళు సహాయం వస్తారని చెప్పింది. సరే తక్కువకు పళ్ళు కట్టారు. లేదు అందులో మోసం ఉన్నది తక్కువకు ఎవరూ పళ్ళు కట్టరు అన్నాడు, తక్కువ అంటే మోసం ఎక్కువ అయితే మంచివి అని అర్థం అన్నాడు. ఆ డాక్టర్ మాటల్లో ఉక్రోషం, ఈర్ష్య, కోపం, తన మాట కాదన్న అహంకారం అన్ని కూడా ప్రజ్వా రిల్లాయి. మీరు చిన్న వారు ఆవేశ పడకండి అన్నది అత్త. నేను చిన్న వాడిని కాను నాకు ఎనిమిది ఏళ్ల అనుభవం ఉన్నది. నాకు కాలేజి లో ప్రొఫెసర్ గా అనుభవం ఉన్నది. నేను రెండేళ్ల క్రితమే అన్ని రెడీ చేశాను.
ఈ మాస్క్ ల రోగాల వల్ల క్లిష్ట పరిస్తితిలో జనం రారని ఊరుకున్నాను. ఇంత ఖర్చు పెట్టిన ఎవరూ సరిగ్గా రారు, సరికదా బిల్లులు కట్టకుండా ఇంటికి వెళ్ళి పంపుతాం అని వెళ్ళాక ఫోన్ చేస్తే ఫోన్ తియ్యరు, అల చాలా డబ్బు వృధా అయ్యింది అని కస్టం సుఖం చెప్పాడు. మీరు ఇంకా మాస్క్ పెడుతున్నారు కొంత మంది మానేశారు
నేను డాక్టర్ కనుక ఇంకా మాస్క్ పెడుతున్నాను.
ఈవిషయం ఎప్పుడు చెపుతారు. మా ఇంట్లో వప్పుకుంటే డబ్బు కట్టే పళ్ళు పెట్టుకుంటాను నేను అరువు అడగను అని అత్త అన్నది. ఈ లోగా వేరే పేషెంట్ వచ్చారు, వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పిలిచాడు.
నేను అత్త వచ్చేశాము. అని అన్ని విషయాలు ఇంటికి వచ్చి చెప్పింది. ఎందుకమ్మా మన గూడెం లో శ్రీనివాస్ ఆచారి ఉన్నారు అక్కడ కి వెళ్లి అని అన్నయ్య సుందరం అన్నాడు. అలాగే ఆ ఖర్చు నేను ఇస్తాను. ఎక్కడ అయినా ఫర్వాలేదు అన్నాడు. 4ఓ వారం తరువాత చెల్లికి బావకి బట్టలు పెట్టీ పదివేలు ఇచ్చి పంపాడు. ఆ వారానికి ఓ  వేయ్యి ఖర్చుతో పళ్ళు సరి చేయించు కున్నది.
కొత్త విధానము, కొత్త డాక్టర్స్ పరిస్తితి విచిత్రం గా ఉన్నది అంతేకాదు. ఆ డాక్టర్ మమల్ని డబ్బు తేనే స్తాము మోసగాడు అని కూడా అంటారు అని అన్నాడు మీకు ఎవరూ చెపితే వచ్చారు అన్నాడు.
ఎవరూ చెప్పలేదు మా ఇంటి కి దగ్గర అని వచ్చాము మీకు ఎరవై ఐదు రోజులకీ అన్ని తగ్గిస్తను అన్నాడు. కానీ చాలా విసుగు తో ఉన్నాడు. నానాటి బ్రతుకు నాటకము లో శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం తెలిసుకుని. ఎంత గొప్ప చదువు అయినా సరే మనిషి శాంతము తక్కువ.డబ్బు పెట్టీ తగ్గించే వస్తువులు పెట్టాలి అతి ఖరీదు పెట్టీ పెట్టాను అంటే సామాన్య ప్రజలు బిల్లులు కట్ట గల వద్దా. అందుకే పల్లెటూరు చిన్న ఊళ్ళ డాక్టర్స్ కి ఉన్న విలువ గౌరవం ఏసీ రూమ్స్ లో ఉండి నర్సుల చేత వైద్యం చేయించే డాక్టర్స్ కి ఉండదు. ఆ డాక్టర్ చూడలంటే బిల్లు కట్టక పది గదులు దాటి, వారి పరీక్షలు అయ్యాక పెద్ద డాక్టర్ ఓ సారి రిపోర్ట్స్ చూసి ఎదో రాసి ఇచ్చి పంపుతాడు. ఇది కొత్త విధానము. ఇలా ఎందరో బాధ పడుతున్నారు. ఇదండీ నేటి కొత్త వైద్య విధానము కొత్త విధానము ఎందరో ఎన్ని సమస్యలో ఇంకా మరో రకం వారు అయితే ఎన్ని హాస్పిటల్స్ లోకి వెళ్లి గుమ్మాలు, గడపలు చూసి వచ్చావు అని వెటకారంగా మాట్లాడే వారు ఉన్నారు. మాటలతో రోగం తగ్గించేది పోయి వాళ్ళ మాటలు బిల్లులతో ఎన్నో కొత్త సమస్యలు తెస్తున్నారు. వైద్యో నారాయణో హరిః అని అందామా అంటే ఎలా కొత్త విధానము డాక్టర్స్ ని ఏమనాలి మీరే చెప్పండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!