సృష్టి ఒక అద్భుతం
రచన: పుల్లూరి సాయిప్రియ
ఈ ప్రపంచం ఒక అద్భుతం
రోజు రోజుకి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కొత్త కొత్త టెక్నాలాజిలతో రోజుకొ అద్భుతాన్ని సృష్టిస్తున్నా.. మానవ మనుగడ ఒక అద్భుతం.
చిరుజల్లులు కురిసే ముందు మనకు ముందుగానే తెలియజేసే మట్టివాసన మహాఅద్భుతం.
ధరణి పై మానవ పుట్టుక..,
మనం ప్రతి క్షణం అశ్వాదించే వాయువు..,
కనులకు కనువిందు చేసె ప్రక్రుతి..,
పుష్ప, సుమ గంధములకు ఉన్న సువాసనలు..,
రేయి, పగలు బ్రమణం చెందడం..,
వెన్నెల రాత్రిలో చంద్రుడు ఇచ్చె ఆ చల్లదనం..,
ఉదయించే ఉషోదయ కిరణాలు..,అబ్బో ఎన్ని అద్భుతాలో..ఇలా చెబుతూ పొతే అద్భుతం అన్న పదానికే మహాఅద్భుతం అని పిలువాల్సి వస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే..
ఈ సృష్టి ఒక మహోన్నతమైన అద్భుతం.
***