తయారమ్మ తెలుగు

తయారమ్మ తెలుగు

రచన:చంద్రకళ. దీకొండ


ముక్కుకు,మూతికి…
అడ్డుగా గుడ్డ కట్టి…
మేకప్ కరిగిపోయిందన్న బాధలోనూ…
ముప్పొద్దులా గొంతెత్తి అరిచి…
కరోనా రోగులతో
కరచాలనం చేసి…
ఎత్తుకు పై ఎత్తులెన్నో వేసి…
జిత్తులతో పదవి
పీఠమెక్కిన తాయారమ్మ…
ప్రమాణ స్వీకారం సాగిందిలా…!
“తయారమ్మ అను నేను…
ప్రజల దన, మన,ప్రణాలను కాసి…
పెజా షేవ సేయుటకు…
అంత కరోనా సుద్దిగా…
భాధతో మెసులుతానని…
పెజాసామానుకి పాట పాడుతానని…
ఇందుమూలగా హాని ఇస్తున్నాను…!”
అది విన్న పెజలంతా…
ఛీ… ప్రజలంతా…
తయారమ్మ…ఛీ… తాయారమ్మకు…
జై బదులు…ఛీ కొట్టారు…!
ఆ వీడియో చూసిన తెలుగు మాస్టారు ఉండబట్టలేక…
ఉచితంగా ఆమెకు ఉచ్చారణ నేర్పుతానంటూ ఉరికి వచ్చారు…!!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!