ఏది గెలుపు ?
రచన- అమూల్య చందు
సెగలు గక్కిన
తార్రోడ్డు ముఖాన్ని
చల్లని చినుకుల
తొలకరితో కడిగినట్టు…
దిక్కులు చూస్తు
అల్లాడిన డొక్కల్ని
నాకళ్లు ఉప్పు నీళ్లతో కడిగేశాయ్…
మౌన విజయంతో
నా ఉపవాసాన్ని
విరమించుకున్నాను నేను…
యుద్ధపు ఈటెల
మాటలతో
విజయపు వింజామరల
చల్లదనంలో
సేదతీరుతున్నాడు వాడు…
***