మన పండుగలు ప్రాముఖ్యత

మన పండుగలు ప్రాముఖ్యత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అద్దంకి లక్ష్మి

“చిరంజీవి దీపూను తాతయ్య ఆశీర్వదించి వ్రాయునది, దీపావళి సెలవులు చక్కగా గడిపి, పండుగ బాగా చేసుకున్నట్లు తలుస్తాను తిరిగి కాలేజీ హాస్టల్ వెళ్ళావా! అమ్మానాన్న కులాసా అని తలుస్తాను”. దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. శివ కేశవులకు ప్రీతికరమైన మాసము, ఉదయమే నది స్నానాలు చేసి నదులలో దీపాలను వదిలి, దేవాలయాల్లో శివకేశవుల దర్శనము చేసుకొని నెలంతా దైవ ధ్యానం తో గడుపుతారు పుణ్యప్రదమైన నెల రేపు మన తెలుగు వాళ్లకి ముఖ్యమైన పండుగ నాగుల చవితి. హిందూ సాంప్రదాయము గొప్ప విషయం విలువలకు నిలయము. ప్రకృతిలో సమస్త ప్రాణకోటి, చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కోన అన్నిటిలోనూ దైవాన్ని దర్శిస్తాము, పూజిస్తాము, ప్రేమిస్తాము. “భగవంతుడు అన్ని రూపాలలోనూ లీలమై ఉంటాడు అదే మన సంప్రదాయం”.
సత్సంతానము కలుగుటకు నాగ దోషములు తొలగుటకు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని కొలుస్తాము. పసుపు కుంకుమ పూలతో పూజ చేసి చలిమిడి, చిమ్మిలి, పాలు, నైవేద్యముగా నాగదేవతకు సమర్పిస్తాము. నాగదేవత మనకు కుల దైవంగా కొలుస్తాము. భూసారాన్ని అన్ని విధాల కాపాడే సర్పాలు నీతిలేని మానవుల కంటే మిన్న సర్పం కంఠంలో మాత్రమే విషముంటుంది, మనిషికి నిలువెల్లా విషమే, రైతుల పంట పొలాలను కాపాడుతుంది నాగదేవత. “మన హిందూ పండుగలలో ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క విశేషత ఉన్నది.” మీరందరూ పిల్లలు తెలుసుకుని పాటించాలి. చక్కగా చదువుకో నాయనమ్మ, నేను కులాసాగా ఉన్నాము. రేపు మన పల్లెలో నాగుల చవితి పండుగ విశేషంగా జరుపుతారు పిల్లలందరూ పెద్దలు పొలంలోని పుట్టకెళ్ళి పాలు పోసి, టపాకాయలు వెలిగిస్తారు. నాగేంద్రుడు అందర్నీ చల్లగా చూస్తాడు.

ఇట్లు
నీ ప్రియమైన తాతయ్య

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!