ఇదే జీవితం
రచన: పి. వి. యన్. కృష్ణవేణి
అనుకున్నవి అన్నీ జరగవు
కోరుకున్నావని అన్నీ అందవు
అందలేదని చిం
తవలదు
అందుకోలేమని నిరాశ పొందకు
ప్రేమించే మనసు నీది
సాధించే ప్రయత్నం నీది
ఏది శాశ్వతం కాని ఈ విశ్వంలో
అనంతమైన కోరికలే నీకు ఆనందం
సాహసం చేయ్యడం కాదు గొప్ప
లక్ష్యాన్ని సాధించడం గొప్ప
గొప్పలు చెప్పుకోవడం కాదు గొప్ప
గొప్పగా ఎదిగు అది నిజమైన గొప్ప
నిన్ను హేళన చేసిన వారు
నిన్ను నిందించిన వారు
నిన్ను దూరంగా ఉంచిన వారు
నీ విజయాన్ని అసూయగా స్వీకరిస్తారు
***