పుట్టింటి మహారాణి

పుట్టింటి మహారాణి

రచన:: సావిత్రి కోవూరు 

పుట్టింట్లో ఆమె అపరంజి బొమ్మ –
అమ్మ అనురాగం, నాన్న మమకారం ,
తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల సాహచర్యంతో ,
చిలిపి తగాదాలతో ,అల్లరి పనులతో పెరిగి పెద్దయిన
ఈ పూల రెమ్మా మా ఇంటి మహరాణి .
మొన్నటి వరకు బొమ్మలాటాలాడి ,
సినిమాలు, షికార్లు, చదువులతో
సంతోషానందాల మునిగి తేలుతు
ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగిన ఈ పూబోణి
పుట్టింటికే  పసిడి కొమ్మా మాఇంటి మహారాణి .
పెళ్లి చేసుకుని, పరిచయమే లేని,
తాళి కట్టిన పతిపై అపర నమ్మకముతో
నవ వధువుగా కొత్త ఇంట్లో కాలిడి ,
కొత్త మనుషులతో, కొత్త అలవాట్లతో,
కొత్త పరిసరాలతో మమేకమై మెలుగు ఈ పుట్టింటి
పూబోణి మా ఇంటి మహరాణి .
పుట్టింటి నుంచి తెచ్చిన మంచి సంస్కారం,
గౌరవం, ఓర్పు, సహనమనే అలంకారాలతో
అందరిని ఒప్పిస్తూ, ఎవరినీ నొప్పించక, సహనంతో
అందరికీ తలలో నాలుకలా మెలగుతూ
తను లేకపోతే ఇల్లు గడవనట్లు,
ప్రతి విషయమ్ములో  భర్తకు అన్నివేళల యందు సహకారమందిచు.
పిల్లలకు ఓర్మితో చక్కని నడవడిక నేర్పి,
ఆదర్శవంతులుగ తీర్చిదిద్దు మమతల మాతృ మూర్తి ఈమె
పుట్టింటి గౌరవానికి భంగంబు కాకుండ
అత్తింటిని  చక్కబెట్టి అందరీ ఆప్యాయత అనురాగాలను పొందు

చిగురు కొమ్మా మా ఇంటి మహరాణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!