బంధాలమాల
అందమైన జీవితాన అల్లుకున్న బంధమైనా
ఆశల కోరికల ఉల్లాసానికి అద్దిన బంధమైనా
ఇహలోక సుఖాల కొరకు మొదలైన బంధమైనా
ఈప్సితముతో కూడిన బంధమైనా
ఉన్నత శిఖరాల వల్ల ఏర్పడిన బంధమైనా
ఊహాలోకంలో విహరిస్తూ దరి చేరిన బంధమైనా
ఎంతకాలం వేచిన బంధమైనా
ఏ తీరానికి చేరుతుందో తెలియని బంధమైనా
ఐచ్చిక సుఖాలకై పుట్టిన బంధమైనా
ఒడిలో ఒదిగే బంధమైనా
ఓర్పు నిండిన బంధమైనా
ఔన్నత్యాన్ని చూపే బంధమైనా
అంతఃకరణ శుద్ధి తో ఏర్పరచుకున్న బంధమైనా
అహం బ్రహ్మాస్మి అని అన్ని బంధాలు తుదకు ఏదొకలా
అడవి గాచిన వెన్నెలగా మిగలాల్సినవేగా…
రచయిత:: విజయమలవతు
ధన్యవాదాలు మయూరి..😊
అచ్చులతో బంధాలమాల అద్బుతం మేడమ్