బాల్యవివాహం

బాల్యవివాహం

రచయిత్రి – అలేఖ్య రవికాంతి

అందాల అపరంజి
పేదింటి మాలచ్చిమి
తన తొమ్మిదేండ్లకే
తొంబై వరహాలకి అమ్ముడైనాది
మచ్చటగా ముస్తాబై
మండపాన కూర్చుంది
వరుడేమో పండు ముసలి
సొగసరిని చూచి మురిసి
ముక్కుపచ్చలారని పసిదాని మెడలోన పుస్తె కట్టి తన గొంతుకోసినాడు
తీరా ఓ నెల కూడా నిండకుండానే
కాళ్ళ పారాణి ఆరాక ముందే
పుస్తె కట్టినోడు పాడె ఎక్కినాడు
అపరంజి జీవితాన్ని
బుగ్గిపాలు చేసినాడు
బాల్యవివాహమే అపరంజి పాలిట యమపాశమైంది
తన నిండు యవ్వనమంతా
అడవి కాసిన వెన్నెలలా శూన్యంగా మారింది!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!