థ్రిల్లింగ్

థ్రిల్లింగ్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

గబగబా వచ్చి చెప్పులు గుమ్మంలో విడిచి లోపల సోఫాలో అలా చెతికిలబడ్డాడు అంతలో అటుగా వస్తున్న తల్లి కాంచన ఏంటిరా ఉలుకుపలుకు లేకుండా అలా మౌనంగా చతికిలబడ్డావు మాట్లాడవేంటీ అంది కొడుకును చూసి అంది. ఏం లేదమ్మా పొడిగా సమాధానం చెప్పాడు. ఏమిటో ఈ ఈకాలపు కుర్రాళ్లు ఏ విషయం సరిగ్గా చెప్పి చావరు. మనసులో విసుక్కుంది. అన్నం వడ్డిస్తాను రా అంది.నాకు ఆకలిగా లేదు! కొద్దిగా తలనొప్పిగా వుంది పడుకుంటాను. అన్నాడు సరే లేరా నీకు ఆకలైనప్పుడెే తిందువుగాని అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ప్రవీణ్ ప్రవీణ్ అంటూ తన ఫ్రెండ్ వచ్చాడు. ఆ పిలుపు విని కాంచన ఏంటి బాబూ అంటూ అడిగింది. ప్రవీణ్ లేడా అంటీ అని అడిగాడు. తన ఫ్రెండ్ రేవంత్ ? ఉన్నాడు బాబు ఇప్పుడే వచ్చి తల నొప్పిగా ఉందని పడుకున్నాడు వెళ్ళుబాబు అంది. రూములో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరు కంగారుగా వెళ్లారు. నానా ప్రవీణ్ అన్నం తిని వెళ్లు అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లారు. ఏంటి ఎందుకంత కంగారుగా ఉన్నారు. హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారు. అనుకుంటూ బాధగా అనుకుంది కాంచన. అంతలో పోలీసులు వచ్చారు ఇంటి గుమ్మంలోకి పోలీసులని చూడగానే కాంచన గుండె గుబేల్మంది. ఏంటండీ ఇలా వచ్చారు మీకెవరు కావాలి అంది భయంగా ప్రవీణ్ అంటే ఎవరు అని అడిగారు. ప్రవీణ్ మా బాబు ఎందుకు కంగారుగా అడిగింది. కాలేజీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు. మా అబ్బాయితో పనేంటి పిలవండి చెప్తానుగా లేడండి ఇప్పుడే బయటకు వెళ్లాడు. ఎప్పుడు వస్తాడు నాకు తెలియదండి. మళ్లీ వస్తానoటూ వెళ్లారు. ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకుంది కాంచన! ఈ పిచ్చి అలవాట్లు ఏమీ లేవు చాలా మర్యాదస్తుడు అమాయకుడు ఇంతలోనే ఈ ఘోరం ఏంటి ఎందుకిలా జరిగింది. తండ్రి మరణంతో ఒంటరిగా తన కొడుకును పట్టుకొని కష్టపడుతూ పెంచుకుంది.
తన చేతికి వచ్చాడు ఇక తనకి బాధలు లేవని   మురిసిపోయింది. ఇప్పుడేంటి ఇంత పిడుగు వార్త  ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా నాకెందుకీ పరీక్ష పెట్టావు అంటూ రోదిస్తుoది. నా కొడుకు ఇలాంటి వాడు కాదు నా కొడుకు తప్పు పని చెయ్యడు మనసుకు నచ్చచెప్పుకుంది. ఈ వార్త గుప్పున ఇరుగుపొరుగు వారందరికీ తెలిసింది. ఏంటి కాంచన నీ కొడుకు ఇలా చేస్తాడను కోలేదు. నీ కొడుకు చేసిన నిర్వాకం చేసిన పని ఇదేనా
ఏవేవో మాటలు అంటున్నారు కానీ నాచెవికి ఏమీ వినపడడం లేదు అయోమయంగా వుంది. ఇంకేంటి నీ కొడుకు జైల్లో ఉండాల్సిందే చిప్పకూడు తినాల్సిందే అంటూ నలుగురు నాలుగు రకాలుగా విమర్శిస్తున్నారు. మాట్లాడ్డానికి కూడా మాటలు రావడం లేదు. నాకెందుకు చెప్పలేదు ఎందుకు ఆ విషయం నా దగ్గర దాచాడు. నా కొడుకు ఇలాంటి పని చెయ్యడు నా మనసు అందుకు అంగీకరించడం లేదు అంటూ కుమిలిపోతుంది. ప్రవీణ్ తో పాటు తన ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్ లోనే ఉన్నారు. తను కళ్లు తెరిస్తే కానీ అసలు విషయం తెలియదు. ప్రవీణ్ నువ్వేం కంగారుపడకు మేమంతా ఉన్నాం ధైర్యంగా ఉండు అంటూ ఓదారుస్తున్నారు.
ప్రవీణ్ కంగారేం పడడం లేదు తను కళ్లు తెరిస్తే చాలనుకుంటున్నాడు. విషయం అంతా తనే చెప్తుందని అంతలో డాక్టర్ డాక్టర్ పేషెంట్ కళ్ళు తెరుస్తుంది. అని చెప్పడంతో కంగారుగా డాక్టర్ వెళ్లారు. ప్రవీణ్ ప్రవీణ్ అంటూ కలవరిస్తుంది.
డాక్టర్ బయటకు వచ్చి ప్రవీణ్ ఎవరంటూ అడిగాడు. నేనే అంటూ సమాధానమిచ్చాడు. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాడు మిమ్మల్ని కలవరిస్తోంది మీరు వెళ్ళండి, అంటూ చెప్పి వెళ్లాడు డాక్టర్. ఫ్రెండ్స్ కూడా అందరూ వెళ్లారు. తనని వేరే వారు మోసం చేయడంతో ఆ బాధను తట్టుకోలేక స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను ప్రవీణ్ నన్ను మందలించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడని చెప్పింది. అమ్మాయి! అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన ఫ్రెండ్స్ కూడా అందరు ప్రవీణె ఏదో చేశాడనీ కంగారుపడ్డారు. అసలు విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన హెల్పింగ్ నేచర్ కి అందరూ సంతోషపడి ప్రవీణ్ ను ఇంటికి సంతోషంగా తీసుకువెళ్లారు. తల్లి గుమ్మంలో ఏడుస్తూ నిలబడి ఉంది. అందరూ సంతోషంగా రావడం చూసి ఏంటి ఇప్పుడు ఇంత కంగారు పెట్టారు ఇంతలోనే ఈ సంతోషమేంటి నాయనా ప్రవీణ్ అంటూ కొడుకుని గట్టిగా కావలించుకుంది. ఏంటమ్మా ఎందుకేడుస్తున్నావు అంటూ అడిగాడు ఇంత కంగారుపెట్టావు ఇంటికి పోలీసులు వచ్చారు ఇంకా ఎందుకేడుస్తున్నావని అడుగుతున్నావా! నాయనా అoది జరిగిన విషయం అంతా తల్లితో చెప్పడంతో తల్లి ఆనందంతో పొంగిపోయింది. నా కొడుకు ఎలాంటి చెడు పనిచెయ్యడని తన మనసులో నమ్మకం ఉంది. నా కొడుకు మంచిపనెే చేశాడు ఒక నిండు ప్రాణాన్ని రక్షించాడు అది చాలు నాకు సంతోషంగా అనుకుంది మనసులో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!