పాములోడు

పాములోడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన  : యాంబాకం

అనగనగా ఒక హైదరాబాద్ అందులో ఎంతో మంది ఎన్నో పనులు చేసుకొంటూ జీవిస్తున్నారు. ఆ ఊరు దినదినము వృద్ధి చెందసాగింది. అందులో భాగంగా ప్రజలకు ఉండటానికి సొంత ఇల్లులు కట్టుకోడానికి ఊరు బాగా పెరగడం మారింది అలా పెరుగుతున్న హైదరాబాద్ లో కొత్త గా చందానగర్ అనే ఊరు కొత్త గా అప్పుడే అభివృద్ధి చెందటం మొదలైంది. అక్కడ కొత్త గా సొంత ఇల్లులు ఏర్పరుచుకో సాగారు. అందులో భాగంగా వెంకటశివ అనే ఒక ప్రైవేటు ఉద్యోగి కూడా ఒక చిన్న పాటి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు చూడబోతే చిన్నదేకానీ ఇంటికి పెరడు మట్టుకు చాలా పెద్దది గా ఉంచాడు ఆ చందానగర్ చుట్టూ పక్కల కాస్త అడవి లా చెట్లు చేమలతో నిండి ఉంటుంది. అలాగే వెంకటశివ ఉండే ఇల్లు పెరడు నిండా కశింద బహ్మ మేడి, బరిణిక, జిల్లేడు ఇలా ఒకటేమిటి! నానా రకాల చెట్లు తుప్పలూ ఆ పక్కనే పొదలూ దిబ్బలు భాగా బలిసిపోయి అదంతా ఒక చిన్న అరణ్యం లాగా తయారైంది. ఇలా తయారు కావటం వల్ల ఆ ప్రాంతంలో కాస్త చీకటి గా ఉండేది. అటువంటి పెరడులో పురుగు బుట్టా మసులు తుందంటే ఆశ్చర్యం దేనికి? వెంకటశివ క్షేమం కోరిన ఇరుగు పొరుగులు అడపా తడపా వెంకటశివతో చెబుతూ నే వచ్చారు. “బాబూ వెంకట శివ పిల్లా జెల్లా తిరుగుతూ ఉంటారు. డబ్బులు చూసుకో వద్దు ఆ పెరడు ను శుభ్రం చేయించు దానికి చుట్టూ ప్రహరీ కట్టించు ఆ తరువాత ఏమైనా ఇబ్బందులు వస్తే తరువాత భాధపడి ఏమి ప్రయోజనం ఉంది? అని సలహా ఇచ్చారు. ఆ తిక్క వెంకట శివ వింటేనా? ఆ చందానగర్ వాళ్ళు చెప్పి చెప్పి నోరు నొచ్చి మనకు ఎందుకు “కత్తి కి లేని దురద అని ఊరుకున్నారు.
ఒక రోజున వెంకటశివ భార్యాపిల్లలూ కలసి సరదగా ఆడుతుండగా ఆపక్కనే ఒక అపార్టుమెంట్ లో ఉన్న లిఫ్ట్ లో ఒక పాము కనిపించిందనీ అక్కడ వాచ్ మెన్ ను కొంత మంది పక్కన ప్లాట్ వారు పరగువెత్తారు కానీ వెకటశివ మాత్రం చాటునే పొంచి ఉండి పాము నడక కనిపెడుతూనే ఉన్నాడు. ఆ పాము అక్కడే తిరుగు తున్న ఎలుక ను పట్టేసింది. ఆ లిఫ్ట్ లో నుండి తప్పించుకుని పోయేందుకు మరి ఒక మార్గం లేదు. అందుకని ఆ పాము వచ్చిన దారినే రెప్పపాటున జారుకుంది. వెంకట శివ ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అదిపోయి ప్రహరీ గోడ కలుగులో దూరి పోయింది. దృష్టి తప్పకుండా గమనిస్తూనే ఉన్నాడు వెంకటశివ. ఇంతలో ఇంకా పదిమంది పోగయ్యారు. “పాము ఎటుపోతుందో జాగర్తగా చూస్తూఉండండి. అని ఆపక్కనే ఉన్న అధర్మం సుబారావు తో చెప్పి వెంకటశివ బి హెచ్ ఎల్ దగ్గర లో కాపురం ఉన్న పాములవాడింటికి బయలు దేరాడు. అదృష్టం బాగుండి వెంకట శివ వెళ్ళేసరి కల్లాఆ పాముల నాగులు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ నాగులు చిన్నతనం లో తమాషా గా పాముల తో ఆడుకోవడం సరద అప్పడప్పుడు పాములోడు తో శావాసం చేస్తూ పాములకు వేసే మంత్రం తంత్రం నేర్చుకున్నాడు. అదే ఇప్పుడు నాగులు కు బ్రతుకు తెరువు గా మారి పోయింది. నాగులకు ఇద్దరు కుమారులు పెద్దవాడు అందోళం, చిన్నోడు కళవరం. నాగులు ను చూసి చూడగానే వెంకట శివ ఎంతో ప్రేమ నటిస్తూ! ఒరే నాగులు ఎమిటి రా ఇలా పీలగా అయిపోయావు ఈ మధ్య వ్యాపారం తగ్గిందా అంటూ చమత్కరించాడు. వెంకట శివను చూసి నీ మొహం మండ యాబ్రాశి వెధవ నేను పీలగా ఉంటే ఎందుకు లావుగా ఉంటే ఎందుకు అని గొనుగుతూ, ఓ చందానగర్ వెంకటశివ సారూ ఎమిటి ఇలాదయచేశారు, అన్నాడు! ఇంకే మంది. కొంప మునిగింది! ఎవరిది “సియం”దా “పియం”అన్నాడు. నాగులు కాదురా బాబు మాదే ఎముచ్చింది అంత పెద్ద కష్టం అన్నాడు ఎందుకు దిగులు మరి పెద్ద పామొచ్చింది మా ఇంట్లో కి! అన్నాడు. ఆత్రం కొద్దీ వెంకటశివ. ఓస్..! అంతగా అప్పడప్పుడు మేము బతకాలి కదా అలా కంగారు పడతారు? ఎందుకు ఎదో పదవి పోయినట్టు నేనుండగా నీకు భయం దేనికి? అంటూ! నాగులు అదేం పాము? ఎంత పోడుగుంది?  చుక్కలున్నయ్యా! చారలున్నాయా? పచ్చగాఉందా బుదరంగు లో ఉందా! నల్లగా ఉందా అంటూ! సుత్తి కొట్టాడు. లక్ష ప్రశ్నలతో ఒరే నాగులు నన్ను చూస్తే నీకు వేలాకోలం గా ఉందంట్రా! “ఆపద సమయం” లో ఈ ప్రశ్నలేమిటిరా?”అంటూ ఎగిరిపట్టాడు వెకటశివ. “అది కాదు సారూ! నేను రావాల నా కొడుకులు అందోళం కళవరం రావాల వాళ్ళు వస్తే ఒక రేటు నేను వస్తే ఒకరేటు నేను నాగస్వరం వూది పిలుస్తాను, మంత్రం వేస్తాను. పాములు వస్తాయి. వాటిలో నువ్వు చెప్పిన పాము ఉన్నదా! ఎన్ని పాములు వస్తే పాముకు ఐదువందలు లెక్కన ఇచ్చుకోవాలి. నువ్వు చెప్పిన పాము రాలేదనుకో ఇంకో ఐదువందలు అదనంగా డబ్బు వివ్వనా కష్టానికి అదిచాలు అని నాగులు చెప్పాడు. పామును భాగ పరకాయం చే చూశాడు. వెంకటశివ అందుకని అతనికి దాని ఆనవాళ్ళు భాగ గుర్తుంది. ఐనా ఇప్పుడు నాగులు కు చెప్పిన తరువాత తీర నాగస్వరం ఊదగానే కలుగులోనించి ఎన్ని పాములు వస్తాయో ఇంతచేసి అన్నింటికీ అన్ని ఐదువందలు ఇవ్వవలసి వస్తుందేమో! ఇంతకూ ఒక వేళ తన ఇంటి ప్రహరీ గోడ లోకి  పోయిన పాము వస్తుందో లేదో దాని మొహం మండ దానికి శార్దం పెట్టా బయటికి అని సంశయంపట్టుకుంది. వెంకటశివకు. ఈ సంశయంతో తను  చూచింది చూసినట్టు గాక మరోక విధంగా పాము ను వర్ణించి చెప్పాడు. నాగులు వెంటనే బయలుదేరి వచ్చాడు. నాగస్వరం వూదాడు. అమాంతం ఎదురుగా ఐదు ఆరు నాగుపాములు వచ్చాయి. వాటిలో వెంకటశివ చెప్పిన పాము మాత్రం లేదు. వచ్చిన పాములంన్నిటిని పట్టి నాగులు బుట్టలో పెట్టాడు. మళ్ళీ వూదాడు. ఎంత సేపు ఉందని వెంకటశివ చెప్పిన పాము రానేలేదు. తన పాచిక పారినందుకు  వెంకటశివ సంతోషించాడు. అనుకొన్న మాటప్రకారం డబ్బు లు తగ్గించి పొమ్మన్నాడు.”ముప్పై సంవత్సరాలు నేను పాములు పట్టు తున్నాను.  ఒక్క సారి కూడా నా అంచనా తప్పిపోలేదు. అలాంటిది. ఇప్పుడిలాగా ఎందుకయిందా!  అని అనుమానించాడు. నాగులు. ఇది డబ్బు వివ్వబడుతుందని వెంకటశివ చేసిన పన్నాగమే కానీ మరోకటి కాదు అని వెంకటశివ ఇచ్చిన డబ్బు లు తీసుకొని వెళ్ళి పోతూ నాగులు. నువు నన్ను మోసంచేసినట్టుంది. అది వూరికే పోదు. పాములు నోరులేని జీవాలను కుంటున్న వల్లే ఉన్నది. వాటి విషయం లో అబద్ధం చెప్పి ఎవరూ బాగుపడలేదు. మా పాములు పవిత్రమైనవి. క్షమించవు. నీవు చేసిన మోసానికి తగిన ప్రతిఫలం త్వరలో అనుభవిస్తావు”అంటూ వెళ్లి పోయాడు. పాములవాడు. “ఏడిచాడు” బడుద్దాయి అనుకున్నాడు. మనసులో వెంకటశివ. మరునాడు మళ్లీ రెండు నాగుపాములు పడగవిప్పి కొని బుసలుకొట్టు కుంటూ వెంకటశివ పెరట్లో మసల సాగాయి! ఈ సారి ఇంట్లో వాళ్ళు కంగారుకు అంతు లేక పోయింది. ఏం చేయటం? వెంకటశివ ఉరుకులేత్తుకుంటూ పొయి నాగులును బ్రతిమాలాడు. ఇప్పుడే నాకు  వేరే దగ్గరకు బేరంకుదిరింది. సారూ! పోవాలి ససేమిరా రావటానికి వీల్లేదు. అనేశాడు. నాగులు నిర్మోగమాటంగా చివరకు కాళ్ళ వేళ్ళా పడి వెంకటశివ పాముకు వెయ్యి రూపాయల లెక్క ఇస్తానని వాడిని వెంట తీసుకుని వచ్చాడు. ఆ రెండు పాములు పట్టించాడు. ఇది జరిగిన వారం రోజుల తరువాత ‌‌అధర్మ సుబ్బారావు ఏదో సందర్భంలో కుశల ప్రశ్నలు వేయ సాగాడు. మొన్న మరలా రెండు పాములు వచ్చాయట వాటిని పట్టడానికి నాగులు కి రెండు వేలు ఇచ్చావటా అని తమాషా గా అడిగాడు. అధర్మ సుబ్బారావు. ఇంకా పక, పక, నవ్వ సాగాడు. అతని నవ్వు వాళ్ళు కేమి అర్దం కాలేదు. చివరకు ఇలా అన్నాడు. అధర్మ సుబ్బారావు”ఏమిటోయ్ వెంకటశివ వట్టిపిచ్చివాడులాగా ఉన్నవే! ఇన్నాళ్ళ నుంచి ఈ చందానగర్ లో వుంటూ మన నాగులు ఆసంగతే తెలియదా? వాడు ఏవో షరతులు చెబుతాడు.  ఆప్రకారం ఉబ్బు ఇవ్వక పోతే తంత్రంఆచేస్తాడు. కొంత మంది అందకనే ఆటువంటి వాళ్ళు పెరట్లో మంత్రంవేసి పామున్ని వదిలేస్తాడు తెలుసుకోలేదో!  అవి కోరలు తీసిన పాములే సుమా! అందుకని వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు కానీ భయం మాత్రం వేస్తుంది. ఇంతకూ నీవు ఏమైనా డబ్బు లు బేరం చేశావా ఏమిటి? అని పరిహాసం చేశాడు. తన తప్పిదానికి సిగ్గుపడి ప్రసంగం తప్పించి వేశాడు. వెంకటశివ అప్పటినుంచి బేరం ఆడినప్పుడల్లా “పాములోడు”గుర్తుకురావడంతో! బేరాలు మానేశాడు,

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!