ఏడడుగులు

ఏడడుగులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: VT రాజగోపాలన్

డాక్టరు డాక్టరూ పరుగెడుతూ వచ్చాడు చంద్రం
ఏం చంద్రూ గుండె కొట్టుకోవడం లేదు. అన్నాడు గసపోస్తూ అరెరే ఇలా దగ్గరకి రా! కూర్చోవయ్యా
స్టెతస్కోప్ పెట్టి చూస్తే, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ వేగంగా. ఏం చంద్రూ ఇంత వేగంగా కొట్టుకుంటుంటే లేదంటావు. అరే నాక్కాదులే, నాయనమ్మకు, అమ్మ తీసుకురమ్మంది నిన్ను
రా త్వరగా వెళతాం, అంటూ చేయి పట్టుకొని వడి వడిగా ఇంటికి వచ్చాడు. ఒరేయ్ చంద్రూ డాక్టరు ఏడరా అని ఇంట్లోవాళ్ళు అడిగితే, బయట ఉన్నారు చూడు బయట వచ్చి చూస్తే ఒక అందమైన
అమ్మాయి గడప దగ్గర నిలుచోనుంది.
ఎవరమ్మా నీవు, ఏమి కావాలి, అని అడిగారు
ఇదిగో హారతి నీళ్లు తీసుకురండి అప్పుడే లోనికి వస్తాను. మీ అబ్బాయి నా చేయి పట్టుకొని ఏడడుగులు నడిచాడు, అడగండి మీ అబ్బాయిని.
అంతే ముసలావిడ ఎవతే అది, మా చంద్రం గురించి ఇలా చెప్పింది అంటూ, చేతికర్ర తీసుకొని, లేచి ఉరకపోతే, ఆ అమ్మాయి ఒకటే నవ్వు, ఆశ్చర్యం, ముసలావిడ లేవడం, అందరూ అమ్మాయితో పాటు, నవ్వులే నవ్వులు. ముసలావిడకు మాత్రం ఏం జరిగిందో అర్ధం కాలే. ఎందుకు వీళ్ళు నవ్వుతున్నారని. విషయం తెలిసిన తర్వాత, ముసి ముసి నవ్వులతో ఉంటేను. వెనకే నవ్వుతూ వచ్చారు డాక్టరుగారు, అమ్మాయి కొత్తగా చేరిన నర్సు లే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!