సర్దుకుపోవాలి

సర్దుకుపోవాలి.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

  అది చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో అనంతశర్మ అనే వైదిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆచార వ్యవహారాలలో నిష్టాగరిష్ఠుడు. ఆ ఊరిలో అతన్ని మించిన వారు లేరు. వారిది ఉన్నతమైన కుటుంబం.

“శర్మ గారిది సమిష్టి కుటుంబం. శర్మగారి మాటను ఎవరు జవదాటరు శర్మగారి పనులన్నీ పద్ధతి ప్రకారంగానే జరగాలి.” ఏ చిన్న లోపం వచ్చిన సహించేవారు కాదు. పంకజం అనంతశర్మగారి భార్య! భర్త వెన్నంటే ఉంటూ పనులన్నీ చక్కబెడుతుంది. శర్మగారికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడండ్లు “ఈ ముగ్గురు కొడుకులు కూడా పురోహితమే చేస్తుంటారు. పూజా కార్యక్రమాలకు తండ్రితో పాటే వెళ్తుంటారు.
ఇకపోతే శర్మగారి పెద్ద కొడుకు పేరు రామశర్మ, రెండవ కొడుకు కృష్ణశర్మ, మూడవ కొడుకు సత్యశర్మ, పెద్ద కోడలు శకుంతల, రెండవ కోడలు సుకన్య, మూడవ కోడలు సురేఖ. వీరు ముగ్గురు అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ పనులన్నీ చేస్తుంటారు.

అందులో చిన్నదైనా మూడవ కోడలు సురేఖ అహంకారి, గడుసు పిండం, లెక్కలేనితనం చాలా ఉంది. దూకుడుగా వ్యవహరిస్తుంటుంది. సురేఖ వాళ్ళ ఫ్యామిలీ చిన్నది ఒక్కటే కావడంతో గారాబంగా పెరిగింది. ఇక్కడ సమిష్టిగా అందరి మధ్యలో ఇమడలేక పోతుంది. సమిష్టి కుటుంబాల విలువ తెలియదు. ఏ ఆడపిల్ల కైనా పెళ్లయిన తర్వాత అత్తవారింట్లో అలవాటు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ దూకుడు, అహంకారం కుటుంబం అంటే వివక్షత ఉండకూడదు!

అత్తమామలు చెప్పినట్టుగా వినాలి తల్లిదండ్రులు కూడా అత్తవారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు మంచి, చెడ్డలు తెలిసేలా నచ్చ చెప్పాలి. ఏదో చిన్న పిల్ల కదా! అని సర్దుకుపోతున్నారు. రోజు రోజుకి  గొడవలు సురేఖతో పెరుగుతున్నాయి. ఓపికతో సహించి ఇక ఓపిక పట్టలేక శర్మ గారు! సత్యశర్మను పిలిచి నీ భార్యను కాస్త అదుపులో ఉంచుకో లేకుంటే నీవు కూడా అత్తగారింట్లో వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది. ఆలోచించుకో అంటూ హెచ్చరించాడు. ఎంత చెప్పినా వినట్లేదు ఏం చేయమంటారు నాన్నగారు చెప్పి.. చెప్పి విసిగిపోయాను. అన్నాడు బాధగా?

“అయితే ఇలాగే ఉంటాయా ఇంట్లో గొడవలు అన్నాడు శర్మ గారు” ఏమో నాన్న నాకు కూడా అర్థం కావడం లేదు భయమేస్తుంది. నాన్నగారు అన్నాడు సత్యశర్మ! “ఇది ఎంతకు దారితీస్తుందేమోనని’ నాకు భయంగా ఉంది రా! ఈ కాలం పిల్లల మనసులేంటో అర్థం కావు అన్నాడు శర్మగారు” అటు తండ్రికి ఎలా చెప్పాలో తెలియక! ఇటు భార్యకు సర్దిచెప్పలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.

వేరే కాపురం పెట్టాలంటూ రోజు గొడవనే? వేరే కాపురానికి ఇష్టపడని సత్యశర్మ విని విననట్టుగానే ఉన్నాడు. అలాగే అంటుంది లే అని ఊరుకున్నాడు ఎన్నో తరాలుగా సమిష్టి కుటుంబాలుగా ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు వేరే కాపురం పెట్టాలంటే ఎలా? కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది.

వేరే కాపురం పెట్టకుంటే తను పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తుంది. ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నారా? భోజనానికి రండి! అంటూ పంకజం వచ్చి చెప్పింది. వస్తున్నాం పదమ్మ అన్నాడు సత్యశర్మ. ఏమండీ సురేఖ భోజనం చేయనని అలిగి కూర్చుంది. ఏంటండీ వీడి సంసారం ఇలా కాలింది.

వీడు చేసిన గారాభం వళ్లనే ఇప్పుడు ఇలా తగల బడింది. ఇప్పుడని ఏం లాభం. వాడు మాత్రం ఏం చేస్తాడండి చదువుకున్న అమ్మాయి ఏదో మంచి చెడ్డలు తెలుస్తాయి కదా అని ఇష్టపడ్డాడు. వాళ్ళ ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ల పెద్దవాళ్లు అలా పెంచారు. వాళ్ళ తల్లిదండ్రులది
కూడా తప్పని చెప్పడం లేదండి. ఒకతే అమ్మాయి గారాబంగా పెంచి ఉంటారు.

మనమే సర్దుకు పోవాలండి. ఎలా సర్దుకుపోమంటావు? వేరే కాపురం పెట్టమంటావా? వాళ్ల తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పాలి కదా? ఇంక మనం మాత్రం ఏం చేస్తామండి, ఇంక మిగతా ఇద్దరు కోడలు లేరండి వాళ్ళు ఇలాగే చేస్తున్నారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా ఉంటారు. కాలం తీరు మనమే అర్థం చేసుకోవాలండి. వీడు వేరే ఉంటే నేను తల ఎలా ఎత్తుకోగలను. నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా! నీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాకపోవడానికి ఏముందండి ఇంట్లో రోజు గొడవలు పెట్టుకునే బదులు.. వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనుకుంటే ఉండనిద్దామండి మీరేం మాట్లాడకండి. అంటూ నచ్చ చెప్పింది. పంకజం రేపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలండి రేపు మళ్లీ మనమే పంపించేసామనుకుంటారు.

వాళ్ళిష్టంగా వెళ్తున్నారనే విషయం తెలియాలి కదండీ! తెల్లవారగానే సురేఖ తల్లిదండ్రులను పిలిపించారు. సురేఖ తల్లిదండ్రులు వచ్చారు వారికి జరిగిన విషయం అంతా చెప్పారు. “అదేంటి బావ గారు అలా అంటారు. మా అమ్మాయి ఏదో తెలిసో తెలియకో తప్పు చేస్తే నచ్చ చెప్పాలండి లేకుంటే మేము నచ్చ చెప్తాము. అంతేకానీ విడిగా ఉంచడం ఎందుకండి? అందరు కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టుగా ఒక కుటుంబం అన్నాక అందరూ కలిసి ఉండాలి. మా అమ్మాయి కొద్దిగా గారాబంగా పెరిగింది. మేము ఎప్పుడు గట్టిగా చెప్పే అవసరం రాలేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అందులో మీ కుటుంబ వ్యవహారాలు, మీ సాంప్రదాయం మాకు చాలా బాగ నచ్చాయి. అందుకే ముందుకు వచ్చి మేము పెళ్లి చేసాం ఇప్పుడు పిల్లలు ఏదో అన్నారని మీరు వేరే ఉంచితే ఎలాగండి మేము మా అమ్మాయికి నచ్చచెప్పి మీతో పాటే ఉండేలా చేస్తాము. మమ్మల్ని తప్పుగా అనుకోకండి మా అమ్మాయి తరఫున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం అంటూ బాధ పడ్డారు”.
“మీరేం బాధపడకండి పిల్లలు అన్నాక ఎన్నో తప్పులు చేస్తారు. తల్లిదండ్రులుగా తప్పులను తెలుసుకొని మీ పిల్లలను సవరించి ఇలా చేయడం చాలా బాగుంది. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచించి పిల్లలకు నచ్చచెప్పి ఈ విధంగా చేయగలిగితే సమిష్టి కుటుంబాలు విడిపోవు మాకు చాలా సంతోషంగా ఉంది.” ఇంతకంటే కావాల్సిందేముందండి అంటూ అందరూ సంతోషపడ్డారు.

సురేఖ కూడా తన తప్పును తను తెలుసుకొని “నన్ను క్షమించండి మామగారు అంటూ.. అత్తయ్య మామయ్యకు కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంది”. ప్రతి ఇంటిలో చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇలా చిన్నచిన్న తప్పులను సర్దుకుపోతుంటే ఏ కుటుంబాలలో కూడా గొడవలు ఉండవు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!