హడావుడి

హడావుడి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

     డక్కిలి అనే గ్రామంలో నల్లకొండ అంటే వాడిపేరు కొండయ్య నల్లగా ఉంటాడు. అందుకని వచ్చే ఖాతా దారులు ముద్దుగా నల్లకొండ నల్లకొండ అని పిలిచేవారు. మంగళి వృతి వాడు ఉండేవాడు. అక్కడ జీవనం గడవక అతను కుటుంబాన్ని తీసుకొని విశాఖ పట్నం చేరుకున్నాడు. బస్తీ చేరుకున్నప్పటి నుంచి చేతి నిండా పని కలిగి సుఖంగా నే కాలక్షేపం గడచిపోతున్నది ఒక్క సంవత్సరంలో కల్లా నల్లకొండ బాగా ఆర్జించాడు. కొంత సొమ్ము నిలవకూడ చేశాడు. ఇంతలో సంక్రాంతి పండగ రాగా అతని భార్య ” యో.. మనం ఊరికి విడిచి పెట్టి ఏడాది దాటిందే ఒకసారి ఊరికి పోయి మన వాళ్ళను చూచి వద్దాం” అంటి మనసులో కుతూహలం వెల్లడించింది.

    “ఓ..! అలగే వెళదాం నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందేమిటి? నీ సరదా.. నా సరద కదా! అన్నాడు నల్లకొండ. ఖాతాదారులకు తెలిస్తే పండగకు కొట్టు తీయకుండా వదలరని దశమి బుధవారం రోజున తెల్లవారి ఆరుగంటలకు ప్యాసింజర్ లోనే వెళదాము అని నిశ్చయించు కున్నారు. ఏ స్టేషన్ లో ఐనా మరోక్క గంటకు రైలు  వస్తుందనగా టికెట్లు ఇస్తారు. కానీ పట్నంలో అలా కాదు ఉదయం మొదలు సాయంకాలం వరకు టికెట్లు అమ్ముతూనే ఉంటారు. అందుకని ప్రయాణికులు తొక్కిడి లేకుండా ముందుగానే టికెట్లు కొనుక్కోని ఉంచు కుంటారు.

ఇప్పుడు నల్లకొండ ఉత్సాహం కొద్దీ పోయి మంగళవారం షాపు కట్టేసి ఉదయానే రెండు టికెట్లు కొని నల్ల జీన్స్ లో పెట్టుకొని  చక్కగా ఇంటికి వచ్చాడు. దంపతులిద్దరూ కలసి మధ్యాహ్నం మల్లా శ్రమపడి ఒక పసుపు రంగు ట్రంకుపెట్టేలో బట్టలు సామాన్లు సర్దుకొన్నారు. మళ్ళీ వ్యవధి ఉంటుందో ఉండదో యని తలచి నల్లకొండ భార్య రాత్రి పూటే వంట చేసేసి సిద్ధంగా ఉంచింది. రాత్రి పడక కావాలి కనుక పక్కన చుట్టి ఇవతల పెట్టారు. పొద్దుటే చుట్టయ వచ్చునని. తక్కిన సరంజామంతా ప్రయాణానికి తయారుగా ఉంచారు. “సరిగా ఐదు కొట్టేసరి కల్లా మనం లేవాలి సుమా! నీకు ముందు మెలుకువ వస్తే నన్ను లేపు, నాకు మెలుకువ వస్తే నేను లేపుతాను. అంటూ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు. నల్లకొండ. పడుకున్నాడే కానీ ప్రయాణపు అలోచన అతనికి నిద్రలేకుండా పోయింది. ఎలా ఐతేం అనుకొన్నట్టు తెల్లవారు జామునే లేచాడు. భార్యను లేపాడు. ఇద్దరూ స్నానం చేసుకొని చద్ధిన్నం తినేసి దుస్తులు వేసి కొన్నారు. ఇక బయల్ధేరదాము అనుకొనే సరికి “టికెట్లు కనిపించలేదు. ఎక్కడ ఉన్నాయి? అని  నల్లకొండను భార్య అడిగింది. నల్లకొండ కంగారుపడుతూ అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు. ఇల్లంతా గాలించాడు. కొంతసేపు ఆలోచించగా అతడు టికెట్లు కొన్నారోజు నల్లజీస్స్ లో పెట్టి నట్లు గుర్తు వచ్చి జీన్స్ ట్రంకు పెట్టె అడుగున సర్ధేసినట్టు గుర్తు వచ్చింది. అప్పటికి ఆరు కొట్టటానికి నలభై నిమిషాలు తక్కువగా ఉంది. నల్లగొండ అప్పుడు భార్యను కోప్పడుతూ ట్రంకు పెట్టితాళం చెవి ఇవ్వమన్నాడు కంగారులో ఆమె అక్కడ వెతికింది. ఇక్కడ వెతికింది. ఇల్లంత గాలించింది.

ఎక్కడా కనపడలేదు కాస్తంత స్తిమితపడి ఆలోచించగా ఆ తాళం చెవి చీరకొంగున ముడివేసినట్టు ఆమెకు గుర్తుకు వచ్చింది. “ఓసి…. నీదుంపతెగ ఆ చీర ఏమైంది? అంటూ అరుపులు పెట్టాడు. నల్లకొండ.”చీర చాకలికివేశాను వేసేముందు తాళం చెవి విప్పి బొట్టు పెటలో పెట్టినట్టు గుర్తు అని చెప్పింది ఆమె..! ఐతే బొట్టుల పెట్టి ఏదీ అని నల్లకొండ కంగారుగా ప్రశ్నించాడు. “పిల్లవాడు మారం చేస్తుంటే ఊరుకో పెట్టడానికి వాడికి ఇచ్చాను అన్నది ఆమె గబ.. గబ..లాడుతూ ఇద్దరూ పిల్లవాడు ఆడుకొంటున్న చోటికి పోయి చూచే సరికి ఇకనే ముంది ట్రంకు పెట్టి తాళం చెవి పిల్లవాడి గొంతులో పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇది చూచిన నల్లకొండకూ, భార్యకు మతి పోయినట్టు అయింది.  నల్లకొండా ధైర్యం తెచ్చుకుని ఉపాయం అలోచించి పిల్లవాన్ని చేత డోకిం చేయించారు. తాళం చెవి టింగ్ అని బయట పడింది. అప్పటికి పావు తక్కువ ఆరు అయింది. క్షణమైన ఆలస్యం చేయక వారు ఆ తాళం చెవి పట్టుకువెళ్ళి పసుపు రంగు ట్రంకు తెరిచి అడుగున ఉన్న నల్ల జీన్స్ జేబులో నుంచి రెండు టికెట్లు తీసుకుని తిరుగా పెట్టిసర్దుకొనే సరికి ఆరు గంటలు కావడానికి పది నిమిషాలు ఉంది.

“ఐనా పరవాలేదు మన ఇంటికి స్టేషన్ దగ్గరే కనుక రైలు కదలుతూ ఉన్న ఎక్కేయవచ్చు అని నల్లగొండ గుండె నిబ్బరం తెచ్చుకుని భార్యను పిల్లవాడినీ వెంట బెట్టుకొని పక్కచుట్టను చంకన బెట్టుకొని బయలుదేరాడు. బయలుదేరి ముందుకు నాలుగు అడుగులు వేశారో లేదో ఆ కంగారులో డబ్బుల సంచి ఇంట్లో వదిలేసినట్టు గుర్తుకు వచ్చింది.  అతనికి వెతికి పట్టుకు వచ్చాడు. అప్పటికే ఆరుకి ఐదునిమిషావు మాత్రమే ఉన్నది. తీర మళ్ళీ బమలుదేరి పది గజాలుసాగే టప్పటికి భార్య ఇంటి తాళం సరిగా పడింది లేదో జాగ్రత్తగా లాగి చూశారా!చూడబోతే రోజులు బాగలేవు. అని అనుమానం పెట్టింది. నల్లకొండ భార్య వైపు కారాలు, మిరియాలు నూరుతూ “మీరు నడుస్తూ ఉండండి అని వాళ్లతో చెప్పి నల్లకొండ మళ్ళీ ఇంటికి పోయి తాళం జాగ్రత్తగా లాగి చూచి తిరిగి వచ్చాడు.

బయలుదేరినప్పటి నుంచి ఇద్దరిలో ఏదో ఒక అనుమానం వస్తూ ఉన్నాయి. అందుచేత రైలుకి పోవటానికి ఆలస్యమైన పోతుంది. అనే ఉద్దేశంతో నల్లకొండ ప్రయాణం సరంజామంతా సరిగా ఉన్నదా! లేదా! ఒకసారి నిధానంగా చూసుకున్నాడు టికెట్లు ఉన్నాయి, డబ్బు సంచి, వచ్చింది, ట్రంకు పెట్టి ఉంది. పిల్లగాడు ఉన్నాడు, నా భార్య ఉంది, నేను ఉన్నాను. దారిలో ఇలా అనుకుంటూ నడవసాగాడు. ఇంతలో టంగ్, టంగ్ అని ఆరుగంటలు కొట్టెసింది. రైలు కూత కూడ వినపడింది. ఇంతలో స్టేషన్ నుంచి బయటకు ప్రయాణికులు ఎదురు వచ్చి రైలు వెళ్ళి పోయిందని చెప్పారు. చేసేదేముంది? కంగారుపడే నల్లకొండ దంపతులు ప్రయాణం చివరికి ఇలా తేలింది. తీరా నల్లకొండ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఖాతాదారులు లందరూ వాని చుట్టూ చేరి. “ఏం నల్లకొండ మాకు పండగ పూట గడ్డం తీసేవాడు లేకుండా పారిపోతున్నావు. అనగా అందుకే నాకు తగిన శాస్తి జరిగినది. నల్లకొండ కికుర మనలేదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!