వైకుంఠపాళి

అంశం: హాస్య కవిత

వైకుంఠపాళి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

“అప్పు చేసి పప్పుకూడు తినరా, ఓ నరుడా!
‘ఇంటికి అప్పు,
బండికి అప్పు,
పెళ్లి కి అప్పు,
చదువుకి అప్పు,
‘అప్పు లేని జీవితం
ఉప్పులేని పప్పు!!
బ్యాంకుల, ప్రైవేట్ ఆర్థిక సంస్థల ప్రబోధాలు ,
సామాన్య మానవుని
ప్రలోభాలకు గురిచేసి,
‘వాయిదాల పద్ధతిలో జీవితం ఉన్నంత వరకు
తమ బానిసలను చేసుకొని,
నిలువునా దోచేస్తున్న,
మనిషిలోని కోరిక పెను భూతంలా గర్జిస్తూ,
క్షణక్షణం మనల్ని అత్యాశలకు గురిచేసే ,
‘కలియుగ వైకుంఠపాళి’
అంచలంచలుగా, ఎదుగుతున్నామ్మన్న బ్రమతో,.
‘చక్రవడ్డీ ల సర్పం’ నోటి లోకి తెలియకుండా వెళ్లడమే,
“కాశీకి పోయాను రామా హరి!!,
ఇది కాష్టంలో బూడిద రామా హరి!,
అంటూ స్వగతంలో పాడుకుంటూ,
తనకు వచ్చే జీతంలో
ముప్పావు సగం, సులభ వాయిదాలకు పోగా,
కుటుంబ పోషణ అతలాకుతలమై,
కానరాని దేవుళ్ళను ఆశ్రయించి,
“వెంకటేశ్వర స్వామి కూడా
కుబేరుడి ‘దగ్గర అప్పు తెచ్చారు కదా!! అన్న నిబ్బరంతో,
పెను భారాన్ని మోస్తూ, లోకానికి తాను ఒక ఆదర్శ పురుషుడని
గొప్పలు చెబుతూ, నయవంచన చేసుకునే వాడే, ఈ కలియుగ మానవుడు.!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!