అంశం: హాస్య కవితలు
ఏమిటో ఈ మాయ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధవి బైటారు
ఏమిటో ఈ మాయ, శివయ్య!
వండిన వంటలే వండీ వండీ
తోమిన గిన్నెలే తోమి తోమి
ఉతికిన బట్టలే ఉతికి ఉతికి
తుడిచిన ఇల్లే తుడిచి తుడిచి
చిరాకొచ్చి బయటకి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామనే తొందర
ఇంట్లో ఉండలేక, బయటా ఉండలేక
పరేషాన్ అవుతున్న
ఏమిటో ఈ మాయ, శివయ్య!
అదేంటో చూసిన సీరియల్ మాత్రం
మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటుంది
ఎంత చూసినా విసుగు రాని
ముఖ పుస్తకం (FB) పిలుస్తుంటుంది అప్పుడే పది నిముషాలయ్యింది నన్ను చూసి అంటూ
ఇంతలో కొత్త వార్తలు మోసుకొచ్చానోచ్ అని ట్విట్టర్ పక్షి కూస్తుంది
నేనేం తక్కువయ్యాను అని ఇన్స్తాగ్రం ఊరిస్తుంది
దాంతో ఎక్కడి పనులు అక్కడే
ఏమిటో ఈ మాయ, శివయ్య!