సమయంతో పయనం

సమయంతో పయనం

రచన: శ్రీదేవి విన్నకోట

మీ నుంచి కొంచెం కొంచెంగా తరిగిపోతున్నా.
నన్ను కోల్పోతే మళ్ళీ తిరిగి రాను అంటున్నా
నేను మీ చెంత  అనువుగా ఉన్నప్పుడే
నన్ను మిమ్మల్ని  సద్వినియోగం చేసుకోమంటున్న
లేదంటే గడచిపోయిన నన్ను తలుచుకుని
జీవితాంతం బాధపడతారంటూన్న
మిమ్మల్ని సమస్యల్లో తోసెయ్యలన్న
మిమ్మల్ని సమస్యల నుంచి  బయటపడేయాలన్న
నా వల్లే అవుతుంది అని మీకు మరీమరీ చెప్తున్నా
అందుకే నన్ను నిర్లక్ష్యం చేయకండి,
నేను కాలాన్ని, మీరు నిర్లక్ష్యం చేసినా
నన్ను సమయానికి ఉపయోగించుకోలేకపోయినా,
నేను మీకు  మళ్ళీ తిరిగి రాని కాలాన్ని.
అందుకే కాలం విలువ తెలుసుకోండి
కాలం విలువ తెలుసుకుని. తెలివిగా ఖర్చు పెట్టండి
కాలంతో పాటు మీ ప్రయాణం కొనసాగించండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!