సూర్యతో నా పయనం

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

సూర్యతో నా పయనం..

రచన:ఎన్.ధన లక్ష్మి

” హా అమ్మా బస్ ఎక్కాను …ఇంకో 4 గంటలలో నీ కళ్ళ ముందర ఉంటా ..బై అమ్మ… హామయ్య విండో సీట్ దొరికింది సాంగ్స్ వింటూ, చాక్లేట్ తింటు హ్యాపీగా జర్నీ పూర్తి చేయచ్చు… తన ప్లేస్ లో కూర్చొని తన లోకంలో మునిగిపోయి ఉన్న సిరికి ఎక్స్క్యూజ్మీ  అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఎదురుగ ఉన్న అబ్బాయిని చూసి షాక్ తో అలాగే చూస్తూ ఉండిపోయింది..
అతను ఈ సీట్ ని నేను బుక్ చేసుకున్న అండి..
మీకు తెలియక కూర్చొని ఉన్నట్టు ఉన్నారు.. కాస్త లేస్తార???
హల్లో మిమ్మల్నే అని గట్టిగ అరుస్తాడు.దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి తన సీట్ లో కూర్చొని తన ఫ్రెండ్ కి వాట్సప్ మెసేజ్  చేస్తుంది ..
వారి చాటింగ్ ఇలా ఉంటుంది…
” ప్రియా…నా కలల రాకుమారుడు,నా పక్కనే ఉన్నాడే!!ఎంత బాగా ఉన్నాడో తెలుసా…”
” ఎవరి సిరి…”
” గుర్తుకు రాలేదు ! మై ఒప్పా నే..
” అదెలా సాధ్యం!  మన ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అంటే నువ్వు అప్పటికప్పుడు ఊహించి వేసిన డ్రాయింగ్ లో ఉన్న అతనా!!! అలా ఎలా వచ్చాడే…”
” ఏమైనో ! మీరంతా అలాంటి వారు ఉండరు అని ఎగతాళి చేశారు.. కానీ అతను ఇక్కడే ఉన్నాడే.నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ప్రియ..
” కొంపతీసి ఐ లవ్ యూ అని చెపుతావా ఏంటి???
” ఒకవేళ నేను చెప్పి తను కాదంటే నేను తట్టుకోలేను ..తనతో  ఈ కొద్దీ గంటలు ప్రయాణం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను…”
” సిరి అతను వైపు చూస్తే ఈ లోకంతో సంబంధం లేనట్లు పుస్తకము చదువుకుంటు ,పాటలు వింటూ ఉన్నాడు .
సిరి మనసులో ” మై ఒప్పా! నా లాంటి వాడే…తనని చూస్తూ అలాగే ఉండి పోయింది .
ఇంతలో బస్ టైర్ పంచర్ అవ్వడంతో ఈ లోకం లోకి వచ్చింది..రిపేర్ చేయడానికి ఓ అరగంట పడుతుంది అన్నీ డ్రైవర్ చెప్పడంతో  పైగా బస్ అగిన ప్లేస్ చూడడానికి అందంగా ఉండడంతో  అందరు దిగి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు..
అతను దిగడంతో సిరి కూడా తనని అనుసరించి వెళ్ళింది..
ఓ పాప ఆడుకుంటూ పొదలచాటులోకి వెళ్లిపోయింది..అక్కడే ఉన్న పాము పాపకి కాటు వేసింది..పాప గట్టిగ అరవడంతో అందరు పరుగున అటు వెళ్ళారు..పాప అమ్మ ,నాన్న కంగారు పడ్డారు
అతను విషం ఎక్కకుండా కాలుకి తన కర్చీఫ్ కట్టి విషం తన నోటితో తీసి వేసి  పరుగున వెళ్లి తన బ్యాగ్ లో నుండి ఫస్ట్ అయిడ్ కిట్ ఓపెన్ చేసి ఒక ఇంజెక్షన్ వేశాడు..
పాపకి ఏమి కాదు అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు..
బాబు మీరు అని అడిగిన వాళ్ళకి..
ఐ యాం డాక్టర్ సూర్య..అని పరిచయం చేసుకున్నాడు…అక్కడ ఉన్న వారు అందరు తనని పొగడడంతో  ” అది నా వృత్తి  ధర్మం అని నవ్వుతూ పాపకి దైర్యం చెప్పారు..
సూర్య నువ్వు చేసిన ఈ పనితో నాకు చాలా చాలా నచ్చావు  అని సిరి తన మనసులో అనుకొని మురిసిపోయింది..
ఇంతలో అక్కడ ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి ఆకాశం మొత్తం మబ్బులతో నిండి పోయి  వాన రావడంతో అందరూ హడావిడిగా బస్ వైపు పరుగు పెట్టారు. అలా పరుగుపెడుతు సిరి పడబోతే
సూర్య పట్టుకున్నాడు..
సిరి మనసులో ఎంతో మురిసిపోతూ నవ్వుతూ థాంక్స్ చెప్పి బస్ ఎక్కింది.
టైర్ రిపేర్ చేయడం అవ్వడంతో వారి ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది..
సిరి ఎలా అయిన సూర్యతో పరిచయం పెంచుకోవాలని ధైర్యాన్ని తెచ్చుకొని గట్టిగ గాలి పీల్చుకొని సూర్యతో
” నా పేరు సిరి అండి..నేను యూనివర్సిటీ లెక్చర్ గా వర్క్ చేస్తున్న.. అంది
” ఓ అలాగ అన్నాడు…”
సిరి  తన గురించి లోడ లోడ ఎదో ఒక్కటీ వాగుతూనే ఉంటుంది.ఒక్క పక్క చాక్లేట్ తింటూనే చెపుతూ ఉంటుంది..అతను అన్నిటికీ నవ్వుతూ ఓ అలాగ..అని అంటూనే ఉంటాడు..
విసిగి పోయినా సిరి చిరు కోపంతో
” ఏంటి అండి మీ డాక్టర్స్ అంతా అంతేనా ఎక్కువగా
మాట్లాడరా అండి ”
” సూర్య నవ్వుతూ…మీరు అందరు ఉన్నటే ఉంటాము..ఎక్కువ ఏవీ ఎక్స్ప్రెస్ చేయము.మేము అన్ని లోపలే దాచుకుంటాము ఎందుకంటే మేము అందరికన్నా బలంగా ఉండాలి కాబట్టి..ఒక్క రోగుల దగ్గర తప్ప ఇంకా ఎక్కడ  ఎక్కువగా మాట్లాడము తెలుసా..
డాక్టర్ కావాలకునే  వాళ్ళ బాల్యము ఎలా ఉంటుందో తెలుసా????
బాల్యంలో మిత్రులందరూ ఆడుకునే సమయంలో తాను మాత్రము రోజుకి 18 గంటలు పుస్తకాలు పట్టుకొని నాలుగు గోడల మధ్య బందీ అయి తన బాల్యాన్ని దానిలోని ఆనందాన్ని కోల్పోతాడు..
తన మిత్రులందరూ చదువులైపోయి ఉద్యోగాలు మొదలుపెట్టేసినా తాను మాత్రము ఉన్నతచదువులని,ఇంకో 4 సంవత్సరాలు చదువు కొనసాగించూకోవలసి వస్తుంది.
అసలు మేము చదివింది డాక్టర్ కోర్స్ అయిన ఎన్నో పనులు చేస్తాము అవి ఏంటో తెలుసా…
శస్త్రచికిత్స సమయంలో
1. చర్మ కారుని గా మారి మనిషికి కుట్లు వేస్తాము
2. వడ్రంగి గా మారి మన ఎముకల్ని అతుకువేస్తాము కసాయిగా మారి మనలోని దుర్మాంసాన్ని నరుకుతాము
4. బైపాస్ సర్జరీ సమయంలో ప్లంబర్ గా మారి నరాలు హార్ట్ అతకిస్తాము
అందరూ పనులు ప్రాణం లేని వస్తువులపై చేస్తే డాక్టర్ మాత్రం బతికున్న మనుషులపై చేసి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇస్తాడు.. ప్రాణం కాపాడి దేవుడవుతాడు..

మీ డాక్టర్స్ చాలా గొప్ప వారండి..మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా..

“అదేమీ లేదు సిరి గారు ఈ చుట్టూ పక్కల గ్రామాలలో  వీకెండ్ లో వెళ్లి క్యాంపులు నిర్వహిస్తూ ఉంటాము .అలాగే అవయవదానం  గురించి  అవగాహన కలిగిస్తున్నాయని. ఆల్రెడీ మా టీమ్ మార్నింగ్ వెళ్ళిపోయి ఉన్నారు. నేను అనుకోకుండా ఒక  ఆపరేషన్ చేయవలసి రావడంతో నేను వెళ్ళడం ఆలస్యం అయింది”
“మరి కార్ లో వెళ్లకుండా బస్ లో ప్రయాణం.. ఏంటి సూర్య గారు..”
” నాకు కార్ లేదండి..బైక్ మీద అంతదూరం ప్రయాణం అంటే ఇంట్లో వారు ఒప్పుకోరు..నాకు ఇలా బస్ లో ప్రయాణం చేయడం అంటే ఇష్టం.”
ఇంతలో సూర్యకి ఫోన్ రావడంతో డిస్ప్లే కనపడ్డ పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి  మాట్లాడి పెట్టేసి చాలా ఆనందపడుతున్నారు.
” ఏంటో సూర్య గారు తెగ సంతోషపడుతున్నారో ఎందుకో తెలుసుకోవచ్చా…”
” ఒక చిన్న పాప ఏక్సిడెంట్ లో కళ్ళు కోల్పోయింది .
ఆ పాపకి సరిపోయేలా కళ్ళు దొరికాయి అంటా..ఆ విషయం మా ఫ్రెండ్ చెప్పారు.ఇంకో కొద్దీ రోజులలో ఆ పాప ఈ ప్రపంచాన్ని చూస్తుంది”
” మనం చనిపోతూ ఇంకొకరికి జీవితాన్ని ఇవ్వడం ఎంత గొప్ప విషయం.ఎదో ఒక్క రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం..మన  బ్రతకుకి ఓ అర్థం ఉండాలి కదా..అందుకే వీకెండ్స్ లో  ఇలా క్యాంపులు నిర్వహిస్తూ అవయవదానం పై అవగాహన కలిగిస్తుంటాను..”
” ఇంకొకరి సంతోషంలో నీ ఆనందాన్ని వెతుకుతున్నావు..ఎంత గొప్ప మనసు నీది  అని సిరి మనసులోనే సూర్య వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటుంది..”

” మీ మాటలతో నేను ఏకభవిస్తున్నాను..నేను కూడా డోనార్ గా రిజిస్టర్ చెప్పించుకుంటాను..నా ఫ్రెండ్స్,బంధువులలో వీటి విలువ చెప్పి వారిని మీరు చేస్తున్న పనిలో భాగస్వామి అయ్యేలా చేస్తాను..”

     ” చాలా థాంక్స్ సిరి గారు…”
” మీ ఫోన్ నంబర్ ఇస్తారా సూర్య …”
” హా అలాగే అండి..”
సడెన్ గా డ్రైవర్  బ్రేక్  వేయడంతో  ఇద్దరి ఫోన్ కింద పడ్డాయి..
మీరు ఆగండి..సిరి గారు అని తను ఫోన్స్ తీస్తాడు..ఇంతలో సిరి కి ఫోన్ కాల్ రావడంతో డిస్ప్లే లో ఉన్న తన డ్రాయింగ్ ని చూసి ఆశ్చర్యపోతాడు..
సిరికి ఫోన్ ఇచ్చేసి…నన్ను చూసింది ఇప్పుడే మరి డ్రాయింగ్ ఎలా అని అడుగుతారు…
” సూర్య గారు …నేను చెప్పేది విని నవ్వకండి..
ఓ సారి సరదాగా ఫ్రెండ్స్ అంత మీటింగ్ పెట్టుకొని
వారి కలల రాకుమారుడు ఎలా ఉండాలి మాట్లాడుకుంటూ ఉన్నామూ..ఇంతలో నా టర్న్ వచ్చింది..నా మదిలో ఉన్న భావాలను ఇలా డ్రాయింగ్ వేస్తే మీరు వచ్చారు..అప్పటి నుంచి నేను మీ రూపాన్ని  ప్రేమిస్తున్న .నా ఫ్రెండ్స్ అంతా నన్ను తెగ అట పట్టించారు కూడా ఉంటారో ,లేదో తెలియకుండా ప్రేమ ఏంటో అని…ఈ రోజు మీరు ఎదురు పడ్డారు..
ఐ లవ్ యూ సూర్య గారు.. మీ నిర్ణయం అవును అయితేనే చెప్పండి కాదు అంటే మాత్రము దయచేసి చెప్పకండి..విని తట్టుకునే ధైర్యం నాకు లేదు అని చెప్పేసి పాటలు పెట్టుకొని కళ్ళు మూసుకుంది..”
సిరి ఒక్క కన్ను తెరిచి చూసింది..సూర్య తన వైపు చూస్తున్నాడు అది చాలా ప్రేమగా ..
” సిరి గారు నన్ను ఓ అమ్మాయీ ఇంత పిచ్చిగా ప్రేమిస్తుంది అనుకోలేదు.. మీ స్వచమైన మనసు చాలా నచ్చింది…కాకపోతే నా వృత్తిలో  భాగంగా ఎక్కువ సేపు భయట గడపవలసి ఉంటుంది..మీతో తగినంత సమయం గడపకపోవచ్చు..సెలవు రోజుల్లో కూడా క్యాంపులు మీద వెళ్తుంటాను..ఇవ్వని మీకు ఇష్టం అయితే మనం పెళ్లి చేసుకుందాము..”
” సిరి సంతోషంగా నవ్వుతూ…మీరు నా వారు అయితే చాలు ఇంకా ఏమి అవసరం లేదు.. మీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ,మీకు చేదోడు వాదోడుగా  బ్రతుకుతాను.. మీ పై ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయను.మీరు నాతో క్షణం ఉన్న చాలు వాటి జ్ఞాపకాలతో  బ్రతకతాను..”
” సూర్య కంట్లో నీళ్లు తిరిగాయి…సిరి స్వచమైన, నిస్వార్థమైన ప్రేమని చూసి చలించిపోయాడు”
” తనని హగ్ చేసుకోవాలని అనుకున్నాడు ..ఇంతలో
బస్ లో ఎవరో అతనికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది అనడంతో సూర్య వెళ్లి ట్రీట్ చేశారు.అతను  చాలా భయపడి ఉంటారు. డాక్టర్  గారూ  నాతో పాటు ఉండండి అనడంతో సూర్య అక్కడే ఉండి అతనితో  కబుర్లు చెపుతూ ఉంటాడు ”
” సూర్య నువ్వు  నా ప్రేమను  ఒప్పుకున్నావు .మన గురించి ఇంట్లో చెప్పి  పెళ్లిచేసుకుందాము..
ఈ  విషయం  ప్రియా కి  చెప్పాలి అని  ఫోన్ తీసి మొత్తం  చెప్పుతోంది ఇంతలో  ఆక్సిడెంట్ …….

కొద్దిరోజుల తర్వాత :
అమ్మ  నొప్పిగా ఉంది కళ్లకు ఎదో అడ్డుగా ఉంది
సిరి జరిగిన బస్సు ప్రమాదంలో నీ కళ్ళు పోగొట్టుకున్నావ్ అమ్మా నీకు ఆపరేషన్ జరిగింది.
నీ ఫ్రెండ్ ప్రియా  వచ్చింది మాట్లాడుతూ  ఉండు నేను వెళ్లి టిఫిన్ తీసుకుని వస్తా
ప్రియ సూర్య గారికి ఏమి కాలేదు కదా?
లేదు సూర్య గారు బాగానే ఉన్నారు ఏదో పని మీద బయటకి వెళ్ళారు. కొద్దిసేపట్లో నిన్ను కలవడానికి వస్తారు.

డాక్టర్ వచ్చి కట్లు విప్పుతారు
అమ్మ ,నాన్నను,ప్రియాను చూసి సంతోషపడి సూర్య గారు ఎక్కడ అని అడుగుతుంది …
ప్రియా ఏడుస్తూ  ” నీ సూర్య ఇక లేడు ! ”
సూర్య గారు  అని  గట్టిగ ఏడుస్తు వెళ్లిపోవడానికి
ప్రయత్నిస్తుంది సిరి.
ప్లీజ్ సిరి గారు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి మీ చూపు పోయే ప్రమాదం ఉంది…
నా సూర్య లేని జీవితం నాకు అక్కర్లేదు…ఇంకా ఈ కళ్ళు ఏమి అయితే నాకేంటి…
ప్రియ గట్టిగ ” సూర్య గారి కళ్ళకి ఏమైనా అయితే నీకు ఇష్టమైన….”
ఏమిటి ప్రియ నువ్వు అంటున్నది…
” నీకు పెట్టిన కళ్ళు ఎవరివో కావు… నీ సూర్య గారివి అని తన ఫోన్ లో విడియో ప్లే చేస్తుంది..
” బెడ్ పైన సూర్యని చూడగానే సిరి మనసు విలవిలలాడింది …
” సిరి నీతో కలిసి ఉండాలి అనుకున్న దేవుడు మన తలరాత ఇంకోలా రాశారు..
నేనేమీ బాధ పడడం లేదు ..ఎందుకో తెలుసా! నీ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తాను. నీతోనే నేను జీవితాంతం కలిసి ఉంటాను కూడా
నేను లేను అని నీ జీవితాన్ని అంతం చేసుకోవడం లేదా జీవితాంతం ఒంటరిగా ఉంటాను అనే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నీ సూర్య నిన్ను క్షమించడు అర్థం అయిందా..
జీవితంలో అన్నివిధాలుగా నువ్వు ముందుకు వెళ్ళాలి.నాతోనే నువ్వు ఆగిపోకూడదు..
నువ్వు ఏడిస్తే నేను ఏడిచినట్టే గుర్తు పెట్టుకో!
నేను వెళ్లిపోతు ఇంకొకరికి జీవితాన్ని ఇస్తున్న.నేను వాళ్ళందరి రూపంలో బ్రతీకే ఉన్న కదా..
నాతోనే ఈ   అవయవదానం కార్యక్రమం  ఆగిపోకూడదు అందరికీ అవగాహన రావాలి. నువ్వే
బాధ్యత  తీసుకోని ప్రజలందరిలో అవగాహన కలిగించాలి.. ఇదే నీ సూర్యకి నువ్వు ఇచ్చే ప్రేమ కానుక.
” కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి అనుకున్న సూర్య గారు మీ కళ్ళతోనే ఈ లోకాన్ని చూస్తాను అనుకోలేదు..నేను బాధ పడను. నీకు మాట ఇస్తున్న సూర్య నువ్వు అన్నట్టు అన్ని విధాలుగా జీవితంలో ముందుకు వెళ్తాను అనుకుంటూ ప్రేమగా ఫోన్ ని  గుండెకి హత్తుకుంది..”
” పని చేసుకుంటేనే వీకండ్స్ లో సిరి సూర్య లాగ
టీమ్ ని  ఏర్పాటు చేసి విలేజ్ లో , టౌన్ లో, సిటీలో అన్ని చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవయవదాన ముఖ్య ఉద్దేశం ఏమిటి , ప్రాముఖ్యత ఏమిటి, ఎలా మరొకరికి జీవితం ఇవ్వచ్చు ఇలాంటి వాటినన్నిటినీ వివరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు..ఈ కార్యక్రమం సక్సెస్ అయి  ప్రతిసారీ ఒకరికి కొత్త జీవితం రావడం, ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందాన్ని చూస్తూ చాలా సంతోష పడుతోంది  … వారి నవ్వులో సూర్యని చూసుకుంటూ మురిసిపోతోంది సిరి
” సూర్య   గొప్ప వ్యక్తి అని తన జీతంలో సగం సామాజిక సేవలకు ఉపయోగించేవారని. పేషెంట్ బిల్లులు కట్టే వాడిని , ఉచితంగా మందులు తీసి ఇచ్చేవారని , ఉచితంగా వైద్యం చేసేవాడిని ఇలా పలు విషయాలు తెలిసాయి ఈ క్యాంపుల ద్వారా సిరికి..
” సిరి వాళ్ళ బావని పెళ్లి చేసుకున్నది. తన భర్త అంగీకారంతోనే తనకు పుట్టిన బిడ్డకు సూర్య అని పేరు పెట్టుకుంది. ప్రేయసిగా పంచలేని ప్రేమను తల్లిగా
అంతులేని ప్రేమను, మమకారాన్ని పంచుతోంది చిన్నారి సూర్య కి.
తన భర్త సహాయం తో అవయవ దాన కార్యక్రమం గురించి ప్రజల్లో మరింత అవగాహన కలిగిస్తూ ముందుకు సాగిపోతోంది సిరి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!