ఈ బంధం

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

ఈ బంధం..

రచన:అరుణ చామర్తి ముటుకూరి

“హాయ్ రామ్, ఎలా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం?” పలకరించాడు కేశవులు.

“బాగుంది సార్ పర్ఫెక్ట్ ఆల్ రైట్.”

“అయితే నీ డ్యూటీలో జాయిన్ అయిపో ఇక, నీ కోసం ఎదురు చూపులు చూస్తోంది నీ చిట్టి” తమాషా గా చెప్పారు కేశవులు

“ఓ నిజమా సార్.. ఆరోగ్యం కుదుటపడిందా చిట్టికి”ఆతృతగా ఆనందంగా అడిగాడు రామ్

“ఆహా నిస్సందేహంగా నీ కోసమే బెంగ పెట్టుకుంది. వెళ్లి ఓదార్చు”

“తప్పకుండా సార్ “అంటూ పరుగున వెళ్ళాడు రామ్.
*. ‌**
దారిలో అందరి పలకరింపు లకు సమాధానమిస్తూ, గబగబా చిట్టి దగ్గరికి వెళ్ళాడు. దూరం నుండి అతని రాకను గమనించిన చిట్టి చాలా ఎగ్జైట్ అవుతుంది. గబగబా చిట్టి దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా మీద పడిపోయింది చిట్టి. ఇన్నాళ్ళూ అతనిక్కూడా ఒంట్లో బాలేక పోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. చిట్టి అతని మీద పడిపోయింది. చేసిన వాళ్ళందరూ కంగారుగా దగ్గరకు వచ్చారు.
‘పర్లేదు పర్లేదు నాకు ఏం కాలేదు’ అన్నట్లు చెయ్యిచూపించాడు రామ్.
వాళ్ళ నెల చూసి నవ్వుకొని పక్కకు తప్పుకున్నారు వాళ్లంతా.
** ***
అదంతా ఆఫీస్ లో కెమెరా లో చూసిన కేశవులు గారి కళ్ళు చెమర్చాయి. ఏమిటో వీళ్ళ ప్రేమ అనుబంధం అనుకున్నారు.
సరిగ్గా 2 నెలల క్రితం ఏం జరిగిందనేది ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది.
రామ్ అక్కడ పని చేస్తూ ఉంటాడు. చాలా సిన్సియర్ గా ఉంటాడు. ఆ సమయంలోనే చిట్టి తో మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువగా అనుబంధం పెరిగింది. ఒకరోజు చిట్టికి ఆహారం తినిపిస్తూన్నప్పుడు ఇట్టి అల్లరిగా అతని వేలు కొరికింది. అదే సరదా ఆటలానే తీసుకున్నాడు అప్పటికి రామ్.
కానీ వారం తర్వాత ఒకటే ఒళ్ళు నొప్పులు దగ్గు ఉండడంతో.. అసలే బయట ప్రపంచం అంత మహమ్మారి తో విలవిలలాడుతోంది అని ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ కి వెళ్ళాడు. అక్కడ పిడుగులాంటి వార్త లాగా పాజిటివ్ అని తెలిసింది. పల్లెటూరు లో ఉన్న తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. వాళ్లకి చెప్పకుండా ఇక్కడ ఒక్కడే ఇంట్లోనే ఉండి తగ్గించుకోవాలి అనుకున్నాడు.
అయితే ఆ విషయం కేశవులు గారి దృష్టిలో వేశాడు. అప్పటికే ఆ విషయం తెలియడం, అనుమానం వచ్చిన కేశవులు గారు చిట్టి క్కూడా పరీక్ష చేయించడం, కొద్దిగా లక్షణాలు ఉన్నాయి అని తెలియడం జరిగిందని రామ్ కి తెలియదు.
రాం వల్లే చిట్టికలా జరిగిందని పై ఆఫీసర్లు మండిపడ్డారు అని రామ్ కి చెప్పలేక, సగం నెల జీతం ఇచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పారు. అప్పటికే రామ్ రెండు వారాలుగా అవస్థ పడుతున్నాడు. ఇంటికి వెళితే తల్లిదండ్రులకు కూడా వస్తే అన్న భయంతో ఇక్కడే ఉండిపోవడం వల్ల కూడా అలా జరిగి ఉండొచ్చు. కేశవులు గారు గట్టిగా మందలించి ఇంటికి వెళ్ళమని చెప్పారు.
ఆయన మాట తీసివెయ్యలేక, ఇంటికి వెళ్లిన రామ్ తల్లిదండ్రుల ఆదరణతో, స్వచ్చమైన గాలులు , సరైన ఆహారంతో త్వరగా కోలుకున్నాడు. అయినా కూడా మరో పది రోజులు అక్కడే ఉండి ఇ పూర్తిగా ఓపిక వచ్చిన తర్వాత రమ్మని చెప్పారు కేశవులు గారు. మొత్తానికి చిట్టిని చూడకుండా రెండు నెలలు గడిచింది.
చిట్టి కూడా కోలుకుంది గాని తన స్నేహితుడు కనబడకపోవడం తో సరిగ్గా తినక నీరసం గా నే ఉంది. వారిద్దరి అనుబంధం ఏ జన్మదో అంతా గుర్తుకు తెచ్చుకున్న కేశవులు గారు అనుకున్నారు భారంగా. ఆయన చూస్తున్న టీవీలో ఏ బంధన్ ప్యార్ కా సంబంథ్ హై జన్మ్ కా… అంటూ వస్తోంది.

నిజమే మరి, ప్రేమతో సింహహాన్నైనా లొంగ తీయవచ్చు. స్నేహం చేయవచ్చు. రామ్ అదే నిరూపించాడు కదా చిట్టి విషయంలో…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!