యుద్ధం

యుద్ధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వనపర్తి గంగాధర్

రాజులు పోయారు రాజ్యాలు పోయాయి
పాలకులలో అత్యాశలు పెరిగాయి
ధన గర్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు
రక్త దాహంతో రంకెలు వేస్తున్నారు

వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాము
ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాము
సుఖానికి కొదవ లేదు ఆనందానికి హద్దు లేదు
అయినా ఎందుకీ రాక్షసక్రీడ

అనాదిగా సాగుతున్నదే బలహీనులపై
బలవంతులు దాష్టిక దోపిడీ యుద్ధోన్మదము
పాలకుల క్రూర మనస్తత్వానికి నిదర్శనము
సామాన్య మానవులకు ప్రాణ సంకటము

రాక్షసత్వానికి పరాకాష్ట యుద్ధము
మిస్సైల్స్ ,అణ్వాయుధాలు
ఎన్నో ఎన్నో భయంకర మారణాయుధాలు

రక్తం ఏరులై పారుతుంది
ఎందరో యుద్ధ రాక్షసి పదఘట్టణల
కింద నలిగి నశిస్తారు
ఓ బీభత్స మారణకాండ యుద్ధం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!