నానీలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చింతా రాంబాబు
శిశిరం
తొంగిచూసింది
ఆమెకు కష్టాలు
మేఘాల్లా కమ్ముకున్నాయి
బడి
మురిసిపోతుంది
పూర్వ విద్యార్థి
తనను ఆదరించటం చూసి.
సూర్యుడు
కళ్ళు ఎర్రబడ్డాయి
రోడ్డు పక్కన
చెట్లు కొట్టితున్నప్పుడు
గురువు చేతిలో కలం
పదునెక్కింది
విద్యార్థి
చక్కని భవిష్యత్తు కోసం