మార్పు

మార్పు

– చెరుకు శైలజ

ఏమండి, మనం అత్తయ్య తో కలిసి మీ అన్నయ్య వాళ్ల ఇంటికి వెళుదామా, సంధ్యా భర్త తో అంది.నేను వెళ్లి అమ్మను దింపి వస్తాను. నువ్వు ఎందుకు అన్నాడు.నేనుకూడ వస్తాను. అత్తయ్య రమ్మంటున్నారు. బావగారి పిల్లలని అక్కను కలిసినట్టు వుంటుంది. వాళ్ళు తెగ మాట్లాడినట్టు, బావగారు కూడా రిటైర్ అయ్యారు కదా,ఆడపిల్లల పెళ్లిలు చేయలేదు.ఏమాటో? మీ అన్నయ్యనే కదా! మీరు అడిగితే బాగుంటుంది.అందుకే వాళ్ళని అడగడానికి అత్తయ్య నన్ను కూడా మీతో కలిసి రమ్మంటున్నారు. అమ్మ పిచ్చి, నీ పిచ్చిగాని, నీకు వాళ్ళు ఏది చెప్పారు ,నోరు విప్పారు, భర్త మురళీ అన్నాడు.సరే మీ ఇష్టం అమ్మ చెప్పింది కదా! అడుగుదాం,తయారు కండి వెళ్లుదాం.
ముగ్గురు కారులో బయలుదేరారు. మురళికి ఒక అన్నయ్య పురుషోత్తం వున్నాడు.అతని భార్య ఉషా వారికి ముగ్గురు కూతుళ్లు . వకుళమ్మ పెద్ద కొడుకు దగ్గర ఆరు నెలలు చిన్న కొడుకు దగ్గర ఆరు నెలలు వుంటుంది. వకుల్లమ్మ పెద్ద కొడుకు పురుషోత్తం గవర్నమెంట్ జాబ్ చేసి ఒక నెల క్రితమే రిటైర్ అయ్యారు.అదే వకుళమ్మ బాధ బిడ్డలకు పెళ్లి సంబంధాలు చూడవా, అని అడిగితే వాళ్ళు చేసుకోను అంటున్నారమ్మ అంటాడు .కోడలేమే ఏమో, అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటే ఎందుకు చేయాం అంటుంది. ఇల్లు రాగానే మురళి ఆలోచనలనుండి బయటకు వచ్చాడు. పురుషోత్తం వీళ్లను చూడగానే రండి రండి అంటు ,ఉషా ఎవరు వచ్చారో చూడు అన్నాడు. ఉషా వంటింటి నుండి వచ్చి ఓ మరిది గారు, సంధ్యా బాగున్నారా అంది. అత్తయ్య రండి, ఇక్కడ కూర్చోండి అంటు వేరే కుర్చీ తెచ్చి వేసింది. పిల్లలు ఏరి అక్క అంది. లోపల ఉన్నారు పిలుస్తాను అంది. రూంలోకి వెళ్ళి పిలిచింది. ముగ్గురు బయటకు వచ్చారు .బాబోయ్, పిన్ని, నానమ్మ బాగున్నారా! అంటు అడిగారు . ముగ్గురు నైటీలు వేసుకొని ఎంతో ఎత్తు గా పొడువు గా వున్నారు.పెద్ద కూతురికి ముప్పై ఐదు ఏండ్లు వుంటాయి. రెండోదానికి 32 ఏండ్లు వుంటాయి. ఇంకా మూడోది ఇరవై ఐదు ఏండ్లు వుంటాయి. ఏం చేస్తున్నారు? ఏం లేదు అమ్మ ఇప్పుడే టిఫిన్ ఇస్తే తిని కూర్చున్నాం అన్నారు. అన్నయ్య రిటైర్ అయ్యారు కదా, మరి పిల్లలకు సంబంధాలు చూస్తున్నారా, మురళీ అడిగాడు.లేదురా వాళ్ళు ఇప్పుడే చేసుకోము అంటున్నారు. “ఆడపిల్లలు అన్నాక అలాగే అంటారు. మనమే సర్ది చెప్పాలి.” ఏం చెప్పినా వాళ్ళు అదే అంటున్నారు రా! అక్క మీరు ఏమనుకుంటున్నారు సంధ్యా అడిగింది.నేను ఏమనుకుంటాను.ఏమైన గట్టిగా చెప్పితే బాధ పడుతారమేనని! అందుకే అడగడం లేదు. మరి ఏమైనా ఉద్యోగం అయినా చేసుకుంటే బాగుండేది కదా, ఏం చూసుకుంటారు? రేపు పెళ్లి అయితే వాళ్ళకు అన్ని పనులే కదా!ఇంకా వాళ్ల తో మాట్లాడడం వృధా అనిపించింది సంధ్యకి . తను ఒకటి చెప్పితే, ఇంకొకటి చెపుతుంది. పిల్లలను చాలా వెనుకేసుక వస్తుంది. అక్కయ్య మీరు ఒక వారం రోజులు పిల్లలను నాతో పంపించండి. మేము వాళ్ళకి అర్ధం అయ్యేటట్టు గా సర్ది చెపుతాం‌.అమ్మో వారం రోజులే,నేను వాళ్ళను విడిచి ఒకరోజు కూడా వుండలేం. అయిన మేము చెపుతునే వున్నాం. మా పిల్లలకి మేము చెప్పుకో లేమా, సంధ్యా, కాదే మీరు చెపుతున్నారు. కాని వాళ్ళు మనసును పెట్టడం లేదు. అదే వేరే వాళ్ళ తో చెప్పిస్తే వాళ్ళు అర్ధం చేసుకుంటారు వకుళమ్మ అంది. అవునే ఉషా అమ్మ చెప్పింది నిజమే, ఆలోచించు,సరే సంధ్యా రెండు మూడు రోజులు ఉంచుకొని పంపించండి. ఏమైనా పరాయి ఇల్లా, ఇంకా ఎక్కువ రోజు లు వుండడానికి, వాళ్ళ ఇష్టం అయినన్ని రోజు లు వుండి నివ్వండి.అలాగే తమ్ముడు, ఎక్కువ వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చిన్న బుచ్చుకుంటే నేను తట్టుకోలేను. అయ్యో అన్నయ్య మాకు కూతురు వుంది. అలా ఎందుకు ఇబ్బంది పెడుతాం. నాకు తెలుసు తమ్ముడు కాని ఇంతవరకు వాళ్ళను ఎక్కడికి పంపించలేదు. పిల్లలను నాలుగు చోట్లకు పంపిస్తే వాళ్ళ కు అన్ని అన్ని తెలుస్తాయి . వకుళమ్మ అంది.సరే నే అమ్మ, ఎక్కువ ఆలోచించకుండా, వాళ్ళను పంపించు తమ్ముడితో, అంటు భార్యకు చెప్పాడు.సరే పిల్లలను పిలిచి చెప్పింది .అమ్మ ఇప్పుడు వెళ్లాలా? ఎందుకు పిన్ని మేము అమ్మ నాన్న లతో వచ్చే వారం వస్తాం అన్నారు. ఈ వారం చెల్లెలు అమెరికా నుండి వస్తుంది. మీరు వస్తె సంతోషపడుతుంది. మీరే రండి చెల్లెను తీసుకోని అన్నారు. . ఇంకా ఏం చెప్పకండి? అమ్మ నాన్న ఒప్పు కున్నారు. మీరు మాతో వస్తున్నారు మురళీ అన్నాడు . తల్లి తండ్రి వెళ్లి రండి అనేసరికి తప్పదు అనుకుంటు వెళ్లడానికి రెడీ అయ్యారు ముగ్గురు. ఒక బ్లాగ్లో బట్టలు పెట్టుకోని కారు ఎక్కారు.
ఆ మరునాడు సంధ్యా కూతురు అమెరికా నుండి వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అక్కలను ఇప్పుడు చూసేసరికి గుర్తు పట్టాలేకపోయింది. సంధ్య కూతురు అమెరికాలో వున్న కూడా తొందరగా లేవడం ,రెడి అయి అమ్మ ,ఏదైనా హెల్ప్ చేయాలా?అని అడిగి తన వర్క్ చేసుకోవడం.
ఈ‌పిల్లలు లేవరు తొందరగా స్నానం చెయ్యరు . సంధ్యా కూతురు ఏదో పని వుందని తండ్రి తో బయటకు వెళ్లింది .సంధ్యా వాళ్ళను లేపి స్నానం చేయమని టిఫిన్ పెట్టి దగ్గర కూర్చో పెట్టుకొని, ఇలా అయితే ఏలాగ , మీరు పెళ్లి చేసుకోమంటే వద్దు అంటారు. పోని ఏదైనా జాబ్ చేసిన బాగుండేది, పెళ్లి లేక జాబ్ లేక ఎలా జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నారు. మీకు మీరే ఏదైనా జాబ్ చేసి సంపాదించుకుంటే బాగుంటుంది.అటు పెళ్లి వద్దని ఇంకా జాబ్ చేయకుండా ఎన్ని రోజులు నాన్నను బాధ పెడుతారు. వాళ్ళకు ఏజ్ వస్తుంది. మీరు కొంచెమైనా ఆలోచించాలి కదా, రేపు అమ్మ నాన్నలు,మీతో జీవితాంతం వుంటారా?ఆలోచించండి. మీకు ఒక తోడు కావాలి .అందుకు మీరు ముందుగా మీకు తగ్గ ఒక్క జాబ్లో జైన్ కండి .పిన్ని నీవు చెప్పింది కరెక్ట్.మాకు జీవితం లో ఏమి సాధించాలి అనే ఆలోచనే రాలేదు అమ్మ నాన్న లతో కలిసి వుండడం అంతే అనుకున్నాం. మీలా మాకు అమ్మ నాన్న ఎప్పుడు చెప్పినే లేదు. నేను చేసుకోను. అంటే చెల్లె తాను కూడా వద్దు అంది .అమ్మ కూడా విడమర్చి చెప్పలేదు. మాకు ఈ చదువుకు ఏం ఉద్యోగం వస్తుంది పిన్ని.మీరు డిగ్రీ చేశారు కదా, ఇద్దరుస్కూల్ లో టీచరుగా చేరండి. చిన్న చెల్లెలు ఇంజనీరింగ్ చేస్తుంది కదా! తను కూడా చదువు పూర్తి అయ్యక జాబ్ లో చేరుతుంది. సరే పిన్ని చాలా మంచి విషయాలు చెప్పారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటు వుండగా,ఆ మాటల్లో వాళ్ళకీ టైం తెలియనే లేదు. సంధ్యా కూతురు, సుష్మా మురళి వచ్చారు. బాబాయ్ మమ్మల్ని ఇంటి దగ్గర దింపుతావా, మేము వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి. ఇన్ని రోజులు అమ్మ నాన్న లను బాధ పెట్టినందుకు క్షమాపణలు అడగాలి .సరే అలాగే మీ పిన్ని మిమ్మల్ని మార్చింది అన్న మాట. పిన్ని మీరు వేరా బాబాయ్, మీ సహాయం కూడా వుంది.మమమలి ఇక్కడ కు తీసుకొచ్చారు కదా!మీ ఇద్దరికి థాంక్యూ పెద్ద కూతురు అంది. అక్క అపుడే వెళ్లి పోతారా,మళ్లీ వస్తాం. ఉద్యోగం లో చేరాక ,ఓకే అంది చెల్లెలు. అందరికి బై చెప్పి ఇంటికి వెళ్లారు. పిల్లలను చూడగానే పురుషోత్తం ఉషా వాళ్ళను గట్టిగా వాటేసుకున్నారు. అమ్మ నాన్న మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుండి ఇంట్లో పని, ఉద్యోగం అన్ని చేస్తాం .ఉద్యోగం చేసుకొని, ఆ తరువాత పెళ్లి చేసుకుంటాం .అవునా నిజంగా బంగారం రా నా బిడ్డలు అంటు పిల్లలను ఇద్దరు దగ్గరకు తీసుకున్నారు భార్య భర్తలు. నిజం గా థాంక్యూ రా తమ్ముడు. అలాగే సంధ్యా కు కూడా ధాంక్స్ చెప్పండి అంది ఉషా.
అలాగే అంటు వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషంగా మురళీ ఇంటికి బయలుదెరాడు .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!