తొలిచూపు

తొలిచూపు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

తొలిసారిగా నిన్ను చూడగానే, నీ ప్రేమలో పడిపోయాను. అది నా తొలిప్రేమ.

పాలుకారే చెక్కిల్లు, అమాయకంగా చూసే కళ్ళు, అందమైన ముఖం, అద్భుతమైన మాట తీరు.

ఆ రోజు, బస్టాండ్ లో  నిల్చుని ఉన్న నిన్ను చూసి, నా మనసు మూగబోయింది. నోట మాట రాలేదు. ఏదో అద్బుతమైన భావం నా మదిని మీటగా, నా మనసు మాట్లాడటం మొదలుపెట్టింది. అంతలోనే నువ్వు నన్ను చూడకుండా, కూర్చుని ఉన్న నువ్వు గబగబా అడుగులు వేస్తూ దూరంగా నడుస్తున్నావు. ఏమైందో అర్దం కాలేదు నాకు. ఆ నిమిషంలో  ఒక పెద్దాయన కాలు స్లిప్ అయ్యి, ఫూట్ పాత్ పైనుంచీ జారి, రోడ్ మీద పడ్డారు. వెంటనే నువ్వు స్పందించి, పరుగున వెళ్ళి, ఆయన్ని రక్షించక పోతే, వేగంగా వచ్చే బస్ ను నువ్వు చూసి ఉండక పోతే, ఆయన ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి ఆరోజు.

నువ్వు ఆరోజు చేసిన ఆ పని,  నా భవిష్యత్ ను కాపాడింది. హా,  ఆ రోజు నువ్వు రక్షించిన ప్రాణం మా నాన్నది.

చూసే కన్నులకు, రూపం బాగుండాలి అనిపించ వచ్చు. కానీ, నీ పై ప్రేమ నింపుకున్న నా హృదయానికి, నీ మనసులోని మానవత్వం నచ్చింది.

నా మాటలకు, కనుల నిండా నీటితో, నమ్మ లేనట్లుగా నన్నే చూస్తూ ఉంది మానస. నేను తన కళ్ళ నీళ్ళు తుడిచి, హృదయానికి హత్తుకుంటే, నన్ను తమకంగా అల్లుకుపోయింది.

నేను నిన్ను అనాధ వి అని జాలిగా పెళ్లాడ లేదు మానస. నువ్వు నా జీవితానికి అర్దం తెలిపిన దేవత వి. అందుకే ఆ రోజే నిన్ను హృదయంలో నిలుపుకున్నాను.

ఇంకో రోజు ఇంటర్వ్యూకి వెళ్ళటానికి అని, సర్టిఫికెట్ ఉన్న ఫైల్ ని బస్ సీట్లో పెట్టి, మా ఫ్రెండు వాళ్ళ అమ్మకి బాగా లేదు అని ఫోన్ చేస్తే, ఆ హడావిడిలో వాటిని ఆ బస్ లోనే పెట్టి బస్ దిగెసాను. అవి నీతోనే ఉంచుకుని, ఆ రోజు కాలేజి కి కూడా వెళ్ల కుండా, నాకు సమయానికి ఆ ఫైల్ అందించి, ఆ జాబ్ నాకే వచ్చేందుకు నువ్వే దోహదం చేసావు.

అలా నా ప్రమేయం లేకుండానే నా జీవితంలోకి అడుగుపెట్టిన నిన్ను, నా అదృష్టం గా భావిస్తున్నాను. అన్నాను.

మీరు చూసే చూపుల్లో కేవలం అందాన్ని ఆరాధించడమే కాదు, నన్ను మీ సర్వస్వం గా అనుకుంటున్నారు అని నేనూ గ్రహించాను.

అందుకే, మా శరణాలయం వార్డెన్, మీ గురించి చెప్పినప్పుడు వెంటనే మీతో పెళ్లి కి ఒప్పుకున్నాను. అదే ప్రేమని కలకాలం నాకు అందించు మనో అంది చిన్న పిల్లలాగా నా ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ.

మానస మనోహర్ లదీ ఓ ప్రేమ కావ్యమే అవుతుంది లే కానీ, నువ్వు బెంగ పడకు, అన్నాను. జీవితంలో మా తొలి అనుభూతి కి శ్రీకారం చుడుతూ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!