నిశ్చయం

నిశ్చయం

రచన: బి హెచ్.వి.రమాదేవి

ఉదయం లేవగానే పాలు బోసే శ్రీను ”
అమ్మా! డబ్బులిస్తారా,!?” రజనీ వంక చూస్తూ అడిగాడు.
“శ్రీను ఇంకా అందలేదు. ఏమీ అనుకోకు. తరువాత ఇస్తాను.”
తనకు చాలా గిల్టీగా ఉంది.ఇంతవరకు అడిగే వరకూ ఎప్పుడూ ఇవ్వకుండా లేదు.ఈ కరోనా సమయం నుండి ఇబ్బందులు.జాబ్ లేదు.నగలన్నీ బ్యాంక్ లోకి వెళ్లాయి.మెడలో ఛైన్ తప్ప ఇంకేమీ లేవు. అది పెట్ట కూడదు.మధ్యతరగతి బ్రతుకులు.పరువు పోకూడదు. ఆపూటకు లేకపోయినా పంచభక్ష్య పరమాన్నాలు తిన్నట్లు అందరికీ కనబడాలి.ఖరీదైన చీరలో కోట్లు వున్నట్లు నటించాలి.సగం సాలరీ వేస్తున్నారు. అదీ తన లాగా లోగడ కష్టపడ్డ వాళ్లకు మాత్రమే!
అది రెంట్ కు,కరెంట్ బిల్లుకుసరిపోతుంది.తనకు ఆమాత్ర మైనా సాయం అందుతుంది. అదీ లేనివాళ్ళు ఎంత మందో! ఎవరినీ తను అడగ లేదు.ఆత్మ గౌరవం ఎక్కువ కదా మరి.పోనీ సొంత వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఇస్తారా!అస్సలుపట్టించుకోరు. మొత్తం అమ్మి వీధిలో నిలబడితే సాయం చేస్తారేమో!రేపు ఏదోఒకటి చేయాలి!
ఏదో గోల్డ్ బ్యాంక్ లో పెట్టినప్పుడు మూడు నెలలకు సరిపడా రైస్ వేయించడం వలన కొంచం కాలక్షేపం జరుగుతుంది. కార్పొరేట్ ఉపాధ్యాయ వృత్తిలో నుండి ఇంకేమన్నాచేయాలన్నా,ఇంకేమి చేయాలో తోచకుండా ఉంది. పాలు ఖచ్చితంగా ఇచ్చేయాలి.పట్టీలు అమ్మేస్తే ,అక్కడ ఎవరన్నా చూస్తే ఎంత చులకన, వద్దు అవి తనకు చాలా ఇష్టం.కానీ ఏంచేయాలి!? ఏదో చేయాలి.మనసు బాగాలేదు.గుడికి వెళదామా! కాసేపు అక్కడ కూర్చుంటే మనశ్శాంతి అయినా వస్తుంది. మరి అటో కు డబ్బులు.లేదు దగ్గరలో నడిచి వెళ్ళే గుడి ఏది వుంటే అక్కడకు తను వెళుతుంది.ఇంట్లో చెప్పి వాతలు దేరింది రజని.నడుస్తూ వెళుతుంది.అంతలో ఒక లావుపాటి కళ్ళద్దాలున్న వ్యక్తి ఆటో దిగాడు.డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇచ్చి ప్రక్కనేవున్న హాస్పిటల్ లోకి ,
వెళుతున్నాడు.చేతినిండా ఉంగరాలు బాగా వున్నవాళ్ళనుకుంటా! రజనీకి అతనంటే అసూయ కలగ లేదు.జీవితం లో శాంతి ,ఆనందం డబ్బు.వలన నే అనేది నమ్మదు.హఠాత్తుగా ఆటో ఆగిన చోట ఓ ఎఱ్ఱని నోటు.వంగి తీసుకుని చూసింది.రెండువేలు.ఆటో అతనికి డబ్బులిస్తుం టేను జారి పడ్డాయి కాబోలు. రెండువేలు పాల బిల్లు పోను జాగ్రత్తగా చేస్తే ఈ నెల గడిచి పోతుంది.అప్పుడు కాలి పట్టీలు అమ్మనవసరం లేదు.గుడికి వెళుతున్నాను కాబట్టి దేవుడే ఇచ్చాడేమో!…
కాదు! కానే కాదు,తానుఈ విధంగా నీచమైన ఆలోచనలు చేయకూడదు. తను డిగ్రీ కాలేజ్ లెక్చరర్! ధౌమ్య ధర్మోపదేశము లో పరుల సొమ్ము పాము ఎముకలుగా
చూడాలని బోధించిన తను విలువలు కాపాడకపోతే ,తన వృత్తి కి,ప్రవృత్తికి ద్రోహం చేసినట్లు అవుతుంది.తను ఎప్పుడూ అలాంటి కక్కుర్తి పని చేయదు.ఎంత కష్ట పడినా సరే! ఒక నిశ్చయానికి వచ్చి హాస్పిటల్ వైపు నడిచింది.లావుపాటి వ్యక్తి దగ్గరకు వచ్చింది.ఏమండీ మీ జేబులో నుండి ఈ రెండు వేలు నోటు ఆటో దగ్గర పడింది.తీసుకోండి. అతడు ఆమె రెండు చేతులు పట్టుకుని భోరున ఏడ్చాడు.అప్పుడు చూసింది.ఆ ఉంగరాలు ఇమిటేషన్ వి అని, ” అమ్మా వైద్యానికి ,మందులకు తాకట్టు పెట్టి తెచ్చాను.నీకు పుణ్యం తల్లి,నూరేళ్ళు జీవించు.నమస్కారం బెట్టి కదిలింది. దేవునికి నమస్కారం చేసి బయలు దేరింది.బంగారం,వెండి షాపు వైపు పట్టీలు అమ్మడానికి, టింగు మని మెసేజ్ వచ్చినట్లు వుంటే చూసింది. కరోనా లో జాగ్రత్తలు గురించి *ఆరోగ్యమే మహాభాగ్యం గ్రూప్* పెట్టిన వీడియో కాంపిటీషన్ లో తనకు ప్రథమ బహుమతి వచ్చినట్లు, ఫోన్ పే చేయడానికి నంబర్ పంపమని, ఆమె పట్టిలను సుతారంగా నిమురుతూ కాసేపు దేవుని గుడిలో కూర్చోడానికి బయలు దేరింది.ధర్మానికి ఎంత పవర్ వుందో ఆమెకు అనేక సార్లు అనుభవమే,! పరీక్ష పెట్టిన వాడే పాస్ చెయ్యాలి మరి,!
ఈ నెల గడిచి పోతుంది అనుకుంటూ ఫోన్ పే నంబర్ పంపిందో లేదో క్షణం లో క్రెడిట్ అయ్యింది.తన నిశ్చయం,
కలిగించిన నిశ్చింతతో నెమ్మదిగా ఇంటికి బయలు దేరింది రజనీ!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!