నా ఊపిరి నీవే
రచన: చింతా రాంబాబు
నీలి మేఘాల చెంతన
దాక్కునున్న శశి లా
నీ చూపులు
నన్ను తాకినప్పుడు
నాకు తెలియలేదు
నీ హృదయంలో నేనున్నానని
నన్ను చూసి నీవు ముసి ముసిగా
నవ్వులు రువ్వినప్పుడు
తెలియలేదు నాకు
నీవు నా ఎదలో కొలువున్నావని…
నా ఎదుట నీవున్నప్పుడు
ఒకరి చూపులు మరొకరికి
తాకినప్పుడు నాకు తెలియలేదు
నా హృదయ స్పందనయ్యావని…
నాకు నీవు దూరమైనప్పుడు
నా గుండెకు తెలిసింది
నా ఊపిరి నీవేనని
నీవు లేకపోతే నేను లేనని.