మనసా-వాచా-కర్మణా

మనసా-వాచా-కర్మణా

మక్కువ. అరుణకుమారి

మనోవీధిలో విరిసే వేదనా వీచికలు
కనుకొలుకుల నుండి చెక్కిళ్ళపై జారిపడిన కన్నీటి చారికలు
అవేగా విచార ప్రతిబింబాలు!

ప్రియసమాగమన తరుణాన కురిసే వీక్షణలు
కనుల కొలనులో విరిసే ప్రియకమలాలు,
విరిపించిన ఆ నెలరాజు శరత్చంద్రికలు
అవేగా ఆనంద ప్రతిబింబాలు!

అలవికాని వేదన ఘనీభవించిన వేళ
మూగబోయిన గొంతు నోటమాట రాక ఆలపించే మౌనగీతాలు
విషాద ప్రతిబింబాలేగా!

మదిలో ఉల్లాసచంద్రికలు నటనమాడేవేళ
మృధు మధుర అధరాలపై పూచే దరహాస చంద్రికలు
ఆ ఉల్లాస ప్రతిబింబాలేగా!

యదలోయల్లో విహరించే భావావేశ విహంగాలు
ముఖ కమలాలపై కొలువు దీరడమే
మనసా ప్రతిబింబాలు
మాటల పదనిసల్లో పల్లవించడమే
వాచికాభినయన ప్రతిబింబాలు
నవరసాల ఆనుసరణాచరణలో ప్రతిఫలించడమే
కర్మణానుసరణ ప్రతిబింబాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!