ఊహా సౌధము
రచన: జీ వీ నాయుడు
కొన్నింటిని వర్ణించలేము
మరి కొన్నింటిని పోల్చలేము
ఇంకొన్నింటిని తేల్చలేము
కొన్నింటిని అసలు ఊహించలేము
ఏమిటి ఈ ప్రకృతి మహత్యము
ఏమిటీ ఈ సృష్టి రహస్యము
ఊహాలోకంలో జీవిస్తున్నాము
ఆశల పల్లకిలో పయనిస్తున్నాము
అమృతం ఎలా ఉందో చెప్పలేము
అద్భుతం ఎలా ఉందో చూపలేము
ప్రేమ విలువ లెక్కకట్టలేము
కౌగలి అనుభూతిని వర్ణించలేము
ఆకాశాన్ని అందుకోలేము
భూమి బరువు కొలవలేము
భవిష్యత్తు ఊహాజనితము
మానవ జీవితం ఉహా సౌధము.