ఆశల ఊయల

ఆశల ఊయల

రచన: పరిమళ కళ్యాణ్

మది దోచిన సఖుడే వరుడయ్యే వేళ!
కలలు కన్న జీవితం ఆరంభించే వేళ!
కోరుకున్న ఆశల తీరం చేరుకున్న వేళ!
ముత్యాల ముంగిళ్ళు తళతళలాడే వేళ!
పండిట్లో పడుచులు కళకళలాడే వేళ!
భజంత్రీలు ఇంపుగా వినవచ్చే వేళ!
పెళ్ళి మంత్రాల ఆశీర్వచనాల వేళ!
పెద్దల సమక్షంలో, పంచభూతాల సాక్షిగా
వధూవరులు ఒక్కటయ్యే వేళ!
కళ్ళలో విరబూసిన ఆనందాల హేల!
పుడమిన పుచ్చ పువ్వులా విరిసెను వెన్నెల!
సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ!

ఊయలలూగుతుంది నా మనసే సుమబాల!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!