నిశ్శబ్ద నిరధి

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నిశ్శబ్ద నిరధి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

నా జ్ఞాపకాల నిశబ్ద నిధిలోకి ఒక్కోసారి
అమాంతం ఒంటరిగా జారి పడిపోతున్న,
ఆ నిశ్శబ్ద నిరధి నుండి బయటికి పోలేక
ఆ జ్ఞాపకాల తలపులతో కొట్టుమిట్టాడుతున్న.

నా గడిచిన జ్ఞాపకాలలో ప్రతిక్షణం అపురూపమే
నా తనువున తొలి జ్ఞాపకాల తలపులు తీస్తే
ఎటు చూసినా ప్రేమాభిమానాల మకరందమే.
ప్రేమైక జ్ఞాపకాలతో కూడిన ప్రతి గుర్తు అమూల్యమే

నా జ్ఞాపకాల లోతుల్లో ఎన్నెన్నో చిరు సందళ్ళు
ఓవైపు బాల్యపు ముద్దు ముద్దు అలకల్లు
మరోపక్క యవ్వన కోరికల చిలిపి అల్లర్లు.
నాలో ఉన్న జ్ఞాపకాల తుట్టెను కదిపి చూస్తే
నాలో కదం తొక్కుతున్నాయి ఏవేవో చెప్పలేని ఊహకందని సంతోష సాగరాల పరవళ్ళు.
మన జ్ఞాపకాలు ఎన్నటికీ మంజులం మృదు మధురం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!