ఓ ప్రియా

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

ఓ ప్రియా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యాంబాకం

తోలిసారి నిను చూసిన
చూపులలో
నీవే నాసర్వం అనుకొని
బ్రతికాను భ్రమలో

నీవు కనపడని ఆ క్షణం
నాలో నేను తడిచి
పోయిన నా కన్నీటి లో

నీవు కనిపించిన ప్రతి
సారి నీ చిరునవ్వు లో
కలసి పోవాలని ఆరట
పడ్డను నాఊహలలో

నీవు ఎప్పుడూ దాగి
ఉంటావు నా గుండెల్లో
నీతో కలసి ఉంటే చాలు
చివరి ఊపిరిలో

వరకు నీతో ప్రయాణం
చేయాలని కలవరింతలో
నన్ను నేను మరచి నీ
తోట మాలిగా మారాను

నా కళల లో కరిగి
పోయిన కాలంలో
నేను జీవించేది నీ
జ్ఞాపకాలలో

నిను చేరలేని ఈ జన్మలో
ఎలా నా ప్రేమ తెలపాలో
తెలియని నీ తీయని
“జ్ఞాపకాల నిశ్శబ్దంలో”
ఉండి పోనా ” ఓప్రియా”!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!