గుండె లయ

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

గుండె లయ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కవిత దాస్యం

మన ప్రేమ అమరం- అతిశయం
మన ఇద్దరి మధ్య జరిగిన మౌన భాష్యం ఎల్లలెరుగని ప్రేమ కావ్యం
మన మధ్య బంధీ అయిన గాలిసాక్షిగా ఊసులాడుకున్న వైనం అద్భుతం
మనం ఒకరికొకరు అనుభూతి చెందిన క్షణం ప్రణయ కావ్యం
మనకై మనం గడిపిన కాలం క్షణం ఒక యుగం
మన ఇద్దరి మధ్య సరససల్లాపం ప్రేమ కావ్యానికి చెరగని చిహ్నం
ఒకరికొకరు వేరుగా ఉన్న ఒక్కరమే అన్న సంకేతం
తరతరాలకీ తరగని మృదు మధుర భావం
నీవులేని క్షణాన ఊహల జ్ఞాపకాలలో బందీనై
తీరం చేరని నావలా నీకై పరితపించే ఈ ప్రేమ పిపాసిని మరువకే
ఈ జన్మ నిశిధి మయం చేయకే
నన్ను వీడి వెళ్ళ కే
మన బంధం జన్మజన్మల వరమని తెలియజేయవే
ప్రేమకు మించిన వేరొక జన్మ ఫలం లేదని నీ ప్రేమలో గ్రహించానే..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!