మనిషి అంటించుకున్న మనీతత్వం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మనిషి అంటించుకున్న మనీతత్వం

రచయిత:: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి (శ్రీ 💜 శ్రీ)

అసలు మనిషికి ఉండవలసిన తత్వమే మానవత్వం
దాన్ని విడిచి అంటించుకుంటున్నాడు మనిషి మనీతత్వం

మచ్చుకైనా లేకుండా మానవత్వాన్ని గెంటివేసి
పాతుకుపోయింది మనీతత్వం మనిషిలో తిష్టవేసి

మునుపు ఆప్యాయతా,అనురాగం, ప్రేమయంటూ మసలే మనిషి
నేడు నిద్రలేచింది మొదలు మరలా పడుకునేవరకు చూస్తున్నాడు సంపాదనకేసి

ఒకప్పుడు పరులకొరకు కూడా ఆలోచించే నరుడు
ప్రస్తుతం ఎవరేమైతే నాకేంటి అనే దోరణికి వచ్చేసాడు

నాడంతా బంధువులంటూ, స్హేహితులంటూ చూపెను మమకారం
నేడంతా ధనార్జనకోసం లాభాల ధ్యాసగా చేస్తున్నాడు వ్యాపారం

అనాథలను ఆదుకుంటున్నాడు దానికి మానవత్వపు ముసుగువేసి
కానీ చేస్తున్నాడు వ్యాపారం దాని వెనుక వచ్చే డబ్బుచూసి

వృద్ధాశ్రమాలు నడుపుతున్నారు పెద్దమనుషులు తాము చేసేవి సేవలనీ
తెలియనిది కాదు దానిపేర జరిగేది సొమ్ములకోసం వారుచేసే వ్యాపారాలనీ

కరోనాకాలంలో, కష్టకాలంలో పేదలను మానవత్వంతో ఆదుకున్నామంటూ జరిగిన ప్రచారం
చందాల పేర అకౌంట్ లలోకి ఎమౌంట్ లంటూ జనాలవద్ద పైకం గుంజేటి వ్యాపారం

ఎవరికేమి చేసినా
పేరేది పెట్టినా
దానికి వేసే ముసుగు మాత్రం మానవత్వం
దాని వెనుక చేసేది మాత్రం లాభాల వ్యాపారం

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!