మలినమైన మానవత్వం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మలినమైన మానవత్వం

రచయిత: కమల ముక్కు (కమల’శ్రీ’)

వ్యాపారం వ్యాపారం వ్యాపారం             
ఎటు చూసినా వ్యాపారం
ఏం చేసినా వ్యాపారం…!!!

ఆకలితో ఉన్న వాడి
కడుపు నింపుతూ వ్యాపారం…!!!

రోగంతో ఆసుపత్రుల్లో చేరిన వారికి
చికిత్స చేయాలంటే వ్యాపారం…!!!

చికిత్స వికటించి వాడు మరణిస్తే
శవంతోనూ వ్యాపారం
చచ్చిని శవాన్ని కాల్చడానికీ వ్యాపారం…!!!

లాక్ డౌన్ సమయంలో పేదలకు
సహాయం చేయడం లోనూ వ్యాపారం…!!!

కరోనా మహమ్మారి పడిన రోగులకు
ఆక్సిజన్ అందివ్వాలంటే
బెడ్ సమకూర్చాలంటే
మంచి ఆహారం అందివ్వాలంటే
అన్నింటా అంతటా వ్యాపారమే…!!!

మానవత్వపు ముసుగు ధరించి
సేవా సంస్థల పేరుతో డొనేషన్ లు స్వీకరించి
పేదవారికి పైసా కూడా విదల్చకుండా
వారి పబ్బం గడుపుకుంటూ వ్యాపారం…!!!

పుట్టగొడుగులల్లా పెరిగిపోతున్న
ముసుగు వ్యాపారస్తులతో
మానవత్వం మలినమై
భ్రష్టు పట్టిపోతుంది…!!!

తన పేరుని వాడుకుంటూ
తనకి మాయని మచ్చ తెస్తున్న వారిని చూస్తూ
కుమిలి కుమిలి ఏడుస్తోంది
నీతీ నిజాయితీ లకు
మారుపేరైన మానవత్వం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!