మేక వన్నె పులులు

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

  మేక వన్నె పులులు

      రచయిత :: సావిత్రి కోవూరు

మనుషుల వలె ప్రతి ఇల్లు తిరుగుతూ, తీయని
మాటలతో పలకరిస్తూ,

మేకవన్నె పులులు, మానవత్వపు ముసుగు తో పడుచు పిల్లలున్న, పేద తల్లిదండ్రుల చేరి,

ఎనలేని ప్రేమతో, తప్పించుకోలేని వలలు వేసి, ఆపదలో ఆదుకునే  ఆత్మీయుల్లాగా,

వృద్ధులైన కుబేర వరులకు పిల్లనిచ్చిన, కోట్ల డబ్బులిచ్చేరని, అరచేతిలోనా అద్భుతలోకాలు   చూపి,

పసిపిల్లలనైన, పడుచువాళ్ళనైనా, కోట్ల రూపాయల పైకానికమ్మి,

బిక్ష మేసినట్టు కొంత తల్లిదండ్రులకిచ్చి, కోటీశ్వరులైన దళారులెందరో,

కాటికి కాళ్ళు చాచిన ముసలి వారికి, ముక్కుపచ్చలారని పసిపిల్లల నంటగట్టి,

గుట్టుచప్పుడు కాకుండా పెండ్లి అను ఉరివేసి,
గాలి మోటారెక్కించి గాయబు చేతురు.

పరాయి గడ్డపై, పశువుల కన్నా హీనంగ చాకిరీ చేయించి,

ఇంటి మగవారే కాక, తెలిసిన మగ రాక్షసులకు ఫలహారంబుగ పడతి నే పంచి,

ఎగరకుండా రెక్కలు విరచి, నరక మెట్లుండునో భూమిపైనే చూపి, చివరికీ, మట్టిలో కలిపివేతురు
నరరూప రాక్షసులు.

అవకాశమొచ్చి ఎవరైనా ఆదుకుంటే తల్లిదండ్రుల చేరిన పడతులు, బతకలేక చచ్చిన చందమౌదురు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!