గెలిచినా..ఓడినా…ప్రేమ ప్రేమే

(అంశం::”ప్రేమ”)

గెలిచినా..ఓడినా…ప్రేమ ప్రేమే

రచయిత:: హసీనా ఇల్లూరి

ఇల్లంతా పూలతో, బెలూన్ లతో అలంకరిస్తూ.. “సురేష్ వచ్చే టైమ్ కి పూర్తిగా అలంకరించాలి. తను ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఈ రోజు జీవితంలో మర్చిపోని తీపి జ్ఞాపకంగా గుర్తుండి పోవాలి.” అని అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది.

సంతోషంగా వెళ్లి తలుపు తీసిన ప్రవీణ కి సురేష్ కనిపించడంతో నవ్వుతూ సురేష్ చేతిలోని బ్యాగ్ తీసుకోగానే ఇంట్లోకి వచ్చిన సురేష్ ఇల్లంతా అలంకరించి ఉండటం ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని ఉన్న బోర్డ్ చూసి లోపల ఎదో బాధ గుచ్చుతుంటే ‘ఎలా ఉంది’ అన్న ప్రవీణ మాటకి ‘బాగుంది’ అని అన్నాడు.

“అవునా! సరే వెళ్లి స్నానం చేసి బెడ్ మీద నీకోసం బట్టలు పెట్టాను,రెడి అయి వస్తే కేక్ కట్ చేద్దాం” అని అంది.

“బాబు పడుకున్నాడా!?.”

“లేదు. అత్తయ్య వాళ్ళు బాబుని తీసుకొని వదిన వాళ్ళింటికి వెళ్లారు, రెండు రోజుల్లో వస్తారట.”

“హ్మ్మ్ సరే” అని వెళ్లి రెడి అయి వచ్చాడు.

ఇద్దరూ కేక్ కట్ చేసాక ప్రవీణ తినిపించాక సురేష్ కూడా తినిపించాడు. ఇద్దరూ బొంచేసిన తర్వాత ఎవరికి వారు ఆలోచనల్లో పడ్డారు.

“ఆ మొహంలో సంతోషం లేదు, బాధ లేదు. ఏదో తెలియని నిర్లిప్తత..ఏ సురేష్ ని అయితే తాను ప్రేమించిందో ఆ సురేష్ ఇప్పుడు లేడు. ఎందుకు సురేష్ నాతో ఇలా ఉంటున్నావు, నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా!?” అని తాను సురేష్ ని చూసిన రోజులు తలచుకుంటోంది.

“సారీ! ప్రవీణ, నా మనసులో ఇంకొకరు ఉన్నారు. అలాంటప్పుడు నిన్ను నేను ప్రేమించలేను నీతో జీవితాంతం ఉండగలను కానీ నీకు ప్రేమని పంచలేను. అసలు ఒకప్పుడు ఎలా ఉండే జీవితం ఎలా అయ్యింది అని మనసు జ్ఞాపకాల పోరలలోకి జారుకుంది.”

సురేష్, రాజేందర్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఒక్కచోటే పెరిగారు.. ఇద్దరు Mba చేసేటపుడు రాజేందర్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించాడు.

ఒకసారి రాజ్ లావణ్య కోసం వెళ్ళినపుడు సురేష్ ని పిల్చుకెళ్లాడు. అక్కడ లావణ్య కజిన్ సుమలత ని చూసి సురేష్ ఇష్టపడ్డాడు. రాజ్, లావణ్య మాట్లాడుకుంటుంటే సుమలత ని సురేష్ తదేకంగా చూడటం సుమ గమనించింది.

అలా రాజ్ లావణ్య కోసం వెళ్లిన ప్రతిసారి సురేష్ సుమ కోసం వెళ్ళేవాడు. కొన్నాళ్ళకి సురేష్ సుమతో తన ప్రేమ విషయం చెప్పాడు.

సుమ కూడా సురేష్ ని చూసిన మొదటి చూపులోనే ఇష్టపడటంతో సురేష్ ప్రేమని ఒప్పుకుంది. Mba అయిపోయిన తర్వాత రాజ్,లావణ్య లు వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకున్నారు.

సురేష్, సుమ లు ఇంట్లో చెప్తే పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, కారణం అడిగితే సుమ మంచిపిల్ల కాదు మేము ఒప్పుకొము అని ఖరాఖండిగా చెప్పేసారు.

ఏమి చేసినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక పెద్దలు కుదిర్చిన సంబంధము చేసుకున్నాడు.

పెళ్లి అయిన మొదటి రాత్రి శోభనం గదిలోకి అడుగుపెట్టిన అమ్మాయి ని చూసి తన ప్రేమ విషయం చెప్పేద్దామని అనుకున్నాడు.

కానీ అనుకోనివిధంగా ఆ అమ్మాయి “i love you suresh” అని చెప్పడంతో తన వైపు మొదటిసారి చూసాడు. “నిన్ను ఎక్కడో చూసాను” అని అనగానే “హమ్మయ్య! కనీసం నన్ను గుర్తు పడతారో లేదో అని అనుకున్నాను.

‘నువ్వు!!’ అని అంటుండగానే.. “నేను మీ ఫ్రండ్ రాజ్ వైఫ్ లావణ్య ఫ్రండ్ ని. మీరు తనతో పాటు వచ్చినప్పుడు చూసి ప్రేమించాను. మా పెద్దవాళ్ళని ఒప్పించి అత్తయ్య వాళ్ళతో మాట్లాడితే మన పెళ్లికి ఒప్పుకున్నారు.” అని ప్రవీణ చెప్పింది.

ఆ మాటలకి తను ఏమి మాట్లాడలేకపోయాడు. తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాడు. ఎంత మర్చిపోదామనుకున్నా సుమ జ్ఞాపకాలు వీడడటం లేదు, ఇంతలో వాళ్లకో బాబు కూడా పుట్టాడు.

ఇద్దరూ కలిసే ఉన్నారు కానీ, పూర్తి ప్రేమతో లేరు!! ప్రవీణ సురేష్ నుంచి ఏ ప్రేమని అయితే పొందలనుకుందో అది పొందలేకపోతోంది. సురేష్ కూడా తనతో మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాడు.

ఇలా.. ఇద్దరూ గత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ప్రొద్దున్నే లేచి పనులన్నీ చూసుకొని సురేష్ టిఫిన్ తినేసి వెళ్ళగానే ప్రవీణ కూడా బయటకు వెళ్ళింది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సురేష్ ఇంట్లో ఉండగా కొరియర్ వచ్చింది, అది తీసి చూసిన సురేష్ “ప్రవీణ ఏంటిది!? నీకు మతి గాని పోయిందా? ఏంటి నోటీసు??.”

“అందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏముంది??.”

“ఏముందో తెలిసి ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి? అని అడుగుతున్నా.”

“ఈ పెళ్లి వల్ల నాకు సంతోషం లేదు, ప్రేమ దొరకలేదు అలాంటప్పుడు ఎందుకు కలిసి ఉండాలి విడిపోయి ఎవరి బ్రతుకు వారు బ్రతకడం కోసమే విడాకులు కావాలి అని నోటీస్ పంపాను.”

సురేష్ ఏమి మాట్లాడలేకపోయాడు. అది చూసి ప్రవీణ దగ్గరకొచ్చి “సురేష్ నీతో పెళ్లి కుడిరినపుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎంత అంటే చెప్పలేనంత! కానీ మన పెళ్లయ్యాక నువ్వు నాతో సంతోషంగా లేవు!! ఏదో ఉన్నాను అంటే ఉన్నావు.”

అది నేను…అని సురేష్ నసగడం చూసి ‘నన్ను చెప్పనివ్వు సురేష్’ అని తను మాట్లాడ్డం మొదలు పెట్టింది.

“నేను నిన్ను ప్రేమించాను. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నందుకు ఎంతో అదృష్టవంతురాలిని అని పొంగి పోయాను. కానీ నీ మనసులో ఏముందో ఏనాడు తెలుసుకోలేకపోయాను. బహుశా నువ్వు ఇంకొకరిని ప్రేమించావు అన్న ఊహ కూడా నేను చేయలేకపోయానేమో!.

నువ్వు సంతోషంగా లేకపోవడం చూసి ఎందుకు అనేది తెలుసుకోలేకపోయాను, బాబు పుట్టిన తర్వాత కూడా పూర్తి ప్రేమని పొందలేకపోయాను. కారణం “సుమలత” నువ్వు ప్రేమించిన, నిన్ను ప్రేమించిన సుమలత వల్లే నీ ప్రేమని నేను పొందలేకపోతున్నాను.

అసలెందుకు నువ్వు ఇలా ఉంటున్నావో అని కనుక్కుంటే తెలిసింది.. సుమని ప్రేమని మర్చిపోలేక తన గురించి, తన ఆలోచనలు నుంచి బయటపడలేక పోతున్నావని. అందుకె ఈ విడాకులు.”

“నువ్వు విడాకులు ఇచ్చి త్యాగం చేయాలి అనుకుంటున్నావ ప్రవీణ??”

“నేనెం త్యాగం చేయట్లేదు సురేష్.. నన్ను ప్రేమించలేని నీతో ఉంటూ నిన్ను బాధపెట్టి, నేను బాధపడే కంటే.. నిన్ను ప్రేమించిన సుమని నీకు ఇచ్చేస్తే, కనీసం నేను ప్రేమించిన నువ్వు, నిన్ను ప్రేమించిన సుమ హ్యాపీగా ఉంటారు కదా!!.

ఏదో ఒకరోజు నువ్వు నన్ను ప్రేమించట్లేదని నిన్ను నిలదీసి ప్రశ్నిస్తే.. ఇదేం సినిమా కాదు కదా! నువ్వు కళ్ల ముందు ఉంటే చాలు చూస్తూ బ్రతికేయటానికి. నిజ జీవితం! మనం మన జీవితాల్ని బాగు చేసుకునే ఛాన్స్ ఉన్నపుడు ఎందుకు వదులుకోవాలి సురేష్.”

“నేను నిన్ను ప్రేమించడం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు??”

“నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే! నాతో సంతోషంగా ఉంటూ.. సుమ గుర్తొచ్చినపుడు మాత్రమే బాధ పడేవాడివి. కానీ నువ్వెప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలానే ఉన్నావు. నువ్వో ఫ్రండ్ లనే ఉన్నావు నాతో..ఇదే నిజం సురేష్.”

“నేనేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు!! సుమ ఇప్పుడు ఎక్కడ ఉందో! పెళ్లి అయ్యి ఉంటే??.”

“లేదు తను నిన్ను మర్చిపోలేక ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళ బలవంతం చేస్తుంటే తను లండన్ లో జాబ్ చూసుకొని వెళ్ళిపోయింది. నేను అన్ని కనుక్కుని తనకి ఇన్ఫోర్మ్ చేసాను, తను వచ్చేస్తుంది మీరు ఇద్దరూ మాట్లాడుకుని మంచి డెసిషన్ తీసుకోండి.”

“మరి నువ్వు ఎలా??.”

“నాకంటూ ఒక జాబ్ ఉంది. నీ గుర్తుగా బాబు ఉన్నాడు.. నాకంటూ ఇంకో లైఫ్ ఉంటుంది, అది వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా అందుకుంటాను. ప్రతి మనిషి జీవితంలో మూవ్ అవ్వాల్సిన టైమ్ వచ్చినప్పుడు దాన్ని ఆక్సిప్ట్ చేస్తే లైఫ్ లో ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వము.. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అలాంటిదే, నేను ఏదో త్యాగం చేస్తున్నా అని అనుకోను.”

“థాంక్యూ ప్రవీణ.. ఈ మాట చాలా చిన్నది. నా హెల్ప్ అవసరం అయితే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వు మర్చిపోకు!!.”

“తప్పకుండా.. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు!!.”

“???”

“హ హ హ.. ఫ్రండ్ గా అని అన్నాను.”

“హ హ.. సరే.”

“రాబోయే..కొత్త జీవితం గురించిన ఆలోచనలు తో ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోయారు.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!