నా కోడలు బంగారంగాను (కథ సమీక్ష)

నా కోడలు బంగారం గాను (కథ సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకురాలు : సావిత్రి కోవూరు

నేను సమీక్ష వ్రాసే కథ “నా కోడలు బంగారం గాను”, రచయిత్రి సావిత్రి కోవూరు. ఈకథ తపస్వీ మనోహరం అంతర్జాల పత్రికలో ప్రచురించబడినది.
( తపస్వీ మనోహరం లింక్ కలదు. దయచేసి చదివి మీ అభిప్రాయం, సూచనలు తెలుపగలరు)
రచయిత్రి సమాజములోని వ్యక్తుల సమస్యలను తీసుకొని కథలల్లి, ఆ సమస్యల పట్ల తన స్పందనతో కథను పరిపుష్టం చేసి, ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడ పాత్రల ద్వార చేయించడంలో కృతకృత్యురాలయింది.
ఈ కథలో శ్రీనిధి అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాని ఆ అమ్మాయికి ఎప్పటికి ఉద్యోగం చేస్తూ యాంత్రిక జీవితం గడపటం ఇష్టముండదు. ఉదయం లేచినప్పటి నుండి హడావుడిగా రెడీ అవడం, ఆఫీస్ కి వెళ్ళడం ప్రాజెక్టులు, డెడ్లైన్ లు అనుకున్న టైమ్ కి పని పూర్తవ్వక పోతె పై ఆఫీసర్స్, కస్టమర్ తో ఫ్రెషర్స్,  టెన్షన్స్ లేకుండ హాయిగా తన జీవితం తన ఇష్టమొచ్చినట్టు గడపాలని, వ్యక్తిగత ఆసక్తులను పెంపొందించుకోవాలని, ఇంటిపనులను, చేసుకుంటు, టీ.వి చూస్తూ, ప్రశాంతమైన జీవితం, గడుపుతు జీవితాన్ని పరిపుష్టిగా అనుభవించాలనే అరుదైన కోరికలు కలిగిన అమ్మాయి. తండ్రితో తన ఉద్యోగం చూసి, తన జీతం చూసి చేసుకునే అబ్బాయిని పెండ్లి చేసుకోనని  ఖరాఖండిగా చెప్తుంది. ఆమే అభిరుచులకు తగ్గ సంబంధం వచ్చింది. కాని ఆమె ఇంజనీరింగ్ చేసి కూడ ఇంటర్ వరకే చదివిందని అబద్ధం చెప్పాల్సి ఉంటుందని ఆమె తండ్రి చెబుతాడు. దానికి ఒప్పుకుని పెండ్లి చేసుకుని తను కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తూ, కుటుంబం సమస్యల్లో చిక్కుకుని ఆర్ధికంగా చితికి పోయినప్పుడు తన ఆసక్తులన్ని పక్కన పెట్టి ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటుంది.

 

నా కోడలు బంగారం గాను (కథ)

https://thapasvimanoharam.com/weekly-magazines/weekly-magazine-24-10-2021/

తపస్వి మనోహరం వారపత్రిక 24-10-2021

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!