అంశం : అందమైన అబద్ధం
ఎండమావులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : ఎస్.ఎల్. రాజేష్
నువ్వే ప్రాణం అన్నావు.
నువ్వు లేనిదే నేను లేనన్నావు.
గుండెల నిండా నేనే ఉన్నానని,
ప్రతీ ఆలోచనలో ప్రతి కదలికలో
కదలాడుతూ ఉంటా అని ఊసులు
ఎన్నో చెప్పావు.
నీ రాకతో వసంతాలు వస్తాయని,
నక్షత్రాల వాన కురుస్తుంది అని
మరిపించావు.
పగలురేయి నీ ధ్యాస తోనే
గడుపుతున్నా అన్నావు.
నీవు లేని జీవితం వ్యర్థం అని
నిన్ను విడిచి వెళ్లనని
ప్రమాణాలు చేసావు.
అందమైన ప్రేమలోకాన్ని చూపావు.
ఇదంతా నిజమని నమ్మిన వేళ
అందమైన అబద్దమని చెప్పి
అంతు లేని కలగా మిగిలిపోయావు
శిలగా నా మనసును మార్చివేసావు.